Stock Market Closing Bell 17 August 2022: భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. మదుపర్లు కొనుగోళ్లు చేపట్టడంతో బెంచ్‌ మార్క్‌ సూచీలు గరిష్ఠాలను చేరుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 119 పాయింట్ల లాభంతో 17,944 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 417 పాయింట్ల లాభంతో 60,260 వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలు గరిష్ఠ స్థాయిల్ని నిలబెట్టుకున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 21 పైసలు లాభపడి 79.44 వద్ద ముగిసింది.


BSE Sensex


క్రితం సెషన్లో 59,842 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,938 వద్ద మొదలైంది. 59,857 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,323 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 417 పాయింట్ల లాభంతో 60,260 వద్ద ముగిసింది.


NSE Nifty


మంగళవారం 17,825 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,868 వద్ద ఓపెనైంది. 17,833 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,965 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 119 పాయింట్ల లాభంతో 17,944 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ముగిసింది. ఉదయం 39,351 వద్ద మొదలైంది. 39,202 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,504 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 222 పాయింట్ల లాభంతో 39,461 వద్ద క్లోజైంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 33 కంపెనీలు లాభాల్లో 17 నష్టాల్లో ముగిశాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, హీరోమోటో కార్ప్‌, బజాజ్ ఫైనాన్స్‌, భారతీ ఎయిర్‌ టెల్‌ షేర్లు లాభపడ్డాయి. అపోలో హాస్పిటల్స్‌, టాటా మోటార్స్‌, ఎం అండ్‌ ఎం, మారుతీ, సిప్లా షేర్లు నష్టపోయాయి. ఆటో మినహా మిగతా రంగాల సూచీలన్నీ ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, మెటల్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాష్ సూచీలు గ్రీన్‌లో ముగిశాయి.




Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.