Sound Party movie release date announced : 'బిగ్ బాస్ 5' విజేత, యువ హీరో వీజే సన్నీ (VJ Sunny) నటించిన తాజా సినిమా 'సౌండ్ పార్టీ'. ఇందులో హ్రితిక శ్రీనివాస్ కథానాయిక. సంజ‌య్ శేరి ద‌ర్శ‌కత్వం వహించిన చిత్రమిది. ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర ప్రొడ్యూస్ చేశారు. 'పేపర్ బాయ్' దర్శకుడు జయ శంకర్ సమర్పించిన ఈ చిత్రాన్ని ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. 


నవంబర్ 24న 'సౌండ్ పార్టీ' విడుదల
వంబర్ 24న 'సౌండ్ పార్టీ'ని భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత ర‌వి పోలిశెట్టి మాట్లాడుతూ... ''ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. మాకు మంచి బిజినెస్ కూడా జరిగింది. ముఖ్యంగా వీజే స‌న్ని, ఆయన తండ్రి పాత్రలో నటించిన శివ‌న్నారాయ‌ణ కెమిస్ట్రీ బావుందని చాలా మంది చెబుతున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ అండ్ ఫన్ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మా సినిమాను హిట్ చేస్తారని నమ్ముతున్నా'' అని చెప్పారు.


Also Read సంక్రాంతి బరిలో మామా అల్లుళ్ళ మధ్య పోటీనా? మాజీ భార్య భర్తల మధ్య పోటీనా?  


చిత్ర ద‌ర్శ‌కుడు సంజ‌య్ శేరి మాట్లాడుతూ... ''మా నిర్మాతలు నాకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చారు. మా ఫిల్మ్ ప్రజెంటర్ జ‌య శంక‌ర్ మద్దతుతో సినిమాను అనుకున్న విధంగా తెరకెక్కించా. ఇటీవ‌ల యూనిట్ అంతా సినిమా చూశాం. మేం చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ నెల 24న విడుదల అవుతున్న సినిమాకు మంచి స్పందన లభిస్తుందని నమ్ముతున్నా'' అని అన్నారు. జ‌య శంక‌ర్ మాట్లాడుతూ... ''పాట‌లు, టీజ‌ర్ సినిమాను ప్రేక్షకులలోకి తీసుకు వెళ్లాయి. ద‌ర్శ‌కుడు సంజ‌య్ శేరికి ఏ న‌మ్మ‌కంతో అయితే దర్శకత్వం ఇచ్చానో... దాన్ని నిల‌బెట్టుకున్నాడు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులకు నచ్చే విధంగా ఒక మంచి ఫ్యామిలీ సినిమా తీశాడు'' అని అన్నారు.


Also Read : టాలీవుడ్‌లో మరో విషాదం - చంద్ర మోహన్ మరణించిన రోజే 'రొమాంటిక్ క్రైమ్ కథ', 'రొమాంటిక్ క్రిమినల్స్' నిర్మాత రవీంద్ర బాబు మృతి



Sound Party Movie Cast And Crew : 'సౌండ్ పార్టీ' సినిమాలో శివన్నారాయణ, అలీ, సప్తగిరి, '30 ఇయర్స్' పృథ్వీ, 'మిర్చి' ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, 'జెమిని' సురేష్, భువన్ సాలూరు, అంజలి, ఇంటూరి వాసు, 'చలాకి' చంటి, ప్రేమ్ సాగర్, ఆర్జే హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ త‌దిత‌రులు నటించారు. 'సౌండ్ పార్టీ' సినిమాకు కూర్పు : జి. అవినాష్, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్, పాటలు : పూర్ణ చారి, ఛాయాగ్రహణం : శ్రీనివాస్ రెడ్డి, సంగీతం : మోహిత్ రెహమానిక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : భువన్ సాలూరు, నిర్మాతలు : రవి పోలిశెట్టి - మహేంద్ర గజేంద్ర - శ్రీ శ్యామ్ గజేంద్ర, సమర్పణ : జ‌య‌శంక‌ర్‌, రచన - ద‌ర్శ‌కత్వం : సంజ‌య్ శేరి.