మూడు అడుగులు... జస్ట్ త్రీ స్టెప్స్... బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ట్రోఫీ అందుకోవడానికి కేవలం మూడు అడుగుల దూరంలో నిలిచాడు వరంగల్ కుర్రాడు నబీల్ అఫ్రిది. సామాన్యుడిగా బిగ్ బాస్ ఇంటిలో అడుగుపెట్టిన అతను సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇస్తూ చివరి వరకు బలంగా నిలబడ్డాడు. బిగ్ బాస్ ఇంటిలో అతని జర్నీ మీద స్పెషల్ ఫోకస్... 

నబీల్ అఫ్రిదీలోని ఫైర్ తనకు పెద్ద ప్లస్ముందుగా నబీల్ అఫ్రీదిలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే... సీజన్ 8లో విన్నర్ మెటీరియల్ అని మొట్టమొదట అనిపించుకుంది నబీల్ ఆఫ్రిది (Nabeel Afridi)నే. టాస్కుల్లో పోటీపడి ఆడడం దగ్గర నుండి నామినేషన్లలో మొదటి వారాల్లో చూపించిన ఫైర్ నబీల్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ తెచ్చి పెట్టింది. హౌస్ మొత్తం 'ఓజీ వర్సెస్ రాయల్స్'గా విడిపోయినా... తను మాత్రం రెండు వైపులా సమాన దూరాన్ని, సమాన స్నేహాన్ని చూపించాడు. అలాగే ఇతర హౌస్ మేట్స్ కోసం సర్దుకుపోయే మనస్తత్వం, అవినాష్ ఎలిమినేట్ కాకుండా సరైన సమయంలో ప్రొటెక్షన్ షీల్డ్ వాడడం నబీల్ కు సోషల్ మీడియాలో, ఆడియన్స్లో మంచి పేరు తెచ్చిపెట్టింది. తాను టాప్ ఫైవ్ వరకు వచ్చానంటే దానికి నబిలే కారణం అంటూ అవినాష్ నాగార్జున గారి ముందే కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే ఇతరుల ఆటల్లో ఏదైనా తప్పు జరిగితే వెంటనే దాన్ని సంచాలకుల దృష్టికి తీసుకెళ్లడం నబీల్ ఆటలోని మరొక ప్లస్ పాయింట్.

Also Read: గౌతమ్ కాదు... నిఖిలే విన్నర్ - అనౌన్స్ చేసిన నాగార్జున... ట్రోఫీ అందించిన రామ్ చరణ్

నబీల్ ఎందుకు డౌన్ అయ్యాడు?బిగ్ బాస్ ఇంటిలో మొదటి వారాల్లో ఎంతటి ఫైర్ తో ఆడాడో మధ్యలో అంతలా డౌన్ అయిపోయాడు నబీల్. ఒకానొక దశలో హౌస్ లో నబీల్ ఉన్నాడా? లేడా? అన్నట్టు సైలెంట్ అయిపోయాడు. అతనికి జరిగిన అతి పెద్ద అన్యాయం ఫ్యామిలీ వీక్. హౌస్ లోకి వచ్చిన నబీల్ మదర్ కు ఆట గురించి తెలియదు. దానితో ఆమె సరైన ఇన్పుట్స్ ఇవ్వలేకపోయారు. ఆ వారం స్టేజ్ పైకి వచ్చిన నబీల్ బ్రదర్ కు ఎక్కువగా మాట్లాడే అవకాశం రాకపోతే సెలబ్రిటీ గెస్ట్ గా వచ్చిన భోలే షవాలి నబీల్ కు ఇన్పుట్స్ ఇవ్వడం బదులు తనను తాను పొగుడుకుని వెళ్ళిపోయాడు. దానితో ఆ వారం సరైన ఇన్పుట్స్ లేక ఒక విధమైన కన్ఫ్యూజన్లో పడిపోయాడు నబీల్. ఆ తరువాతి వారం నామినేషన్స్ లో ఫైర్ చూపించడం లేదు అన్నారని అనవసరమైన గొడవలు పెట్టుకుంటూ రోహిణి, గౌతమ్ లాంటి వారికి దూరమయ్యాడు. టాస్కుల్లోనూ తొందర పాటుతో మిస్టేక్స్ చేశాడు. అయినప్పటికీ తనకున్న సహాయపడే  మనస్సు, సర్దుకుపోయే దృక్పథంతో  ఆడియన్స్ లో మంచి ఇమేజ్ తెచ్చుకుని టాప్ 5కు దూసుకుపోయాడు. ఓవరాల్ గా సీజన్ మధ్యలో డల్ కావడం.. ఫ్యామిలీ వీక్ లో సరైన ఇన్పుట్స్ రాకపోవడం, చివరి టాస్కుల్లో తొందరపాటు లాంటి మైనస్ లు అతడిని విజయానికి మూడు మెట్ల దూరంలో నిలిపాయి.

Also Read: నిఖిల్ కంటే ముందు 'బిగ్ బాస్' విజేతలుగా నిలిచిన ఆ ఏడుగురు... వాళ్లు ఎవరో గుర్తున్నారా?