Bigg Boss Season 7 Telugu Winner : ‘బిగ్ బాస్’ సీజన్-7 ఫెనాలే ముగిసింది. విన్నర్ కూడా ఎవరో తేలిపోయింది. అయితే, చాలామంది ఈ సీజన్‌కు శివాజీ విన్నర్ అవుతారని భావించారు. కానీ, అంతా ‘ఉల్టాపుల్టా’ అయ్యింది. శివాజీకి బదులు.. ఆయన శిష్యుడు పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. అయితే, తాను విజేత కాలేకపోయాననే బాధ శివాజీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫినాలే తర్వాత ‘బిగ్ బాస్’ బజ్‌లో పాల్గొన్న శివాజీ.. ఆ విషయాన్ని బయటకు చెప్పేశారు. విన్నర్ తానేనని, ఆ విషయం తనకు తెలుసని చెప్పేశారు. దీంతో బిగ్ బాస్‌లో ఆయనపై కుట్ర జరిగిందనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. 


విన్నర్ నేనే - శివాజీ


‘బిగ్ బాస్ బజ్’లో గీతూ అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయో తెలిసిందే. అందరినీ అడిగినట్లే శివాజీని కూడా ఘాటైన ప్రశ్నలతో ఇబ్బంది పెట్టింది గీతూ. టాప్-3 వరకు వస్తారని మీరు ఎక్స్‌పెక్ట్ చేశారా అని గీతూ అడిగిన ప్రశ్నకు శివాజీ స్పందిస్తూ.. ‘‘టాప్ 3 ఏమిటీ? ఈ సీజన్ విన్నర్ నేను, నాకు తెలుసు’’ అని అన్నారు. మరి విన్నర్ మీరే అనుకుంటున్నారు కదా.. టాప్-3లో ఆగిపోవడానికి కారణం ఏమిటి అనుకున్నారు అని అడిగింది గీతూ. ‘‘ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ ఆడుతుంటే.. ఆడనివ్వకుండా చెయ్యాలన్న మొదటి రోజు సంకల్పం నుంచి నేను అడ్డం పడ్డాను’’ అని తెలిపారు. 


వాళ్ల వెనకాల ఉన్న శక్తి నేను


‘‘మీ వల్లే యావర్, పల్లవి ప్రశాంత్ ఇంత దూరం వచ్చారని మీరు అనుకుంటున్నారా’’ అని గీతూ అడిగిన ప్రశ్నకు శివాజీ మాట్లాడుతూ.. ‘‘కాకపోతే వాళ్ల వెనకాల ఒక శక్తి ఉందని తెలియజేశాను’’ అని సమాధానమిచ్చారు. ‘‘వాళ్లకు మైండ్‌లోలేని ఆలోచనలు క్రియేట్ చెయ్యించారు. అది ఇండివిడ్యువల్లా?’’ అని అడిగిన గీతూపై ఫైర్ అయ్యారు శివాజీ. ‘‘నీ క్వశ్యన్‌కు ఆన్సర్ చెప్పడానికి నేను రాలేదు’’ అన్నారు. ‘‘ఆడియెన్స్ అందరికీ అమర్‌ను మీరు కావాలనే డే వన్ నుంచి టార్గెట్ చేసినట్లు అనిపించింది’’ అని గీతూ అడగ్గా.. ‘‘నేను మళ్లీ మళ్లీ చెబుతున్నా.. అమర్‌గాడు నేను వేరీ గుడ్ ఫ్రెండ్స్’’ అని శివాజీ అన్నారు. ‘‘అంత క్లోజ్‌గా ఉండే అమర్.. కెప్టెన్ అవ్వకూడదు అని చాలా రకాల ప్రయత్నాలు చేసినట్లున్నారు’’ అని గీతూ అడిగింది. ఆ తర్వాత ‘‘స్పా బ్యాచ్ వాళ్లకు పార్షియాలిటీ ఎక్కువ. మీ స్పై బ్యాచ్‌లో ఎప్పుడూ ఫేవరటిజం లేదా?’’ అని అడిగింది. ఇందుకు శివాజీ సమాధానం ఇస్తూ.. ‘‘మీరు ఎంత అనుకున్నా. బయట జనం చూస్తున్నారు. ఎవరు కలిసి ఆడుతున్నారనేది ఆడియన్స్ చూస్తున్నారు’’ అని సమాధానం ఇచ్చారు. ‘‘అసలు శివాజీ బిగ్ బాస్ హౌస్‌కు ఎందుకు వచ్చారు?’’ అని ప్రశ్నించగా.. ‘‘శివాజీ అంటే బిగ్ బాస్ అన్ని సీజన్లలో ఎప్పటికైనా గుర్తుండాలి. దట్ ఈజ్ మై మార్క్’’ అని సమాధానం చెప్పారు. 


‘బిగ్ బాస్ బజ్’ శివాజీ ప్రోమో:



‘బిగ్ బాస్’ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచి రూ.35 లక్షల నగదు బహుమతి అందుకున్నాడు. అమర్ దీప్ రన్నరప్‌గా నిలవగా.. శివాజీ మూడో స్థానంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. నాలుగో స్థానంలో ఉన్న యావర్.. రూ.15 లక్షల నగదుతో బయటకు వచ్చేశాడు. దానివల్ల పల్లవి ప్రశాంత్ ప్రైజ్ మనీలో రూ.15 లక్షలు తగ్గాయి. నాగార్జున నటించిన ‘నా సామిరంగ’ సినిమా ప్రమోషన్ కోసం అల్లరి నరేష్, రాజ్ తరుణ్‌లు స్టేజ్ మీదకు వచ్చి.. రూ.15 లక్షల సూట్‌ కేసుతో హౌస్‌లోకి వెళ్లి.. యావర్‌ను బయటకు తీసుకొచ్చారు. ఇక ప్రియాంక 5వ ఫైనలిస్టుగా హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అందరికంటే ముందు అర్జున్ హౌస్ నుంచి బయటకొచ్చాడు. ఫినాలే చూసేందుకు వచ్చిన పాత కంటెస్టెంట్లు అంతా వచ్చారు. అయితే షకీలా, కిరణ్ రాథోడ్ మాత్రం కనిపించలేదు. రవితేజ, నందమూరి కళ్యాణ్ రామ్, యాంకర్ సుమా కొడుకు రోషన్ కనకాల తమ సినిమాల ప్రమోషన్ కోసం బిగ్ బాస్ స్టేజ్‌పై సందడి చేశారు. 


Also Read: రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కథేంటి? బిగ్ బాస్ వరకు ఎలా వచ్చాడు?