టాలీవుడ్ రీల్ జోడి విజయ్ దేవరకొండ - రష్మిక మందన ( Vijay Devarakonda - Rashmika) ఈ దీపావళి ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకున్నారా? ముఖ్యంగా రష్మిక, దేవరకొండ ఫ్యామిలీతో దీపావళిని జరుపుకుందా? రష్మిక, విజయ్ దేవరకొండ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఇది నిజమే అని స్పష్టమవుతుంది. దీంతో మరోసారి సోషల్ మీడియాలో విజయ్, రష్మిక జంట హాట్ టాపిక్ అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ దీపావళి పండుగను సామాన్యులతో పాటు సినీ సెలెబ్రెటీలు ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీలు తమ దివాళి సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.


ఈ క్రమంలోనే రష్మిక మందన, విజయ్ దేవరకొండ దివాళి సెలబ్రేషన్స్ కి సంబంధించి షేర్ చేసిన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మొదట రష్మిక మందన తన ఇన్ స్టాగ్రామ్ లో దీపావళి విషెస్ చెప్పింది. సాంప్రదాయంగా చీర కట్టుకొని ఓ బెంచ్ పై కూర్చున్న ఫోటోను షేర్ చేస్తూ 'హ్యాపీ దీవాలి మై లవ్స్' అనే క్యాప్షన్ పెట్టింది. ఆ తర్వాత కాసేపటికి విజయ్ దేవరకొండ కూడా తన ఫ్యామిలీతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్న ఫోటోలను షేర్ చేశాడు. విజయ్ కూడా 'హ్యాపీ దీవాలి మై లవ్స్' అనే క్యాప్షన్ తోనే ఈ ఫోటోలు షేర్ చేయడం విశేషం. మరి వీటిని చూసిన ఫ్యాన్స్ ఊరుకుంటారా?


రష్మిక ఫోటో పై స్పందిస్తూ.. ‘‘నువ్వు విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఉన్నావు కదా?’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. రష్మిక బ్యాగ్రౌండ్ లో ఉన్న గోడలను చూపిస్తూ విజయ్ ఇంటి గోడల లాగే ఉన్నాయి, అంటే అతనితో కలిసే రష్మిక దీవాలి సెలబ్రేట్ చేసుకుందని ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయిపోయారు. ఇక ఇద్దరు ఒకే రకంగా విష్ చేయడానికి కూడా ఫ్యాన్స్ ప్రస్తావిస్తూ రష్మిక దేవరకొండ ఫ్యామిలీ తోనే దివాలి సెలబ్రేట్ చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. 'మై లవ్స్ అంటే విజయ్ అనే కదా అని' ఓ అభిమాని రష్మిక పోస్టుపై కామెంట్ చేశాడు. ఇటు విజయ్ చేసిన పోస్టుల పైనా అదే విధంగా స్పందిస్తున్నారు. 'సేమ్ ప్లేస్, సేమ్ బ్యాక్గ్రౌండ్, సేమ్ క్యాప్షన్' అంటూ మరో అభిమాని కామెంట్ చేశారు.


దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. నిజానికి గత ఏడాది కూడా ఈ జంట కలిసే దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేశారు. ఈ సంవత్సరం కూడా అదే రిపీట్ అవ్వడం గమనార్హం. ఇక విజయ్, రష్మికల విషయానికొస్తే.. వీరిద్దరూ జంటగా 'గీతగోవిందం' అనే సినిమాలో నటించారు. అప్పటినుంచి రష్మిక, విజయ్ మధ్య ఏదో నడుస్తుందనే పుకార్లు మొదలయ్యాయి. కానీ ఈ జట మాత్రం ఎప్పుడు బయటపడలేదు. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'ఫ్యామిలీ స్టార్'(Family Star) అనే సినిమాలో నటిస్తుండగా.. రష్మిక మందన అల్లు అర్జున్ సరసన 'పుష్ప 2' మూవీ తో పాటు బాలీవుడ్లో రణబీర్ కపూర్ తో కలిసి 'యానిమల్'(Animal) అనే మూవీ చేసింది. అర్జున్ రెడ్డి మూవీ సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 1న విడుదల కాబోతోంది


Also Read : ఫ్లాప్ తర్వాత వెళితే పక్కకి పారిపోయారు - అజయ్ భూపతి హాట్ కామెంట్స్