బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఈరోజు ఫినాలే ఎపిసోడ్ తో ముగియనుంది. హౌస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు, ఎక్స్ హౌస్ మేట్స్ తో మాట్లాడారు. టాప్ 2 అండ్ 3లో ఎవరు ఉంటారో చెప్పమని అడిగారు. దీంతో ఒక్కొక్కరూ వారి అభిప్రాయాలను తెలిపారు. అనంతరం టాప్ 7 కంటెస్టెంట్స్ తో మాట్లాడారు. ఆ తరువాత ఇద్దరు కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేశారు. ముందుగా అనిల్ ని, ఆ తరువాత బాబా భాస్కర్ ని ఎలిమినేట్ చేశారు. 


హౌస్ మేట్స్ కి ఫన్నీ అవార్డులు.. 


బిగ్ బాస్ హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ కి, ఎక్స్ హౌస్ మేట్స్ కి అవార్డ్స్ ఇవ్వడానికి 'మేజర్' టీమ్ ని స్టేజ్ పైకి పిలిచారు నాగార్జున. అడివి శేష్, శోభితా, సయీ మంజ్రేకర్ వచ్చి తమ సినిమా గురించి మాట్లాడారు. ఆ తరువాత హౌస్ మేట్స్ కి తమ క్యారెక్టర్ ని బట్టి ఫన్నీ అవార్డ్స్ ఇచ్చారు.  
అషురెడ్డి       -  ఎకో ఫ్రెండ్లీ అవార్డ్ అని చిన్న బకెట్ ఇచ్చారు.


స్రవంతి        -  అన్నపూర్ణ అవార్డు అని కిచెన్ సెట్ ఇచ్చారు.


సరయు        -  ఎమోషనల్ స్టార్ అవార్డ్ (కన్నీరు వాటర్ బాటిల్)


అజయ్         -  రొమాంటిక్ స్టార్ అవార్డ్స్ (అమ్మాయిల లిప్స్ స్టిక్)


బాబా భాస్కర్ -  వేరే లెవెల్ అవార్డు (సూపర్ కటౌట్)


అనిల్            -  బెస్ట్ కెప్టెన్ అవార్డు (కెప్టెన్ బ్యాడ్జ్)


ఆర్జే చైతు       -  కోకోనట్ స్టార్ (కొబ్బరికాయ)


శ్రీరాపాక         -  స్మగ్లర్ ఆఫ్ ది హౌస్


హమీద           -  చక్కెర దొంగ (షుగర్ క్యూబ్స్)


మహేష్ విట్టా  -  మిస్టర్ కూల్ అవార్డు (ఐస్ ప్యాక్)


తేజస్వి           -  రెండు పిలకల అవార్డు (రిబ్బన్)


శివ                 -   నోటి దూల అవార్డు


మిత్రాశర్మ      -  బెస్ట్ రైడర్ అవార్డు (హెల్మెట్)


బిందు మాధవి - బెస్ట్ అడ్వకేట్ అవార్డు (లాయర్ కోట్)


అఖిల్              - పీచ్ సోఫా అవార్డు (సోఫా బొమ్మ)


అరియనా         -  మిస్ టీ కప్ లెగ్ స్లిప్ అవార్డు (టీ కప్పు)


నటరాజ్ మాస్టర్ - రింగ్ మాస్టర్ అవార్డు (కొరడా)


Also Read: టాప్ 7 కంటెస్టెంట్స్ లో ఒకరు ఔట్ - ఎవరంటే?


Also Read: బాబా భాస్కర్ ను ఎలిమినేట్ చేసిన సత్యదేవ్