యాంకర్ శివ అంటే ఇన్నాళ్లూ కాంట్రావర్శీలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచాడు. వివాదాస్పద ఇంటర్వ్యూలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతడు.. ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’లోకి వస్తున్నాడంటే.. ఎన్ని వివాదాలు నెలకొంటాయోనని ప్రేక్షకులు భావించారు. తప్పకుండా రెండు వారాల్లో సూట్ కేస్ సర్దేస్తాడని భావించారు. కానీ, అక్కడ జరిగింది వేరు. హౌస్‌లో ఉన్న అమ్మాయిలకు శివ కలిపే పులిహోర ప్రజలకు బాగా నచ్చింది. వివాదాలకు పోకుండా.. ‘స్వాతి ముత్యం’లో కమలహాసన్‌లా ఎక్స్‌ప్రెషన్స్ పెడుతూ.. డబుల్ మీనింగ్ డైలాగులతో నిబ్బా-నిబ్బీలకు అవసరమైన కంటెంట్ ఇచ్చాడు. ఫైర్ బ్రాండ్, ఆడపులి.. బిందు మాధవితో స్నేహంగా ఉంటూ.. ఆమె అభిమానుల సపోర్ట్ కూడా పొందాడు. నటరాజ్ మాస్టార్ లాంటి పవర్ ఫుల్ కంటెస్టులను సైతం తట్టుకుని నిలబడ్డాడు. చివరికి.. ఎవరూ ఊహించని విధంగా ఓట్లు సాధించి అఖిల్, బిందుల తర్వాత మూడో స్థానంలో నిలిచి ఆశ్చర్యపరిచాడు. 


నోటి దురదతో హౌస్‌లో ఒకసారి ఫన్, మరోసారి సవాళ్లు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది శివకు. కానీ, ఎక్కడో అతడికి లక్ కలిసి వచ్చింది. మిత్రాలాంటి విషయంలేని కంటెస్టెంటే.. టాప్-5 వరకు వచ్చిందంటే, శివ రాకుండా ఉండగలడా. వచ్చాడు, కానీ అతడు మరికాస్త నోటిని అదుపులో పెట్టుకుని మెలిగి ఉంటే అఖిల్, బిందులకు కూడా గట్టి పోటీయే ఇచ్చేవాడేమో. ఏది ఏమైనా అతడు మూడో స్థానం వరకు వచ్చాడంటే నిజంగా గ్రేటే. అయితే, అతడి జర్నీ ఇంతటితో ఆగిపోలేదు. ఈ స్థాయి వరకు వచ్చే ఓటీటీ కొత్త కంటెస్టెట్లకు ‘బిగ్ బాస్’ రెగ్యులర్ సీజన్లో చాన్స్ లభిస్తుంది. ఈ నేపథ్యంలో శివకు ‘బిగ్ బాస్’ సీజన్-6లో మళ్లీ ఛాన్స్ లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 


Also Read: క్యాష్‌‌తో అరియానా ఔట్, దొంగ సచ్చినోళ్లంటూ అనిల్, సునీల్‌పై ఆగ్రహం


పేదింటి కుర్రాడు.. ఇలా పాపులర్ అయ్యాడు: శివ పేదింటి కుర్రాడు. మీడియాలోకి రాక ముందు ఉపాది కోసం ఓ టీవీ చానెల్ డీఎస్ఎన్జీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఆ చానెల్‌లో పనిచేసే జర్నలిస్టులను దగ్గరుండి చూసేవాడు. దీంతో అతడికి కూడా రిపోర్ట్ కావాలనే ఆశ ఉండేది. ఆ ఆశ అతడిని సొంతంగా యూట్యూబ్ చానెల్ ఏర్పాటు చేసేలా చేసింది. చిన్న చిన్న టిక్ టాక్ స్టార్లు మొదలుకుని.. టాలీవుడ్ స్టార్లను ఇంటర్వ్యూ చేసే స్థాయికి చేరుకున్నాడు. చివరికి జబర్దస్త్ స్టేజ్‌పై అనసూయను కాంట్రవర్శీ ప్రశ్నలేసి ఆశ్చర్యపరిచాడు. ఆ వివాదాలు శివను బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టేలా చేశాయి. హేమాహేమీ కంటెస్టెంట్లను సైతం వెనక్కి నెట్టి టాప్-3గా బయటకు వచ్చాడు. 


Also Read: హౌస్ మేట్స్ కి ఫన్నీ అవార్డులు - అషుకి బకెట్, నటరాజ్ మాస్టర్ కి వచ్చిందేంటంటే?