బిగ్ బాస్‌లోకి వెళ్లే ముందు అందులోని కొందరు కంటెస్టెంట్స్.. ప్రేక్షకులకు తెలిసే అవకాశం ఉంది. వారిని సీరియల్స్‌లో, షోలలో, యూట్యూబ్ వీడియోలలో.. ఇలా ఏదో ఒకచోట చూసే ఉంటారు. కానీ ఆ కంటెస్టెంట్స్ బయట ఎలా ఉంటారు, అసలు వారి క్యారెక్టర్ ఏంటి, వారు ఎలా మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాన్ని బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లిన తర్వాతే తెలుసుకుంటారు ప్రేక్షకులు. అలా తెలుసుకున్న తర్వాత అందరిపై వారి అభిప్రాయాలు మారిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్స్‌గా ఉన్నవారిలో ప్రేక్షకులకు బాగా తెలిసిన కంటెస్టెంట్‌ ఒకరిపై నెగిటివ్ అభిప్రాయం ఏర్పడుతోంది. అంతే కాకుండా తనకు ఫేక్ అనే ట్యాగ్ కూడా ఇచ్చేస్తున్నారు.


కేవలం టాస్కుల్లోనే..


బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయినప్పటి నుంచి ఇప్పటికీ నలుగురు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు. కిరణ్ రాథోడ్, రతిక, షకీలా, దామిని.. ఇలా ఒకరి తర్వాత ఒకరు బిగ్ బాస్ హౌజ్‌ను వదిలి వెళ్లిపోయారు. కానీ వీరికంటే దారుణంగా ఆడే కంటెస్టెంట్స్.. ఇంకా హౌజ్‌లోనే ఉన్నారని కొందరు ప్రేక్షకులు భావిస్తున్నారు. కొందరు కంటెస్టెంట్స్.. తమ స్ట్రాటజీలతో అందరి చేత మెప్పుపొందుతుంటే.. మరికొందరు మాత్రం తమ ప్రవర్తనతో కంటెస్టెంట్స్‌ మాత్రమే కాదు.. ప్రేక్షకుల సహనాన్ని కూడా పరీక్షిస్తున్నారు. ముఖ్యంగా టాస్కుల సమయంలో బాగా ఆడి.. మిగతా సమయాల్లో అసలు కెమెరా ముందుకు రాని కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు.


నామినేషన్స్‌లో మాత్రమే..


ఎన్నో సీరియల్స్‌లో హీరోగా నటించి ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు అమర్‌దీప్. తను నటించిన ప్రతీ సీరియల్‌లో అమర్ చేసే పాత్రకు బుల్లితెర ప్రేక్షకులు ఫ్యాన్స్ అయిపోయేవారు. కానీ ఆ ఫ్యాన్‌డమ్‌ను అంతా బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చి అమర్‌దీప్ కోల్పోతున్నాడేమో అని విశ్లేషకులు అంటున్నారు. నామినేషన్స్ సమయంలో కాకుండా మిగతా సమయాల్లో అమర్‌దీప్ ఎక్కువగా సైలెంట్‌గానే ఉంటున్నాడు. కొన్ని టాస్కుల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్నా కూడా ఎందులోనూ విన్నర్ కాలేకపోతున్నాడు. వపర్ అస్త్రా కోసం నాలుగుసార్లు పోటీ జరగగా.. ఆ నాలుగుసార్లు తను కంటెండర్‌షిప్‌కు దగ్గరగా వచ్చి మరీ ఓడిపోయాడు. దీంతో అమర్ అసలు ఏ టాస్కులో కూడా గెలవడు అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో వచ్చేసింది.


ఫ్రెండ్‌షిప్ వల్లే అమర్‌దీప్ ఓటమి..


అమర్‌దీప్, ప్రియాంక.. కలిసి సీరియల్స్‌లో నటించేవారు. వీరికి బిగ్ బాస్‌కంటే చాలా ముందు నుండే మంచి స్నేహం ఉంది. దీంతో వీరిద్దరూ బిగ్ బాస్ హౌజ్‌లో కలిసి ఆడుతున్నారు అనే నెగిటివ్ అభిప్రాయాన్ని మూటగట్టుకున్నారు. కొన్నిసార్లు వీరి ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. దీంతో అమర్ ఫేక్ అని, కేవలం కొందరు కంటెస్టెంట్స్‌తో మాత్రమే బాగుంటాడని నెగిటివ్ అభిప్రాయం ప్రేక్షకుల్లో మొదలయ్యింది. తనపై ఫేక్ అని ముద్రవేశారు కూడా. దీంతో బిగ్ బాస్ ప్రేక్షకులు.. అమర్‌దీప్ ప్రవర్తన ఇలాగే కొనసాగితే.. ఎలిమినేట్ అవ్వక తప్పదు అని భావిస్తున్నారు. టాస్కుల్లో విన్నర్ అవ్వడానికి చాలా కష్టపడిన తర్వాత తాను ఓడిపోయానని తెలిస్తే.. అమర్‌దీప్ ప్రవర్తనే మారిపోతుంది. అలా ఒకట్రెండు సందర్భాల్లో తను బూతులు కూడా మాట్లాడాడు. దీంతో సీరియల్ హీరోగా అభిమానులను సంపాదించుకున్న అమర్‌దీప్.. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా మాత్రం నెగిటివ్ అభిప్రాయాన్ని సంపాదించుకున్నాడని అందరూ అనుకుంటున్నారు.


Also Read: అది చిన్న పిల్లా ఏంది? బర్రె పిల్ల, చంపేస్తా దాన్ని - రతికపై ప్రశాంత్ వ్యాఖ్యలు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial