వేద తలస్నానం చేసి తల తుడుచుకుంటూ ఉంటే పనిమనిషి లక్ష్మీ వస్తుంది. తనని ధూపం తెమ్మని అడుగుతుంది. తెచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతుంది. తను ఇంక ఉండాయి అనుకుని తలకి ధూపం వెయ్యమని చెప్తుంది. అప్పుడే అక్కడికి యష్ వస్తాడు. పూజ కోసం వేదకి చీర కొని తీసుకొస్తాడు. యష్ వేద జుట్టుకి ధూపం వేస్తూ తన నడుము అందాల్ని చూసి మైమరచిపోతాడు. వేద వాగుతూ జుట్టు గురించి క్లాస్ తీసుకుంటుంటే ఏం గతి పట్టింది రా నీకు అన్నట్టు మొహం పెడతాడు యష్. అది భలే కామెడిగా ఉంటుంది. వేద మాట్లాడుతూనే వెనక్కి తిరిగి చూసేసరికి యష్ ఉంటాడు. వేదకి చీర ఇస్తాడు యష్. త్వరగా కట్టుకుని వస్తే పూజ స్టార్ట్ చేద్దామని చెప్తాడు.


మాలిని, సులోచన ఇంట్లో పూజకీ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. వేద అందంగా రెడీ అయ్యి ఉంటుంది. చాలా అందంగా ఉన్నావ్ అమ్మా అని ఖుషి తనకి ముద్దు పెడుతుంది. వేదని చీర మార్చుకోమని చెప్తుంది. ఎందుకు ఇది బాగానే ఉంది కదా మీ అల్లుడుగారు ఇచ్చారని వేద చెప్తుంది. తర్వాత కట్టుకోవచ్చు కదా పూజకీ పుట్టింటి వాళ్ళు పెట్టింది కట్టుకోవడం మన ఆచారం కదా, ఈ వ్రతం కోసం నువ్వు కచ్చితంగా పుట్టింటి చీర కట్టుకోవాలి అని సులోచన చెప్తుంది. ఆ మాటలు అప్పుడే అటుగా వెళ్తున్న యష్ చెవిన పడతాయి. ఆచారం కన్నా నాకు ఆయన సంతోషమే ముఖ్యమని అనిపిస్తుందమ్మా నా కోసం ఆయన తెచ్చిన మొదటి బహుమతి, దీన్ని కట్టుకోవడానికి ఇంతకన్నా మంచి సంధర్భం ఉండదని అనిపిస్తుందని వేద చెప్తుంది. ఆ మాటలకి యష్ సంతోషిస్తాడు. అయినా కానీ సులోచన చీర మార్చుకోవాలి అంటుంది. పూజ ఆనందం కోసమే కదా వ్రతం చేస్తుంది నేను కూడా అదే చేస్తున్నా అని వేద అంటే అమ్మవారి కంటే అల్లుడుగారు ఎక్కువ అని సులోచన అంటుంది.


Also Read: అభిమన్యుతో ఎందుకు చేతులు కలిపారని నిలదీసిన కాంచన- అభి, మాళవిక చేతిలో యష్ బిజినెస్ సీక్రెట్స్


‘అమ్మవారి ఆశీర్వాదం కన్నా నా భర్త ఆనందం ముఖ్యం అంటున్నాను. ఈ చీర నాకీ ఇచ్చేటప్పుడు ఆయన కళ్ళల్లో ప్రశ్న చూశాను నేను ఇచ్చేదీ చేసేది వేదకి నచ్చుతుందా అని మరి డానికి సమాధానం నేను ఇవ్వక ఎవరు ఇస్తారు. ఈ చీర చూసిన వెంటనే నాకు రంగు కనపడలేదు ఆయన పడిన తాపత్రయం కనిపించింది, ఖరీదు చూడలేదు ఆయన మనసు తెలిసింది. ఇంతకన్నా అందమైన చీరని తీసుకోవడం ఏ భర్తకి సాధ్యం కాదు కట్టుకోకుండా దాన్ని పక్కన పెడితే నా అంత దురదృష్టవంతురాలు ఉండదు అందుకే ఆయన సంతోషం కోసం కట్టుకున్నా’ అని వేద చెప్తుంది. సరే ఉంచుకో అని సులోచన అంటుంది. మేము దేవుడు కోసం వ్రతాలు చేస్తే నువ్వు నీ భర్తలోనే దేవుడ్ని చూసుకుంటూ భర్త సంతోషం కోసం ఆలోచించడం చాలా గొప్ప విషయం, ఈ అదృష్టాన్ని కన్నందుకు ఎంత ఆనందంగా ఉందో అని సులోచన మెచ్చుకుంటుంది. వేద మాటలకి యష్ ఎమోషనల్ అవుతాడు.


వేద, యష్ కలిసి పూజ చేస్తారు. తర్వాత భర్త ఆశీర్వాదం కోసం వేద యష్ కాళ్ళకి నమస్కరిస్తుంది. ఏమని ఆశీర్వదించాలో తెలియక యష్ తన తల్లిని అడిగితే దీర్ఘ సుమంగళి భవ అని దీవించమని చెప్తుంది. యష్ అలాగే అని తనని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వచనం పూర్తయింది ఇంక ఎవరైనా ఉన్నారా అని పూజారి అడిగితే నేనున్నాను అని ఖైలాష్ ఎంట్రీ ఇస్తాడు. అతన్ని చూసి అందరూ షాక్ అవుతారు. యష్, వేద కోపంగా చూస్తారు. యష్ కోపంగా ఖైలాష్ కలర్ పట్టుకుని ఎంత ధైర్యం నీకు నువ్వు నా గడప తొక్కడానికి వీల్లేదు బయటకి వెళ్ళు అని అరుస్తుంటే మాలిని, కాంచన ఆపేందుకు ప్రయత్నిస్తారు.


ఈ ఇంటి అల్లుడికి ఇచ్చే మర్యాద ఇదేనా అని ఖైలాష్ అంటాడు. నువ్వు రమ్మంటే రాలా పొమ్మంటే పోడానికి నా పెళ్ళాం పిలిచింది వచ్చి ఆశీర్వదించమని అందుకే వచ్చాను. ఒక పక్కన నా దగ్గరకి వస్తావ్ జాలి చూపిస్తావ్ మంచితనం ప్రదర్శిస్తావ్ ఇంకో పక్క ఇంటికి వస్తే నీ మొగుడు చేత ఇలా అవమానిస్తావ్ ఏంటి ఈ డబుల్ డ్రామా అని ఖైలాష్ వేదని అంటాడు. ఆ మాటకి వేద తండ్రి మా వేద నీ దగ్గరకి వచ్చి జాలి చూపించిందా అని అడుగుతాడు. ఆడగాల్సింది నాను కాదు అక్కడ ఎందుకు నా మీద కేసు పెట్టి లోపల వేయించిందో ఎందుకు మళ్ళీ తనకి తానుగా స్టేషన్ కి వచ్చి నా మీద కేసు వాపస్ తీసుకుందో అని ఖైలాష్ అంటాడు. మాకు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదని సులోచన వాళ్ళు అడుగుతారు. తనకి చెప్పిందని యష్ చెప్తాడు. ఎందుకు ఇలా చేశావ్ ఈ నీచుడి వల్ల ఎంత క్షోభ పడ్డావ్ అలాంటిది ఎందుకు కేసు వాపస్ తీసుకున్నావని అడుగుతారు.


Also Read: దేవి ముందు ఆదిత్యని ఇరికించి పైశాచికానందం పొందిన మాధవ- రాధ, ఆదిత్యల ఆవేశం


ఎందుకంటే తను వేద తనకి క్షమించడం మాత్రమే తెలుసు, సాటి ఆడదాని బాధ అర్థం చేసుకోవడం తెలుసు అందుకే తనని ఎంతో కష్టపెట్టిన ఈ నీచుడిని కడుపుతో ఉన్న తన ఆడపడుచు కోసం క్షమించగలిగింది. తనకి తానుగా ఈ నిర్ణయం తీసుకుని కేసు వాపస్ తీసుకుందని యష్ చెప్తాడు. అది వేద అంటే వేద భర్తని అయినందుకు గర్వపడుతున్నాను అని అంటాడు. ఖైలాష్ చప్పట్లు కొడుతూ నీకు నీ భార్య ఎంత గొప్పో నా భార్య కూడా అంటే గొప్ప అడగటానికి నువ్వు ఎవరు అని అంటాడు. యష్ మాత్రం ఖైలాష్ మీద కొప్పడతాడు. నన్ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు కదా ఈ ఇంటి ఆడపడుచుని కూడా వెళ్లగొట్టండి పద కంచు మనం వెళ్లిపోదాం అని అంటాడు. కాంచన ఆగు అని వేద అంటుంది. ఈ రోజు గొడవలు ఉండకూడదు అమ్మవారి శీర్వాదం తనకి తన కడుపులో బిడ్డకి అవసరం ఖైలాష్ గారు కాంచనని ఆశీర్వదించండి అని వేద చెప్తుంది. నేను మీతో పాటే వస్తాను నన్నీ తీసుకెళ్లిపోండి అని కాంచన ఏడుస్తూ అడుగుతుంది. ఇప్పుడు కాదు తర్వాత అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టు అని చెప్తాడు. 


తరువాయి భాగంలో.. 


యష్, మాళవిక ఇద్దరు ఒకేసారి గుడిలో దేవుడి ముందు దణ్ణం పెట్టుకోడానికి వస్తారు. పూజారి అర్చన చెయ్యమంటారా పేర్లు చెప్పమని అడుగుతాడు. ఇద్దరు ఒకేసారి ఆదిత్య అని మొహాలు చూసుకుంటారు. ఈరోజు నా కొడుకు పుట్టిన రోజు అర్చన చెయ్యమని యష్ చెప్తాడు.