బిగ్ బాస్ సీజన్ 7 అనేది ఉల్టా పుల్టా కావడంతో నామినేషన్స్ ఒకరోజు కాకుండా రెండురోజులు ప్రసారమవుతున్నాయి. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు కూడా రసవత్తరంగా సాగుతుండడంతో రెండురోజులు జరిగే నామినేషన్స్‌ను ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా జరిగిన నామినేషన్స్ కూడా రెండోరోజు ప్రసారానికి సిద్ధమవుతున్నాయి. రెండోరోజు నామినేషన్స్‌కు సంబంధించిన ప్రోమోలు తాజాగా విడుదలయ్యాయి. ఈ ప్రోమోలో అమర్‌దీప్, యావర్ మాత్రమే ఎక్కువగా వాగ్వాదం జరిగినట్టు అర్థమవుతోంది. కానీ వీరిద్దరి మధ్య గొడవ వెనుక అసలు కారణమేంటి అనేది హైలెట్‌గా నిలవనుంది. అమర్.. రతికాను నామినేట్ చేయాలనుకున్నప్పుడు యావర్ మధ్యలోకి వచ్చాడా లేదా యావర్‌ను నామినేట్ చేయాలనుకున్నప్పుడు రతిక మధ్యలో మాట్లాడిందా అనేది ప్రోమోలో సస్పెన్స్‌గా నిలిచింది.
యావర్, అమర్ మధ్య చిచ్చుపెట్టిన రతిక
బిగ్ బాస్ సీజన్ 7 అనేది 72వ రోజుకు చేరుకుంది. అయినా కంటెస్టెంట్స్ సిల్లీ కారణాలతో నామినేషన్స్ చేయడం ఆపలేదు. అంతే కాకుండా ముందెప్పుడో జరిగిపోయిన విషయాలను గుర్తుచేసుకుంటూ కూడా నామినేట్ చేసుకుంటున్నారు. తాజాగా విడుదలయిన ప్రోమోలో అమర్‌దీప్, యావర్ మధ్య కూడా అందుకే వాగ్వాదం మొదలయినట్టుగా అనిపిస్తోంది. ముందుగా అమర్‌దీప్.. రతికను నామినేట్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ‘‘రతిక నీకొక విషయం చెప్పదలచుకున్నాను’’ అంటూ తన నామినేషన్స్ గురించి చెప్పడం మొదలుపెట్టాడు అమర్. ‘‘బయటికి వెళ్లొచ్చినదానివి ఎవరి మీద ఇలాంటి పాయింట్స్ చెప్పకు’’ అని రతికకు సలహా ఇచ్చాడు. అమర్ తన పాయింట్ చెప్తుండగానే.. యావర్ మధ్యలోకి వచ్చాడు.
ఎవరివి గొప్ప జాతకాలు కాదు
‘‘తనకు అది పాత మాట అయ్యిండొచ్చు, నాకు మాత్రం ఇది కొత్త మాటే’’ అని యావర్ మధ్యలో మాట్లాడి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ‘‘పూర్వాలు తవ్వుకుంటే ఒక్కొక్కరి జాతకాలు ఏమంత మహా గొప్ప జాతకాలు కాదు ఇక్కడ’’ అని అమర్ చెప్తుండగానే.. రతిక మధ్యలో మాట్లాడడం మొదలుపెట్టింది. ‘‘ఇప్పుడు నీ నామినేషన్ పాయింట్ అదేనా? రెండో, మూడో వారందా?’’ అని యావర్‌ను ప్రశ్నించింది. ‘‘స్ప్రైట్ కోసం నామినేట్ చేసిన యావర్’’ అని అమర్ చెప్తుండగానే.. యావర్ సీరియస్ అయ్యాడు. ‘‘నీ ప్రవర్తన కరెక్టా?’’ అని ప్రశ్నించాడు. దానికి అమర్.. ‘‘రతికతో చెప్పింది చూశావా’’ అని ఎదురుప్రశ్న వేశాడు.
శివాజీకి గౌతమ్ కౌంటర్
ఇలా అమర్‌దీప్‌కు, యావర్‌కు మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు కూడా. కానీ కెప్టెన్‌గా ఉన్న శివాజీ వీరిద్దరి గొడవను ఆపే ప్రయత్నం చేశాడు. ‘‘అమర్ కావాలి, అమర్ పోవాలి’’ అంటూ తనను ఎలిమినేట్ చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని అమర్ ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చాడు. ‘‘గొడవలో ఎంతోకొంత కారణంలాగా నువ్వు ఉన్నావు. నిజంగా వేయాలనుకుంటే నీకు వేసేసేవాడిని. కానీ నాకు తెలివి ఉంది’’ అన్నట్టుగా యవర్‌ను ఉద్దేశించి అన్నాడు అమర్. ఆ తర్వాత వచ్చిన శివాజీ.. గౌతమ్‌ను నామినేట్ చేస్తున్నట్టుగా చెప్పాడు. ‘‘బిగ్ బాస్ హౌజ్‌లో ఎమోషన్ అనేది లూస్ మోషన్ లాంటిది. మనం ఫ్లోను ఆపలేము’’ అని గౌతమ్ కౌంటర్ ఇచ్చాడు. ‘‘అదే కంట్రోల్ చేసుకోవాలి’’ అని శివాజీ సలహా ఇచ్చాడు.
Also Read: నిన్న రతిక - నేడు అర్జున్.. నా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి బావా అంటూ నామినేట్ చేసిన అశ్విని