కార్తీకదీపం ఆగస్టు 17 బుధవారం ఎపిసోడ్ (Karthika Deepam August 17 Episode 1433)
దీపకి మరో అన్నయ్య దొరికాడు. డాక్టర్ బాబుని వెతికేముందు ఇంటికెళదాం అని ఇంటికి తీసుకెళ్లిన డాక్టర్..చెల్లెల్ని తీసుకొచ్చానంటూ తన తల్లికి పరిచయం చేస్తాడు.దేవుడు, మంచి, చెడుపై కొంతసేపు డిస్కషన్ జరుగుతుంది. రాంపడు అనే మరో రెండు కొత్త క్యారెక్టర్లు ఎంటరయ్యాయి. త్వరగా వంటచేయండి గెస్టులొచ్చారని చెబుతుంది. మంచి రుచికరమైన భోజనం తిని ఎన్నాళైందో అంటుంది డాక్టర్ తల్లి. వంటగది ఎక్కడమ్మా నేను చేస్తానంటూ రంగంలోకి దిగించి వంటలక్క.
అటు శౌర్య మాత్రం ఇంద్రుడు,చంద్రమ్మ ఇంట్లో డల్ గా కూర్చుని ఉంటుంది. ఆడపిల్లవి, అయినింటిబిడ్డవి నువ్వు ఈ పేదింట్లో ఎలా బతుకుతావు నువ్వు మీ ఇంటికి వెళ్లిపోమ్మా అంటారు. హిమ ఉన్న ఆ ఇంట్లో నేను ఉండలేను, వెళ్లేది లేదని చెబుతుంది శౌర్య. చిన్న చిన్న దొంగతనాలు చేసుకుని బతుకుతాం..అప్పుడు కూడా మాకు కావాల్సినంత తీసుకుని మిగిలినది పెట్టేస్తాం.. అలా నీకు హిమ నచ్చకపోయినా తాతత్య, నానమ్మ, బాబాయ్, పిన్ని అందరూ ఇష్టం కదా.. అమ్మా నాన్న దూరమై నువ్వెంత బాధపడుతున్నావో..నువ్వు దూరమైతే వాళ్లుకూడా అంతే బాధపడతారు కదా, మా బిడ్డ నాలుగో నెలలో దూరమైంది..అలాంటిది ఇంతకాలం పెంచిన నువ్వు దూరమైతే వాళ్లెంత బాధపడతారో కదా అని హితబోధ చేస్తారు. ఎట్టలేకలు హైదరాబాద్ వెళ్లేందుకు ఒప్పిస్తారు..సరే అంటుంది శౌర్య...
Also Read: మార్చురీలో శవం డాక్టర్ బాబుది కాదంటూ కుదుటపడిన దీప, కార్తీక్ కోసం మరో డాక్టర్ వెతుకులాట
అటు వంటలక్క...డాక్టర్ ఇంట్లో రుచిగా వండిపెడుతుంది. దీప వంటల్ని పొగిడేస్తారంతా. మీరు వంటచేసినా ఇలానే ఉంటుందని దీప అంటే..నా డాక్టర్ కొడుకు వంటింట్లోకి వెళ్లనివ్వడంలేదంటుంది. అప్పట్లో వంట చేయొద్దు, పొగపీల్చొద్దని కార్తీక్ అన్న మాటలు గుర్తుచేసుకుని దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. దీపను ఓదార్చుతారంతా. ముందు హైదరాబాద్ వెళ్లి పిల్లల్ని తీసుకొచ్చాక ఆయన్ను వెతుకుతాను అంటుంది. దీప హైదరాబాద్ బయలుదేరి వెళుతూ ...యాక్సిడెంట్ గుర్తుచేసుకుంటుంది. పిల్లల కళ్లముందే మేం లోయలో పడిపోయాం..ఎంత ఏడ్చి ఉంటారో అని బాధపడుతుంది. కొడుకు,కోడలు పోయిన బాధను అత్తయ్య,మావయ్య దిగమింగుకోవడం ఎంత కష్టమో కదా..అందరం కలసి డాక్టర్ బాబుకోసం వెతకాలి అనుకుంటుంది.
అటు శౌర్యని తీసుకుని ఇంద్రుడు, చంద్రమ్మ కూడా హైదరాబాద్ బయలుదేరుతారు. నానమ్మ తాతయ్య దగ్గరకు వెళుతున్నప్పుడు సంతోషంగా ఉండాలి కదా అని ఇంద్రుడు, చంద్రమ్మ అంటే.. అక్కడ హిమ ఉన్నంత వరకూ సంతోషం ఎలా ఉంటుంది బాబాయ్ అంటుంది శౌర్య. అది కనిపించిన ప్రతీసారీ దానివల్ల అమ్మానాన్నకి జరిగిన ప్రమాదమే గుర్తొచ్చి కోపం వస్తోంది. ఏమీ చేయలేక దూరంగా వచ్చేశాను..కానీ మళ్లీ అక్కడకే వెళ్లమంటున్నారు. ఎక్కడున్నా బాధే కదా..ఆ బాధని ఎలా మర్చిపోవాలో ఆలోచించాలి కానీ కోపం పెంచుకోవడం మంచిది కాదని..నానమ్మ, తాతయ్య దగ్గరకు వెళితే సగం కోపం పోతుందని చెబుతారు.
Also Read: డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటూ హాస్పిటల్ ని హోరెత్తించిన వంటలక్క, మార్చురీలో శవం కార్తీక్ దేనా!
హైదరాబాద్ వెళ్లడానికి బస్సెక్కిన వంటలక్క.. ఇంతకన్నా ఆనందం ఏముంది వంటలక్కా ఇవాళే ఆఖరి రోజు అయినా పర్వాలేదన్న మాటలు గుర్తుచేసుకుని బాధపడుతుంది.నాకు డ్రైవింగ్ అవసరమే లేదు మా డాక్టర్ బాబు ఉన్నారు కదా మీరే నా లోకం మీరే నా ప్రపంచం అన్న మాటలు గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరోవైపు దీప ఉన్న బస్సుని ఆపిన ఇంద్రుడు, చంద్రమ్మ, శౌర్య..అదే బస్సు ఎక్కుతారు.
సౌందర్య, ఆనందరావు, హిమ...అమెరికా ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటుంటారు. ఇంత అన్యాయం చేసి వెళ్లిపోయావేంటి పెద్దోడా, డాక్టర్ బాబు డాక్టర్ బాబూ అంటూ వాడి ప్రేమకోసం తపిస్తూ చివరకి వాడితో కలసి వెళ్లిపోయావు అని ఏడుస్తుంది సౌందర్య. భరించలేని బాధను మాకు వదలిశారని భావోద్వేగానికి లోనవుతుంది. హిమ మాత్రం శౌర్యతో కలసి ఉన్న ఫొటో చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.
రేపటి( గురువారం) ఎపిసోడ్ లో
గుడిలో దండం పెట్టుకుంటుంది దీప... ప్రమాదం జరిగిన రోజే ఎవరో ఒకర్ని హాస్పిటల్లో చేర్చారని చెబుతున్నారు.. ఆయనే డాక్టర్ బాబు అయ్యేలా చూడు స్వామి అని అనుకుంటుంది. ఇంతలో వెనుక నుంచి దీపా అనే పిలుపు వినిపిస్తుంది... అక్కడ కార్తీక్ ఉంటాడు....