Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7లో ఫ్యామిలీ వీక్ తో పాటు దీపావళి సెలబ్రేషన్స్ ఎంత గ్రాండ్ గా జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీ వీక్ లోనే కాకుండా దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లోనూ కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ వేదికపై వచ్చి తమ వాళ్ళతో మాట్లాడి టాప్ 5 వరకు ఏ కంటెస్టెంట్ ఉంటారో చెప్పడం జరిగింది. వచ్చిన వాళ్లంతా శివాజీ టాప్ 5 లో ఉంటారని చెప్పడం విశేషం. ఆదివారం బోలే షావలి ఎలిమినేట్ అయి బయటికి వచ్చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఎపిసోడ్ పూర్తయిన అనంతరం సోమవారం నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. హౌస్ మేట్స్ మధ్య నామినేషన్స్ నువ్వా నేనా అనే రేంజ్ లో జరుగుతుంది.


నవంబర్ 13వ తేదీ ఎపిసోడ్ కు సంబంధించి ఇప్పటికే ఓ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో నామినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేట్ చేసేవారు కారణాలు చెప్పిన తర్వాత నామినేట్ అవ్వబడ్డ వారి తలపై బాటిల్ ని పగలగొట్టాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పారు. దాంతో రతిక.. శోభ, ప్రియాంక లను నామినేట్ చేయగా, అర్జున్.. శోభ, ప్రశాంత్ ని నామినేట్ చేసినట్లు చూపించారు. ఇక తాజాగా బిగ్ బాస్ సీజన్ 7 కు సంబంధించి మరో ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో ప్రియాంకతో రతిక ఓ రేంజ్ లో గొడవ పెట్టుకుంది. అలాగే అశ్విని కూడా ప్రియాంకపై అరిచింది.


ఒకసారి ప్రోమోని పరిశీలిస్తే.. ప్రియాంక రతికను నామినేట్ చేస్తూ.." నువ్వు వేస్తున్న నామినేషన్ పాయింట్స్ నీకు దొరకడం లేదు" అని చెప్పగా.." ఉన్నదాన్ని తవ్వి తవ్వి నామినేట్ చేసింది నువ్వు" అంటూ రతికా బదులిచ్చింది. "నా అభిప్రాయం కరెక్ట్ గా వెళ్లకపోతే దాని గురించి రచ్చ అయ్యేది మొన్న" అని ప్రియాంక చెబుతుంటే.." బయట కరెక్ట్ వే లోనే వెళ్లిందని నీకెలా తెలుసు? బయటికి వెళ్లి చూసి వచ్చావా అమ్మా? అని రతిక ప్రశ్నించగా.. "నువ్వు బయటికి వెళ్లి చూసిన ఏం చేయలేదు కదా" అంటూ ప్రియాంక తెలిపింది. మధ్యలో అశ్విని.." ఏడవడం గురించి ఇంకోసారి మాట్లాడితే మంచిగా ఉండదు చెప్తున్నా" అంటూ ప్రియాంకకి వార్నింగ్ ఇచ్చింది.


తర్వాత అర్జున్ నామినేషన్ ని చూపించారు." నువ్వు నామినేషన్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఇలాగే ఉంటుంది" అంటూ అర్జున్ ప్రశాంత్ తో అన్నాడు. అనంతరం.." నా ఎమోషన్ గురించి నువ్వెట్లా మాట్లాడుతావ్" అంటూ రతిక ప్రియాంక పై ఫైర్ అయింది." సోది కాకుండా పాయింట్ మాట్లాడు?" అంటూ అర్జున్ ప్రశాంత్ తో అంటాడు." బిగ్ బాస్ కి మేం మహారాణులు.. I want Explanation for it please" అని ప్రియాంక అంటే.." నేనిక్కడ నిల్చోని ఈమెని నామినేట్ చేసేటప్పుడు డామినేట్ అనే వర్డ్ నా నోట్లో నుంచి వచ్చిందా? అని హౌస్ మేట్స్ ని అడిగింది రతిక. దానికి శివాజీ, 'మరీ ఎదురుగా వద్దు రా' అంటే.. "నామినేషన్ ప్రక్రియ జరిగేటప్పుడు మధ్యలో ఎవరూ మాట్లాడకండి" అంటూ రతిక చెబుతుంది.


అందుకు శివాజీ, ‘‘మేము మాట్లాడం అమ్మా, కొంచెం దూరం వచ్చి మాట్లాడు’’ అని అంటుండగా, ‘‘నా ఇష్టం అన్నా’’ అని శివాజీకి చెప్తుంది రతికా. ఆ తర్వాత ప్రియాంక, అశ్వినిల మధ్య గొడవ జరిగింది. ప్రియాంక మాట్లాడుతుంటే.. "ఏయ్ నోరు మూయి, మాట్లాడనిస్తావా మాట్లాడనివ్వవా?" అంటూ ప్రియాంకపై అశ్విని అరిచింది. దానికి ప్రియాంక, "ఏంటి ఈ బిహేవియర్" అని చెబుతోంది. "నాగ్ సార్ తో చెప్పాల్సింది పాయింట్స్" అని ప్రియాంక రతికాతో అంటే.. " ప్రతిసారి మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ.. నాగ్ సర్ ఈజ్ ఏ హోస్ట్, హౌస్ మేట్ కాదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నేనే మాట్లాడతా. రచ్చ అయ్యేది, రంబోలా అయ్యేది కాదు ఇక్కడ" అంటూ రతిక చెప్పడంతో ప్రోమో ఎండ్ అవుతుంది.


Also Read : విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక దీపావళి సెలెబ్రేషన్స్ - మరోసారి దొరిపోయిందంటన్న ఫ్యాన్స్!