టీచర్లుగా మారిన కంటెస్టెంట్స్, యావర్‌కు క్లాస్


ప్రిన్స్ యావర్‌కు బిగ్ బాస్.. తెలుగు క్లాస్ పెట్టించిన ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ‘‘బిగ్ బాస్ యావర్‌కు తెలుగు క్లాస్ పెట్టించాలని అనుకుంటున్నారు. ఈ తెలుగు క్లాస్‌లో భాగంగా ఇంట్లోని వారంతా టీచర్లుగా మారి, అయిదు తెలుగు పదాలను నేర్పించాల్సి ఉంటుంది.’’ అని బిగ్ బాస్ తెలిపారు. దీంతో హౌజ్‌లోని ఇతర కంటెస్టెంట్స్ అంతా టీచర్లు అవ్వగా.. యావర్ మాత్రం స్టూడెంట్‌గా అల్లరి చేయడం మొదలుపెట్టాడు. ముందుగా టీచరమ్మగా ప్రియాంక వచ్చి.. ‘‘మనం ఈరోజు నేర్చుకోబోయేది ఏంటంటే..’’ అంటూ తన పాఠాన్ని ప్రారంభించింది. ‘‘శోభాతో నువ్వు ఏం చేశావ్’’ అని అడగగా.. ‘‘సరసం’’ అని సమాధానమిచ్చాడు యావర్. ఆ సమాధానం విన్న తేజ.. ‘‘రేయ్ ఏం చేశావ్ రా’’ అంటూ ఫన్నీగా అడిగాడు.


తేజ పంచ లాగిన యావర్


ఆ తర్వాత టీచర్‌గా వచ్చాడు టేస్టీ తేజ. ‘‘నువ్వు గేమ్‌లో సరిగా ఆడకపోతే.. మూడు స్టార్లు తీసుకురాకపోతే నేను నీతో ఏమంటాను’’ అని తేజ పాఠం చెప్తుండగానే.. తను కట్టుకున్న పంచను లాగి అక్కడి నుండి పారిపోయాడు యావర్. దీంతో కాసేపు ఫన్ క్రియేట్ అయ్యింది. ఆ తర్వాత మోడర్న్ గెటప్‌లో టీచర్‌గా వచ్చింది శోభా శెట్టి. ‘‘నీ భార్య సోదరిని ఏమంటారు?’’ అని ప్రశ్నించింది. దానికి యావర్.. ‘‘శోభా’’ అని సమాధానమిచ్చాడు. దీంతో కోపమొచ్చిన శోభా.. మరదలు అంటారు అంటూ యావర్‌ను గొడుగుతో కొట్టింది. దానికి యావర్ బాగుంది టీచర్ అంటూ ఐస్ చేసే ప్రయత్నం చేశాడు. అమర్‌దీప్ వచ్చి లైట్ అంటే తెలుగులో వెలుగు అని యావర్‌కు నేర్పిస్తుండగా.. ‘‘నువ్వు వెలుగురా ముందు’’ అంటూ కౌంటర్ ఇచ్చాడు తేజ. 


ఎక్కువగా ఏడవను అంటూ ఏడ్చేసిన గౌతమ్


యావర్‌కు తెలుగు పాఠాలు అనే అంశం ముగిసిన వెంటనే.. ప్రోమో మళ్లీ ఎమోషనల్‌గా మారిపోయింది. శుభశ్రీకి తన అక్క దగ్గర నుండి లెటర్ వచ్చింది అని తెలిసిన వెంటనే తను ఏడవడం మొదలుపెట్టింది. దీంతో గౌతమ్ వచ్చి ప్లీజ్ ఏడవకు అని ఓదార్చబోయాడు. ఆ తర్వాత లెటర్ చదవలేనేమో అన్న బాధతో తన అక్కకు సారీ చెప్పింది శుభ. గౌతమ్ కూడా తనకు వచ్చిన లెటర్‌ను పట్టుకొని ఏడ్చాడు. ‘‘ఐ లవ్యూ మమ్మీ. నాకు మామూలుగా కన్నీళ్లు రావు. ఎప్పుడూ ఎక్కువ ఏడవను కూడా.’’ అని చెప్తూనే ఏడవడం మొదలుపెట్టాడు గౌతమ్. ఆ తర్వాత యావర్, తేజ మధ్య లెటర్స్ గురించి సంభాషణ జరిగింది. ‘‘కుటుంబం నా బలం’’ అని యావర్ చెప్పగా.. ‘‘నాకు తెలుసు నువ్వు శారీరకంగా బలంగా ఉన్నావు. లెటర్ చదివితే మానసికంగా కూడా బలంగా అవుతావు’’ అని తేజ అన్నాడు. కానీ యావర్ మాత్రం తేజ మాట వినకుండా తన లెటర్‌ను చించేశాడు.



Also Read: అది చిన్న పిల్లా ఏంది? బర్రె పిల్ల, చంపేస్తా దాన్ని - రతికపై ప్రశాంత్ వ్యాఖ్యలు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial