ఖుషికి బోర్ కొత్త టీవీ ఆన్ చేసి చూస్తుంది. అందులో ఒక మంచి సాంగ్ వస్తుంది. అది చూసి అమ్మ, నాన్న కూడా ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అని ఆ సాంగ్ లో యష్, వేద వాళ్ళని ఊహించుకుంటుంది ఖుషి. మాలిని సులోచన వాళ్ళని పిలుస్తుంది. వేదతో మంగళ గౌరి వ్రతం చేయించాలని అనుకుంటున్నట్టు చెప్తుంది. ఆ పూజ చేస్తే అన్ని క్లియర్ అయ్యి అందరూ సంతోషంగా ఉంటామని మాలిని అంటుంది. ఈ పూజ దగ్గరుండి చూసుకోమని సులోచనకి చెప్తుంది మాలిని.


ఖుషి, యష్ కలిసి గేమ్ ఆడుకుంటూ ఉంటారు. అందులో ఖుషి గెలుస్తుంది. నేనే గెలిచాను అంటూ సంబరంగా చెప్తుంది. నేను గెలవాలని కావాలని ఒడిపోతున్నావ్ కదా అని ఖుషి అడిగితే నా బంగారు తల్లి నా కన్నా బాగా ఆడుతుంది కాబట్టి అని యష్ అంటాడు. నెక్స్ట్ గేమ్ నాతో కాదు అమ్మతో ఆడు అప్పుడు నీకు గేమ్ వస్తుందో రాదో తెలుస్తుందని ఖుషి అంటుంది. వద్దులే మమ్మీ వస్తే మనతో ఆడుకుంటుంది అని యష్ అంటాడు. అలా ఇద్దరు కలిసి కాసేపు నవ్వుతూ ఆడుకుంటారు. మాలిని వచ్చి వెడతో మంగళ గౌరి వ్రతం పూజ చేయిస్తానని చెప్తుంది. అందుకోసం వేద కోసం మంచి చీర తీసుకురమ్మని చెప్తుంది. చీరాల విషయంలో మనకి జీరో నాలెడ్జ్ కదా, ఏదో ఆలోచిస్తూ ఒకే చెప్పేసానే.. ఇప్పుడు ఎలా అని యష్ ఆలోచనలో పడతాడు. అక్కడ ఉన్న వాటిలో ది బెస్ట్ తీసుకొస్తాను అని అనుకుంటాడు.


Also Read: ఖైలాష్ కి వేద స్ట్రాంగ్ వార్నింగ్, సులోచన మాటలకి ఎమోషనలైన మలబార్ మాలిని


కాంచన ఖైలాష్ ని కలిసేందుకు రెస్టారెంట్ కి వస్తుంది. నిన్ను చాలా మిస్ అవుతున్నాను కంచు, నిన్ను చూడకపోయేసరికి ఇంక జైల్లోనే ఉన్నానని అనిపిస్తుంది. ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉందని అంటాడు. నువ్వు నీ ఫ్యామిలీ హెల్ప్ చేయకపోయినా నేను బయటకి వచ్చినందుకు సంతోషంగా లేదా అని అడుగుతాడు. మీకు ఆ అభిమన్యు సాయం చెయ్యడం తనకి అసలు నచ్చలేదని కాంచన అంటుంది. మీరు ఎ తప్పు చేయలేదని నేను కూతుతమబాన్ని ఎదిరించి మరి మాట్లాడుతుంటే మీరు మా కూతుతమబానికి శత్రువైన ఆ అభిమన్యు సహాయం ఎందుకు తీసుకున్నారని కాంచన అడుగుతుంది. నేను అడగలేదు అభిమన్యు వచ్చి బెయిల్ ఇచ్చాడని చెప్తాడు. యష్ జీవితం ఇలా అయిపోవడానికి కారణం వాడే అలాంటి వాడు నీకు బెయిల్ ఇచ్చాడని ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో తెలుసా అని కాంచన అంటే శబాష్ ఖైలాష్ భార్యగా కాకుండా యశోధర్ అక్కగా మాట్లాడావ్.. ఆడపిల్లకి భర్తకన్నా పుట్టింటి మీదే ప్రేమ ఎక్కువని నిరూపించావని కోపంగా అంటాడు. అభిమన్యు మంచోడు కాకపోవవచ్చు కానీ నన్ను బయటికి తీసుకొచ్చాడు, నాకు ఉద్యోగం కూడా ఇచ్చాడు నా దృష్టిలో అతడు మంచివాడు అని ఖైలాష్ అంటాడు.


మనంఇద్దరం ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా బతుకుదామని కాంచన చెప్తుంది. వద్దు నేను బాగా సంపాదించి మన బిడ్డకి ఇల్లు కట్టిన తర్వాత వెళ్దాం, అప్పటి వరకు నువ్వు పుట్టింట్లోనే ఉండు నేను అభిమాయు దగ్గర ఉంటాను, మన జీవితం బాగుండటం కోసం ఈ ఎడబాటు తప్పదు అని ఖైలాష్ నమ్మబలుకుతాడు. సులోచన వేద, ఖుషి కోసం బట్టలు తీసుకుని వస్తుంది. అవి చూసి ఖుషి చాలా సంతోషిస్తుంది. ఖైలాష్ ఫోన్ చూసుకుంటూ మంచం మీద అడ్డంగా పడి దొర్లుతుంటే అక్కడికి అభి, మాళవిక వస్తారు. నువ్వు ఇక్కడికి వచ్చింది మంచం మీద అడ్డంగా పడుకోవడానికి కాదు యష్ బిజినెస్ సీక్రెట్స్ చెప్పడానికి అని మాళవిక అంటుంది. చెప్తాను అదే పనిలో ఉన్నానని అంటాడు. అప్పుడే కాంచన ఫోన్ చేస్తుంది. ఇంట్లో వ్రతం చేస్తున్నారు మీరు కూడా రండి అని కాంచన అడుగుతుంది. నేను ఎలా వస్తాను పూజ పేరు చెప్పి పాడే కట్టించినట్టు ఉన్నావే అని అంటాడు. ఆ ఇంట్లో పూజకి వెళ్ళమని అభి, మాళవిక వెళ్ళమని ఖైలాష్ కి చెప్తారు. నువ్వు వెళ్తే నిన్ను చూసి అక్కడ అందరు మొహాలు మాడిపోతాయి యుద్ధాలు జరుగుతాయి చాలా కలర్ ఫుల్ గా ఉంటుందని అభి చెప్పడంతో సరే వెళ్తాను అంటాడు.


Also Read: డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటూ హాస్పిటల్ ని హోరెత్తించిన వంటలక్క, మార్చురీలో శవం కార్తీక్ దేనా!


వసంత్ చిత్రని తలుచుకుని బాధపడుతూ ఉంటే యష్ వస్తాడు. నిధిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే కదా మనస్పూర్తిగానే ఒప్పుకున్నావ్ కదా అని వసంత్ ని అడుగుతాడు. ఇష్టమే నువ్వు తెచ్చిన సంబంధం కదా నో అని ఎందుకు చెప్తాను అని వసంత్ అంటాడు. నీ మాట జెవదాటను నువ్వు వెళ్ళు యష్ అని చెప్పి బాధగా వెళతాడు. లేదు వసంత్ నన్ను గెలిపించడం కోసం నువ్వు ఒడిపోతున్నావ్ నా మీద ఇంత నమ్మకం పెంచుకున్న వసంత్ విషయంలో నేను చేస్తున్నది కరెక్టేనా అని యష్ ఆలోచనలో పడతాడు.