Pallavi Prashanth: రైతుబిడ్డగా బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంటర్ అయిన పల్లవి ప్రశాంత్.. ఫైనల్‌గా టైటిల్‌ను సాధించుకున్నాడు. తనకు సపోర్ట్ చేసిన ఓట్లు వేసినా ఫ్యాన్స్ అంతా తన విజయాన్ని చూసి సంతోషిస్తున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 6కు చేరుకున్న వారిలో ఎవరు విన్నర్ అవుతారా అని చూడడానికి వారి కుటుంబ సభ్యులంతా వచ్చారు. అదే విధంగా పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు కూడా వచ్చారు. తమ కొడుకు బిగ్ బాస్‌లాంటి రియాలిటీ షోలో విన్నర్ అవ్వడంతో వారు ఎమోషనల్ అయ్యారు. ప్రశాంత్ తల్లి ఏకంగా నాగార్జున కాళ్లపై పడింది. ఆ తర్వాత తమ కొడుకు విజయం గురించి తాము ఎలా ఫీల్ అవుతున్నారో బయటపెట్టారు.


పాదాభివందనాలు..
పల్లవి ప్రశాంత్ గెలిచినందుకు ఫీలింగ్ ఎలా ఉందని తన తండ్రిని అడగగా.. ‘‘మాకు చాలా సంతోషంగా ఉంది. రైతుల వల్లే మా బాబు విన్నర్ అయ్యాడు’’ అని పూర్తి క్రెడిట్ రైతులకే ఇచ్చారు. ఓట్లు వేసిన వారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. అందరికీ పాదాభివందనాలు అన్నారు. ఊరిలోనే సెలబ్రేషన్స్ జరుగుతాయని బయటపెట్టారు. తమ కొడుకు విన్నర్ అవుతాడని ఊహించారా అని అడగగా.. ‘‘రైతులు అంతా ఏకమయితే.. రైతులు తలచుకుంటే జరగని పని లేదు. కాకపోతే రైతులను ఎప్పుడూ చిన్నచూపే చూస్తారు కాబట్టి వెనకబడి ఉన్నారు. రాజకీయ నాయకులు గానీ, ప్రజలు గానీ రైతులపై దృష్టిపెడితే.. వారు కూడా ఎదుగుతారు’’ అని రైతుల కష్టాల గురించి చెప్పుకొచ్చారు.


అంతా వాడి ఇష్టం..
పల్లవి ప్రశాంత్.. మొదటినుంచి తను విన్నర్ అయితే ఆ డబ్బులను రైతులకే పంచుతాను అని స్టేట్‌మెంట్ ఇస్తూ వచ్చాడు. ప్రైజ్ మనీ చేతికి వచ్చిన తర్వాత కూడా అదే మాట అన్నాడు. దానిపై తన తండ్రి స్పందించారు. ‘‘వాడు ఎవరెవరిని చూశాడో, ఏ పేద ప్రజలను చూశాడో నాకు తెలీదు కదా.. వాడి మనసుకు నచ్చిన, కష్టాల్లో ఉన్న ఏ రైతుకు ఇచ్చుకుంటాడో ఏమో. ఎందుకు ఇచ్చావని నేను అడగను. విన్నర్ అయితే చాలు.. పేరొస్తే చాలు అనుకున్నాం’’ అంటూ ప్రైజ్ మనీపై నిర్ణయాన్ని పూర్తిగా ప్రశాంత్‌కే వదిలేశారు. ప్రశాంత్ తల్లి కూడా తను విన్నర్ అయినందుకు సంతోషం వ్యక్తం చేశారు. సపోర్ట్ చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.


నాగార్జునపై ప్రశంసలు..
చిన్నప్పటి నుంచి ప్రశాంత్ పడిన కష్టం గురించి తన తల్లిదండ్రులు బయటపెట్టారు. ‘‘చాలా కష్టపడ్డాడు. కష్టాలు చూసినవారు కూడా వాడికి సపోర్ట్ చేశారు. కులం, మతం అనే బేధం వాడికి సపోర్ట్ చేశారు కాబట్టే విన్నర్ అయ్యాడు. నాగార్జున సార్ విన్నర్ చేయలేదు. ప్రజలు చేశారు. వాడిని ఆటకు ప్రజలు సపోర్ట్ చేశారు. అందుకే సార్.. వాడిని విన్నర్ అని చెప్పాడు. చెప్పాలి కూడా. ఆయన కూడా ప్రజల మనిషి. మీరంతా నా చుట్టాలు, నా మనుషులు అన్నాడు అది నాకు నచ్చింది’’ అంటూ నాగార్జునను ప్రశంసించారు ప్రశాంత్ తండ్రి. ‘స్పై’ బ్యాచ్‌పై తన తండ్రి స్పందించారు. వారంతా బయట కూడా కలిసే ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు.


శివాజీ విన్నర్ అనుకున్నాం..
‘‘శివాజీ వెళ్లిపోయినప్పుడు బాధ అనిపించింది. కచ్చితంగా రన్నర్ అవుతాడు అనుకున్నాం. విన్నర్ అయినా.. రన్నర్ అయినా అవుతాడు అనుకున్నాం’’ అని శివాజీపై ప్రేమను బయటపెట్టారు. బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు కాబట్టి సినిమాల్లోకి పంపిస్తారా? రైతుబిడ్డగానే ఉంచేస్తారా? అని అడగగా.. ‘‘ఆయన ఇష్టం. ఏదైనా ఆయన ఇష్టమే. వారికి తినడానికి అన్నం, బట్ట ఉంటే చాలు.. వాళ్లు ఏమైనా చేసుకోని. మంచి పేరు తెచ్చుకుంటే చాలు’’ అని నిర్ణయాన్ని తనకే వదిలేశారు ప్రశాంత్ తండ్రి. మరి ప్రశాంత్ పెళ్లి ఎప్పుడు అని అడగగా.. ‘‘ప్రజలను, తనకు సపోర్ట్ చేసిన పెద్దవారిని కలిసి వచ్చిన తర్వాత ఆయనకు ఇష్టమైన, చూపించినా.. లేదా నన్ను చూడమన్నా చూసి పెళ్లి చేస్తా’’ అని ఆసక్తికర కామెంట్స్ చేశారు.


Also Read: రైతుబిడ్డకు ఇచ్చే విలువ ఇంతేనా? పోలీసులపై బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ సీరియస్