Priyanka Jain Journey in Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7లో మొదట్లో లేడీ కంటెస్టెంట్స్ అంతా ఎలిమినేట్ అయినా.. తను మాత్రం స్ట్రాంగ్‌గా చివరి వరకు ఫైనలిస్ట్ అయ్యింది ప్రియాంక. ఫైనల్స్‌లో అయిదుగురు అబ్బాయిల మధ్య ఒకేఒక్క అమ్మాయిగా మిగిలింది. మొదటినుంచి బిగ్ బాస్ ఇచ్చిన అన్ని టాస్కుల్లో దాదాపు రెండో స్థానం వరకు వచ్చి ఓడిపోయింది ప్రియాంక. పవర్ అస్త్రా కోసం పోటీపడిన సమయంలో కూడా రెండుసార్లు చివరి వరకు వచ్చి పవర్ అస్త్రాను దక్కించుకోలేకపోయింది. ఎన్ని కెప్టెన్సీ టాస్కులు ఆడినా.. సీజన్ చివరి కెప్టెన్సీ పోటీలోనే తనకు కెప్టెన్ అయ్యే అదృష్టం దక్కింది. అలాంటి ప్రియాంక.. బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 5వ కంటెస్టెంట్‌గా మిగిలిపోయింది. ఆ విషయంపై ఇంటర్వ్యూలో బాధపడింది.


అది కుల్లు కాదు..
బిగ్ బాస్ సీజన్ 7 నుంచి టాప్ 5వ కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ అయిపోయి బయటికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ బజ్‌లో పాల్గొంది ప్రియాంక. దానికి సంబంధించిన ప్రోమో బయటికొచ్చింది. ముందుగా ప్రశ్నలు అడగకుండా.. ‘‘ప్రవర్తన విషయానికొస్తే.. నువ్వు నా ఫేవరెట్ కంటెస్టెంట్ హౌజ్‌లో’’ అని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది గీతూ. ‘‘ఇది నాకు చాలా సంతోషాన్నిస్తుంది’’ అంటూ ప్రియాంక నవ్వింది. ‘‘ఫినాలేలో ఒకేఒక్క లేడీ కంటెస్టెంట్. ఇది నీకు ఎలా అనిపిస్తుంది’’ అని అడగగా.. స్ట్రాంగ్ అని సైగ్ చేసి చూపించింది. ‘‘నేను అక్కడ ఉండాల్సినదాన్ని. నేనెందుకు అక్కడ లేను అనే ఫీలింగ్ తప్పా అదేమీ కుల్లు అని కాదు’’ అని విన్నర్ అవ్వలేకపోయిన విషయంపై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది ప్రియాంక.


ఆల్ టైమ్ రికార్డ్..
బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్న దాదాపు అందరు కంటెస్టెంట్స్‌పై ఏదో ఒక మీమ్ వైరల్ అవుతూనే ఉంది. అలాగే ప్రియాంకకు సంబంధించిన ఒక మీమ్‌ను కూడా తన ఫ్యాన్స్ వైరల్ చేశారు. దానినే ప్రియాంకకు చూపించింది గీతూ. ఆ మీమ్‌లో ‘మొదటివారం హౌజ్‌మేట్ టాస్క్ రన్నర్, మూడోవారం హౌజ్‌మేట్ టాస్క్ రన్నర్, అయిదోవారం టాస్క్ విన్నర్, ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ రన్నర్, రెండో ఎపిసోడ్ టాస్క్‌లో రన్నర్, రన్నర్ అయిన ప్రతీ టాస్క్‌లో అపోనెంట్ అబ్బాయే. ఒక లేడీ కంటెస్టెంట్‌గా ఇది ఆల్ టైమ్ రికార్డ్’ అని ప్రియాంక ఆట గురించి ఉంది. అది బెస్ట్ మీమ్ అని గీతూ స్టేట్‌మెంట్ ఇవ్వగా.. క్రేజీ అని చెప్తూ ప్రియాంక మురిసిపోయింది.


గెలిపిస్తారని అనుకున్నాను..
‘‘అమర్, శోభా విషయంలో మీరు పూర్తిగా హ్యాపీగా ఉన్నారా?’’ అని అడగగా.. ‘‘ప్రతీది హెల్తీ ఉండాలని రూల్ లేదు’’ అని చెప్పింది ప్రియాంక. ‘‘అర్జున్ మీకంటే ముందు వస్తాడని ఊహించారా?’’ అని ప్రశ్నించింది గీతూ. ‘‘ప్రతీ సీజన్‌లో ఒక అంచనా ఉంటుంది ఎవరు విన్నర్ అవుతారా అని, ఈ సీజన్‌లో అది లేదు’’ అని తన అభిప్రాయాన్ని చెప్పింది ప్రియాంక. ‘‘మీరు హౌజ్‌లో ఉన్నప్పుడు మనీ వచ్చింది కదా.. అది రూ.3 నుంచి 10 లక్షల వరకు వెళ్లింది. తీసుకోవాలని అనిపించలేదా?’’ అని అడగగా.. ‘‘ప్రేక్షకులు గెలిపిస్తారు అనే నమ్మకంతోనే ఉన్నాను’’ అని చెప్తూ బాధపడింది. ‘‘అమర్ భార్య తేజూ వచ్చినప్పుడు నాతో సరిగ్గా మాట్లాడలేదు అని ఫీల్ అయ్యారు కదా.. ఎందుకు అయ్యిండొచ్చు అనుకుంటున్నారు?’’ అని గీతూ అడిగింది. ఆ ప్రశ్నకు సమాధానం లేక ప్రియాంక సైలెంట్‌గా ఉండిపోయింది.



Also Read: విన్నర్ నేనే, నాకు తెలుసు - ‘బిగ్ బాస్’పై శివాజీ షాకింగ్ కామెంట్స్