బిగ్ బాస్ సీజన్ 8 లోకి వచ్చిన 14 మంది కంటెస్టెంట్స్ లో సోనియానే ఎక్కువగా హైలెట్ అవుతుంది. అయితే ఆమెపై పాజిటివిటీ కంటే నెగిటివిటీనే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మాటకు ముందు విష్ణు ప్రియపై పడి ఏడుస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆమె అభిమానులు. మొదటివారం బేబక్క తను చూసినా, పక్కన నిలుచున్నా, నడుస్తున్నా  ప్రాబ్లం అంటుంది అంటూ సోనియాపై మండిపడింది.. అయితే ఆమె హౌస్ లో నుంచి వెళ్ళిపోయాక ఇప్పుడు అదే పరిస్థితి విషుప్రియ, సోనియా మధ్య నెలకొంది. ఈ నేపథ్యంలోనే తాజా ఎపిసోడ్ లో సోనియా తన లవర్ గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. 


నిఖిల్ తో లవర్ గురించి ఓపెన్ అయిన సోనియా...
నిన్నటి ఎపిసోడ్ లో ఎమోషనల్ సర్ప్రైజ్ చేసి బిగ్ బాస్ అందరినీ ఏడిపించారు. ఆ తర్వాత సోనియా, నిఖిల్ ఒకే దగ్గర చేరి కాసేపు మాట్లాడుకున్నారు. ఆ టైంలో సోనియా బాగా ఎమోషనల్ అయింది. ముందుగా నిఖిల్ "అంతా ఓకే కదా" అని అడిగాడు. అయితే సోనియా అతని ప్రశ్నకు సమాధానంగా "అవును.. కానీ ఇంకేం వస్తాయో తెలియట్లేదు" అని చెప్పుకొచ్చింది. ఆ వెంటనే నిఖిల్ "నువ్వేంటో అతనికి కంప్లీట్ గా తెలుసు కదా" అని అడిగాడు. సోనియా రిప్లై ఇస్తూ "అవును తెలుసు.. అదే నాకున్న నమ్మకం" అంటూ ఏడ్చింది. "100 మంది 100 రకాలుగా మాట్లాడుతారు అని నువ్వే అంటావు కదా నాన్న.. కానీ నిజం ఏంటో నీకే తెలుసు" అని అన్నాడు. ఆ మాటకి వెంటనే నిఖిల్ ఒడిలో పడుకుని బోరున విలపించింది సోనియా. అయితే ఈ ఎపిసోడ్లో వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ సీన్ ను ఒకటికి రెండుసార్లు రిపీట్ చేసుకుని చూస్తేనే గాని సోనియా తన లవర్ గురించి బాధపడుతోందనే విషయం అర్థం కాలేదు. బయట లవర్ ఉన్నాడని, హౌస్ లో జరిగేదంతా చూసి ఏమనుకుంటాడో అని సోనియా లోలోపలే భయపడుతోందన్న విషయం ఈ సీన్ ద్వారా స్పష్టమైంది. అయితే ఆమె తన లవర్ ఎవరు ? అన్న విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు. 


Read Also : Bigg Boss Telugu 8 Day 13 - Promo 1 : ఎఫ్ వర్డ్స్ పై ఫైర్, పృథ్వీకి స్ట్రాంగ్ వార్నింగ్... గన్ గురి పెట్టి యష్మి గౌడ బాగోతం బయట పెట్టిన నాగ్ 


సోనియా ట్రయాంగిల్ లవ్ స్టోరీ...
హౌస్ లో ఏం జరుగుతుందో తెలియదు గానీ బయటకు మాత్రం సోనియా పృథ్వి, నిఖిల్ లతో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపిస్తుందా అన్నట్టుగా కనిపిస్తోంది. సోనియా ఎక్కువగా వీళ్ళిద్దరితోనే కనిపిస్తుంది. అభయ్ కూడా మంచి బాండింగ్ ఉన్నప్పటికీ వాళ్ళిద్దరి రిలేషన్ కేవలం ఫ్రెండ్షిప్ లాగే కనిపిస్తోంది బిగ్ బాస్ షో చూసే ప్రేక్షకులకి. ఇక నిఖిల్, సోనియా.. అలకలు, తిరిగి మాట్లాడుకోవడాలు, ఒకరిపై ఒకరు కోప్పడడం, బుజ్జగించుకోవడం వంటివి చూస్తుంటే నిజంగానే వీళ్ళు లవర్స్ అని ఫీలింగ్ కలుగుతుంది ఆడియన్స్ కి. అయితే సోనియా భయపడుతున్నట్టుగా ఆమె లవర్ ఈ బిగ్ బాస్ షోని గనక చూస్తే ఎలా ఫీల్ అవుతారో మరి. ఏదేమైనా విన్ అవ్వడం కోసం ఏది పడితే అది చేస్తే ఆ తర్వాత పర్సనల్ లైఫ్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ కచ్చితంగా ఉంటుంది. మరి సోనియా భయపడుతున్నట్టుగా జరుగుతుందా? లేదంటే అతను అర్థం చేసుకుంటాడా? అనేది చూడాలి.


Read Also: ఈ వీక్ ఎలిమినేషన్ కత్తి ఆ ఇద్దరి మీదే... ఇది ఊహించలేదు భయ్యా