Bigg Boss Season 8 Telugu: బిగ్ బాస్ ఒక రియాలిటీ షో అయినా అందులో కంటెస్టెంట్స్‌గా రావాలంటే వారి పర్సనల్ లైఫ్‌లో ఏదైనా కాంట్రవర్సీ ఉండాలి లేదా సోషల్ మీడియాలో వారి పేరు వైరల్ అయ్యిండాలి. ప్రతీ సీజన్‌లో ఇవే పాయింట్స్‌ను దృష్టిలో పెట్టుకొని కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేస్తారు బిగ్ బాస్ మేకర్స్. అయితే త్వరలోనే ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో కూడా అలాంటి కాంట్రవర్షియల్ వ్యక్తులు ఉండబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కొందరు బిగ్ బాస్ విశ్లేషకులు.. కంటెస్టెంట్స్ లిస్ట్‌ను కూడా బయటపెట్టేస్తున్నారు. ఇందులో తాజాగా మరో కాంట్రవర్షియల్ వ్యక్తి పేరు యాడ్ అయ్యింది.


ఎన్నో కాంట్రవర్సీలు..


ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్స్ వీరే అంటూ పలువురి పేర్లు బయటికొచ్చాయి. కానీ బిగ్ బాస్ టెలికాస్ట్‌కు సిద్ధమయ్యే వరకు అందులో ఎంత నిజముందో ఎవరికీ తెలియదు. కానీ తాజాగా ఈసారి బిగ్ బాస్‌లో వేణు స్వామి కంటెస్టెంట్‌గా రానున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. న్యూస్ ఎక్కువ ఫాలో అయ్యేవారికి వేణు స్వామి అంటే ఎవరో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ఒక జ్యోతిష్యుడు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల జీవితాల గురించి జ్యోతిష్యం చెప్తూ.. దానివల్లే వైరల్ అవుతుంటారు. అంతే కాకుండా ఆయన చెప్పిన జ్యోతిష్యం పలుమార్లు కాంట్రవర్సీలకు కూడా దారితీసింది.


బిగ్ బాస్ ఆఫర్..


కొందరు సినీ సెలబ్రిటీల గురించి వేణు స్వామి చెప్పిన జ్యోతిష్యం నిజమవ్వడంతో ఒక్కసారిగా ఆయన చాలా ఫేమస్ అయిపోయారు. కేవలం సినీ సెలబ్రిటీల గురించి మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు గురించి కూడా ఆయన జ్యోతిష్యం చెప్తుంటారు. తాజాగా ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుస్తారని చెప్తూ.. అది జరగకపోతే జ్యోతిష్యం చెప్పడం మానేస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చారు. అలా వేణు స్వామి విడుదల చేసే ప్రతీ వీడియోలో ఏదో ఒక కాంట్రవర్షియల్ స్టేట్‌మెంట్ ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో ఆయనపై మీమ్స్, రీల్స్ కూడా క్రియేట్ అవుతుంటాయి. అటు సోషల్ మీడియాలో పాపులర్ అయ్యి, ఇటు కాంట్రవర్సీల్లో కూడా యాక్టివ్‌గా ఉండడంతో తనను బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.


భారీ పారితోషికం..


వేణు స్వామి చెప్పే జ్యోతిష్యాలను చాలామంది నమ్ముతారు. అలాంటి వ్యక్తి బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటారు, ఏం మాట్లాడతారు అనే అంశం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. దాని కోసం బిగ్ బాస్‌ను చూసేవారి సంఖ్య పెరుగుతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారట. అయితే వేణు స్వామికి బిగ్ బాస్ మేకర్స్ ఇచ్చిన ఆఫర్‌ను ఆయన కూడా యాక్సెప్ట్ చేశారని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఇదే నిజమయితే అసలు ఆయన.. ఆఫ్ కెమెరా ఎలా ఉంటారు అనే విషయం చాలామందికి తెలుస్తుంది. పైగా ఈ రియాలిటీ షోలో పాల్గొనడం వేణు స్వామి భారీ పారితోషికాన్ని డిమాండ్ చేయగా అది ఇవ్వడానికి కూడా మేకర్స్ వెనకాడలేదని సమాచారం.



Also Read: అమ్మవారి అవతారంలో జ్యోతిరాయ్ సర్‌ప్రైజ్, ‘ఎ మాస్టర్‌పీస్’ ఫస్ట్‌లుక్‌పై చర్చ