Stock Market Opening Bell 18 August 2022: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. సూచీలు గరిష్ఠాలకు చేరడంతో మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపడుతున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 7 పాయింట్ల నష్టంతో 17,936 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 34 పాయింట్ల నష్టంతో 60,225 వద్ద కొనసాగుతున్నాయి. ఐటీ, హెల్త్‌కేర్‌, మెటల్‌ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది.


BSE Sensex


క్రితం సెషన్లో 60,260 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,080 వద్ద మొదలైంది. 59,969 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,243 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 34 పాయింట్ల నష్టంతో 60,225 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


బుధవారం 17,944 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,898 వద్ద ఓపెనైంది. 17,863 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,942 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 7 పాయింట్ల నష్టంతో 17,936 వద్ద చలిస్తోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ఉంది. ఉదయం 39,324 వద్ద మొదలైంది. 39,291 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,324 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 108 పాయింట్ల లాభంతో 39,570 వద్ద ట్రేడవుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 25 కంపెనీలు లాభాల్లో 25 నష్టాల్లో ఉన్నాయి. ఎస్‌బీఐ లైఫ్‌, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సై లైఫ్‌, ఎస్‌బీఐ, హిందుస్థాన్‌ యునీలివర్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ఫార్మా, బీపీసీఎల్‌, విప్రో, సిప్లా షేర్లు నష్టాల్లో చలిస్తున్నాయి. ఆటో, ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. బ్యాంకు, ఫైనాన్షియల్స్‌, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్‌, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.