కార్తీకదీపం ఆగస్టు 18 వారం ఎపిసోడ్ (Karthika Deepam August 18 Episode 1434)


సౌందర్య, ఆనందరావు, హిమ...అమెరికా ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటుంటారు. ఇంత అన్యాయం చేసి వెళ్లిపోయావేంటి పెద్దోడా, డాక్టర్ బాబు డాక్టర్ బాబూ అంటూ వాడి ప్రేమకోసం తపిస్తూ చివరకి వాడితో కలసి వెళ్లిపోయావు అని ఏడుస్తుంది సౌందర్య. భరించలేని బాధను మాకు వదలిశారని భావోద్వేగానికి లోనవుతుంది. హిమ మాత్రం శౌర్యతో కలసి ఉన్న ఫొటో చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఉన్నంతకాలం జ్ఞాపకాలు మోస్తూ కాలంతో పాటూ ముందుకెళ్లడమే మనం చేయగలిగే పని అంటాడు ఆనందరావు. ఇంతలో క్యాబ్ వచ్చిందని ఆ ఇంటి వాచ్ మెన్ చెప్పడంతో లగేజ్ మొత్తం తీసుకెళ్లిపోతాడు. ఏకంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతారు. శౌర్య కచ్చితంగా దొరుకుతుంది కదా అని హిమ అంటే..వెతికిస్తున్నా అమ్మా తప్పకుండా దొరుకుతుంది అంటుంది.


Also Read: ఒకే బస్సులో దీప-శౌర్య ప్రయాణం, డాక్టర్ బాబు పిలుపువిని పరవశించిన వంటలక్క


హైదరాబాద్ కి బస్సులో వెళుతున్న దీప...గతమంతా గుర్తుచేసుకుని బాధపడుతుంది. ఈలోగా దారిలో ఏదైనా తినేందుకు బస్సు ఆపుతారు. అదే బస్సులో ఉన్న శౌర్య..తన పిన్ని, బాబాయ్ తో నాకు ఆకలిలేదు మీరు వెళ్లి తినండి అంటుంది.  బస్సు ఇక్కడ తర్వాత హైదరాబాద్ లోనే ఆగుతుంది. దారిలో ఎక్కడ ఆగదు ఆకలేస్తే ఏం చేయలేం అని శౌర్యని ఒప్పించి తీసుకెళతారు.  కిందకి దిగి షాప్ ముందు కూర్చుంటుంది శౌర్య.  దీప బస్సులోనే ఉండిపోతుంది . ఈలోగా కండక్టర్ ఇప్పుడు తినకపోతే మళ్లీ హైదరాబాద్ వరకు తినలేరు మేడం అని అంటారు. అప్పుడు దీప కిందకు దిగుతుంది. ఈ లోగ శౌర్య బన్ తింటూ పొలమారుతుంది. మంచినీళ్లు కోసం పక్క షాప్ కి వెళ్తే 500 చేంజ్ లేదనడంతో అదే సమయంలో దీప కూడా ఆ షాప్ కి వెళ్లి మంచినీళ్లు కొంటుంది. అప్పుడు నా దగ్గర చేంజ్ లేదు మేడం మీ దగ్గర చేంజ్ ఉందా? అని అడగగా నా దగ్గర చేంజ్ లేదండి వాటర్ బాటిల్ నేనే కొనిస్తాను మీరు తీసుకోవడానికి మొహమాట పడితే అమ్మ కొనిచ్చిందని ఆ పాపకి చెప్పండి అంటుంది. శౌర్య వాళ్ల పిన్ని మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చి డబ్బులు తీసుకోకుండానే వాటర్ బాటిల్ ఇచ్చిందని చెబుతుంది.  నేను ఆవిడకి థాంక్స్ చెప్తాను అని శౌర్య అనడంతో బస్సులోనే ఉంటారు కదా తర్వాత చెబుదువుగానిలే అంటుంది.


ఆ తర్వాత సీన్లో దీప కి వైద్యం చేసిన డాక్టర్ బయట గార్డెన్లో కూర్చుని ఫైల్స్ చూస్తూ ఉండగా ఒక నర్స్ వచ్చి ఆవిడ భర్త దొరకలేదు కదా సార్ అని అంటుంది. అప్పుడు ఆ డాక్టర్ ఇప్పుడు వాళ్ళ భర్త బతకడం కన్నా వాళ్ళ పిల్లలకు తను బతికి ఉందని విషయం తెలియడం ముఖ్యం...మనం కూడా వెతికేందుకు సహాయం చేయాలంటాడు.


Also Read: నేను గెలిచాను వసుధార అన్న ఈగోమాస్టర్, జగతికి బంపర్ ఆఫర్ ఇచ్చిన రిషి


మరోవైపు మనకు వాటర్ బాటిల్ ఇచ్చిన ఆమెకు థ్యాంక్స్ చెబుతాను పిన్నీ అని శౌర్య అంటే..ఆవిడ నిద్రపోతున్నారు తర్వాత చెబుదువుగానిలే అంటుంది. కొద్దిసేపటి తర్వాత శౌర్య నిద్రపోతుంది..శౌర్య ముఖంపై దుప్పటి కప్పేస్తారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత బస్సుదిగుతుండగా శౌర్యని దీప చూస్తుంది కానీ ముఖంపై ముసుగు ఉండడంతో గుర్తుపట్టదు. పాప మీకు థాంక్స్  చెబుదాం అనుకుందమ్మా కానీ నిద్రపోతోంది అంటుంది చంద్రమ్మ. ఏం పర్వాలేదమ్మా అని చెప్పి దీప వెళ్లిపోతుంది. హమ్మయ్య హైదరాబాద్ వచ్చేశాం..నువ్వు మీ నానమ్మతాతత్య ఇంటికి వెళ్లిపోతే మా బెంగతీరిపోతుంది అంటారు ఇంద్రుడు, చంద్రమ్మ. ఇంక మేం ఎవరో కూడా తెలియదు మన పరిచయం లేనట్టే అనుకో అని అనడంతో శౌర్య వాళ్ళని తిడుతుంది మీరు నాకు పరిచయం లేదు కదా మరి వెళ్ళిపోండి అని అరుస్తుంది. ఊరికే అన్నాం అమ్మా అంటారు...


Also Read: మార్చురీలో శవం డాక్టర్ బాబుది కాదంటూ కుదుటపడిన దీప, కార్తీక్ కోసం మరో డాక్టర్ వెతుకులాట


రేపటి( శుక్రవారం) ఎపిసోడ్ లో
గుడిలో దండం పెట్టుకుంటుంది దీప... ప్రమాదం జరిగిన రోజే ఎవరో ఒకర్ని హాస్పిటల్లో చేర్చారని చెబుతున్నారు.. ఆయనే డాక్టర్ బాబు అయ్యేలా చూడు స్వామి అని అనుకుంటుంది. ఇంతలో వెనుక నుంచి దీపా అనే పిలుపు వినిపిస్తుంది... అక్కడ కార్తీక్ ఉంటాడు....