బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 క్లైమాక్స్ (Bigg Boss 8 Telugu)కు వచ్చేసింది. మొదట్లో చెప్పగా సాగిన సీజన్ వైల్డ్ కార్డ్స్ రాకతో ఇంట్రెస్టింగ్ గా మారింది. ఫినాలే వీక్ మొదలు కావడంతో ట్రోఫీ ఎత్తేది ఎవరో ఈ వీకెండ్లో తెలిసిపోతుంది. గౌతమ్, నిఖిల్, అవినాష్, ప్రేరణ, నబీల్ టాప్ 5కు చేరుకున్నారు. వీళ్ళలో వైల్డ్ కార్డుగా వచ్చి టాప్ 5కు దూసుకుపోయిన గౌతమ్ కృష్ణ గేమ్ కు చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. సీజన్ 1లో నవదీప్ తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న వైల్డ్ కార్డు గౌతమ్ కృష్ణ మాత్రమే. ఖచ్చితంగా టాప్ ఒకటి లేదా రెండో స్థానాల్లో ఉంటాడని గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరి ఆ రేంజ్‌లో ఆడుతున్న సోలో బాయ్ ఆటలోని ప్లస్ లు ఏంటి?మైనస్ లు ఏంటి? ఇప్పుడు చూద్దాం!
సోలో బాయ్ గౌతమ్ కృష్ణ ఆటలో ప్లస్ పాయింట్స్ ఏంటి?
సీజన్ 7లో 91 రోజులు పాటు బిగ్ బాస్ హౌస్ లో ఆడిన గౌతమ్ కృష్ణ (Gautham Krishna)కు సీజన్ 8లో ఆడుతున్న గౌతమ్ కృష్ణ 2.0కు అసలు పోలికే లేదు. అప్పట్లో శివాజీ తో కావాలనే అనవసర గొడవలకు వెళుతూ లైమ్ లైట్ లో ఉండాలని చూసిన గౌతమ్ కృష్ణ ఈ సీజన్లో మాత్రం బ్యాలెన్స్డ్ గా ఆడుతూ వస్తున్నాడు. ఆ సీజన్లో అంబటి అర్జున్ ఫైనల్ వీక్ కు వెళ్లడంతో దురదృష్టకర పరిస్థితుల్లో ఎక్కువ ఓట్లు వచ్చినా ఎవిక్ట్ అయ్యాడు గౌతమ్ కృష్ణ. సీజన్ 8లో ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి నుండి మణికంఠ సెల్ఫ్ ఎవిక్ట్ కావడంతో బతికిపోయిన గౌతమ్ టాప్ 5కు చేరుకున్నాడు. ఈ మధ్యలో తను మార్చుకున్న తన గేమ్ ప్లాన్ చాలామంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది. సోలో బాయ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న గౌతమ్ దానికి తగ్గట్టుగానే ఆడుతూ వచ్చాడు. ఎక్కడా ఎవరి సైడు తీసుకోకుండా సోలోగానే నిలబడ్డాడు . నిఖిల్ అండ్ కో మధ్యలో గ్రూప్ గేమ్ తో గౌతమ్ ను టార్గెట్ చేయాలని చూసినా అది గౌతమ్ కృష్ణకే హెల్ప్ అయింది. ఏకంగా బిగ్ బాసే నిజంగా సోలోగా ఆడతాడా లేదా చెక్ చేయడానికి డైస్ గేమ్ ప్లాన్ చేస్తే దాని నుండి కూడా అద్భుతంగా బయటపడ్డాడు గౌతమ్. కొన్నిసార్లు హోస్ట్ నాగార్జున ద్వారా కూడా గౌతమ్ ను టార్గెట్ చేయాలని బిగ్ బాస్ టీమ్ చూసింది అనేది గౌతమ్ అభిమానుల అభిప్రాయం. అలాగే ఎక్కడా ఎవరి గురించి బ్యాక్ బిచింగ్ చేయడం గానీ, ఫౌల్ గేమ్ ఆడడం గాని గౌతమ్ కృష్ణ చేయలేదు. పోయిన వారంలో నిఖిల్ పై ఒక్కసారి మినహా మొత్తం సీజన్లో ఎప్పుడూఎవరి మీదా నోరు జారలేదు గౌతమ్. చివరికి ప్రేరణ సైతం వంటింట్లో గౌతమ్ ను టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నామినేషన్స్ లో పృథ్వి మీదికి దూసుకొచ్చిన సంఘటనలు ఉన్నాయి. నబీల్ పెట్టుకున్న అనవసర వాగ్వాదాలు ఉన్నాయి. వీటన్నిటిని సక్సెస్ఫుల్గానే హ్యాండిల్ చేసిన గౌతమ్ మరో టాప్ కంటెస్టెంట్ నిఖిల్ తో రైవల్రీ ని మాత్రం కంటిన్యూ చేశాడు. గేమ్ ప్లాన్ పరంగా ఇది ఒక మంచి ఎత్తుగడ. అది వర్కౌట్ అయింది కూడా. అందుకే ఈసీజన్ లో విన్నర్ నిఖిల్, గౌతమ్ లలో ఒకరు అని బిగ్ బాస్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.
మరి మైనస్ పాయింట్స్ ఏంటి? సోలో బాయ్ గౌతమ్ కృష్ణలో తప్పులేంటి?
ఆట మొత్తం సోలో బాయ్ గానే ఆడినా గౌతమ్ అస్తమాను అదే విషయాన్ని చెప్పడం చివరికి వచ్చేసరికి కొంత బోర్ కొట్టించింది. ప్రతిసారి కెమెరాలతో మాట్లాడటం కూడా గౌతమ్ కావాలనే ఇలా చేస్తున్నాడనే ఫీలింగ్ కలిగించింది. సోలో బాయ్ గా అడడం గౌతమ్ కు టాప్ 5కు చేరుకోవడం వెనుక ఎంత ప్లస్ అయిందో టైటిల్ విన్ కావడం లో అంతే మైనస్ అయ్యే ప్రమాదం ఉందని రివ్యూవర్స్ లెక్కలు వేస్తున్నారు. నిఖిల్ కు తన ఫ్రెండ్స్ యశ్మీ, పృథ్వి, విష్ణు ప్రియల ఓటింగ్ ఎంతో కొంత హెల్ప్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి. రోహిణి, తేజల ఓటింగ్ కొద్దో గొప్పో అవినాష్ వైపు వెళ్లిపోతాయి. సో గౌతమ్ కు పడి ఓటింగ్ కేవలం అతనిది మాత్రమే. అందులో ఏమాత్రం తగ్గినా నెంబర్ 2 స్థానంతోనే గౌతమ్ సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది గౌతమ్ ఆటకు ఉన్న అతిపెద్ద మైనస్. కానీ నీరసంగా సాగుతున్న బిగ్ బాస్ సీజన్ 8 ను కామెడీతో అవినాష్ రక్షిస్తే, ఫైర్ తో ఆడుతూ గౌతమ్ కాపాడాడు.టైటిల్ గెలిచినా గెలవకున్నా సీజన్ సెవెన్ లో శివాజీ ఎలాంటి ప్రభావం చూపాడో సీజన్ 8 లో గౌతమ్ అంతే ఎఫెక్ట్ చూపించాడు అనడం లో అతిశయోక్తి లేదు. ఇక టైటిల్ విన్నర్ అవుతాడా లేదా అనేది ఈ వారం తనకు పడే ఓట్ల పై ఆధారపడి ఉంటుంది.
Also Read: అవినాష్‌కు బిగ్‌బాస్ టైటిల్ గెలిచే సత్తా ఉందా? అతనిలో ప్లస్‌లు ఏంటి? మైనస్‌లు ఏంటి?