బిగ్గెస్ట్ బుల్లితెర తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 8 మూడవ వారం కొనసాగుతోంది ఇప్పుడు. గత రెండు వీకెండ్ ఎపిసోడ్లలో హౌస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్స్ బయటకు వెళ్లారు. మొదటివారం బెజవాడ బేబక్క, రెండవ వారం శేఖర్ బాషా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. అయితే ఇప్పుడు మూడవ వారం ఓటింగ్ రిజల్ట్స్ షాకింగ్ గా ఉన్నాయి. ఈవారం ఊహించని ఇద్దరు కంటెస్టెంట్స్ లీస్ట్ ఓటింగ్ లో ఉండడం గమనార్హం. మరి మూడవ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేది ఎవరు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డేంజర్ జోన్ లో ఆ ఇద్దరు?
సెప్టెంబర్ 1 న 14 మంది కంటెస్టెంట్స్ తో ఘనంగా ప్రారంభమైన బిగ్ బాస్ కొత్త సీజన్ ఇప్పుడిప్పుడే నెమ్మదిగా వేగం పొంజుకుంటుంది. నిజానికి హౌస్ మేట్స్ లో చాలామంది తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవడంతో మొదటి వారం అంతా కొత్త ముఖాలకు అలవాటు పడడంతోనే సరిపోయింది ఆడియన్స్ కు. రెండవ వారం కూడా వాళ్ల పేర్లను గుర్తు పెట్టుకోవడానికి, ఆ గుడ్డు గొడవతో చిరాకు పడడానికి సరిపోయింది. మొత్తానికి మూడో వారం నుంచి హౌస్ మేట్స్ లో ఎవరెవరు ఏంటి అని తెలియడంతో వారి వారి లక్షణాలను బట్టి ఇష్టపడడం, వాళ్ళని చూస్తే చిరాకు పడడం వంటివి చేయడం మొదలుపెట్టారు బిగ్ బాస్ లవర్స్. ప్రస్తుతం హౌస్ లో ఉన్న వారిలో సోనియాపై నెగెటివిటీ ఎక్కువగా ఉంది. ఇక నాగ మణికంఠ, నిఖిల్, విష్ణు ప్రియకు ఫుల్ పాజిటివ్ ఉంది. ఇక మూడవ వారం నామినేషన్లలో కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు చెత్త వేసుకుని మరీ నామినేట్ చేసుకుంటూ దుమ్మురేపారు. నామినేషన్ల సమయంలో సోనియా - యష్మి, యష్మి- మణికంఠ, పృథ్వీరాజ్ - సీతా, ప్రేరణ - నబిల్ మధ్య తీవ్ర వాగ్వాదమే జరిగింది. ఆ టైంలో యష్మి గౌడ నోరు జారింది. ఇక తాజాగా వచ్చిన ఓటింగ్ రిజల్ట్స్ ని బట్టి చూస్తే బిగ్ బాస్ తెలుగు 8 మూడవ వారం ఎలిమినేషన్ లిస్టులో ఉన్న వారిలో యష్మి గౌడ, అభయ్ నవీన్, పృథ్వీరాజ్ డేంజర్ జోన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది.
తన గొయ్యి తానే తవ్వుకున్న అభయ్
మూడవ వారం నామినేషన్లలో పృధ్విరాజ్, విష్ణు ప్రియ, మణికంఠ, కిరాక్ సీత, నైనిక, ప్రేరణ, యష్మి గౌడ, అభయ నవీన్ ఉన్నారు. అయితే వీరిలో ప్రస్తుతం విష్ణు ప్రియ ఓటింగ్ పరంగా టాప్ లో దూసుకెళ్తోంది. ఆమెకు 27% ఓటింగ్ రాగా, ఆ తర్వాత ప్లేస్ లో మణికంఠ ఉన్నాడు. మూడో ప్లేస్ లో కిరాక్ సీత, నాలుగో ప్లేస్ లో నైనిక, ఐదో ప్లేస్ లో ప్రేరణ ఉన్నారు. ఇక చివరి మూడు స్థానాల్లో యష్మి గౌడ, అభయ్ నవీన్, పృథ్వీరాజ్ ఉన్నారు. ఊహించని విధంగా అభయ్ నవీన్ ఈ డేంజర్ జోన్ లో ఉన్నవారి లిస్టులో ఉండడం విశేషం. పృథ్వి గత నామినేషన్లలో కూడా ఇలాగే చివర్లో నిలిచాడు కానీ సేవ్ అయ్యాడు. మరి ఈసారి వీరిద్దరిలో బయటకు వెళ్ళేది ఎవరో చూడాలి.