బిగ్ బాస్ సీజన్ 7లో తాజాగా నామినేషన్స్ ముగిశాయి. ఈ నామినేషన్స్ అంతా చాలా వాడివేడిగా కొనసాగాయి. ఇదంతా చూస్తుంటే ప్రేక్షకులు.. అప్పుడే ఫైనల్స్‌కు వచ్చేసిన ఫీలింగ్ వస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కంటెస్టెంట్స్ అంతా ఒకరి తప్పును మరొకరు యాక్సెప్ట్ చేయలేకపోవడం, చిన్న చిన్న విషయాలకు మనస్ఫర్థలు పెంచుకోవడం లాంటివి చేస్తూ.. గొడవలు అంటే ఇష్టపడే ఆడియన్స్ ఫుల్ ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తున్నారు. ఇక నామినేషన్స్ తర్వాత ఎపిసోడ్‌కు సంబంధించిన బిగ్ బాస్ ప్రోమో తాజాగా విడుదలయ్యింది. మాటలతో యుద్ధాలు చేసుకున్న కంటెస్టెంట్స్.. ఇప్పుడు శారీరిక బలంతో తలపడాల్సిన సమయం వచ్చిందని ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది.
మాయాస్త్రం కోసం పోటీ..
బిగ్ బాస్ సీజన్ 7ను ఇతర సీజన్స్‌కంటే వేరు చేస్తున్న అంశం పవర్ అస్త్రా. ఈసారి బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ అందరూ హౌజ్‌మేట్స్‌గా అర్హత సాధించుకోవాలంటే ముందుగా ఈ పవర్ అస్త్రాను సాధించాలి. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7లో మొదటిగా పవర్ అస్త్రా సాధించిన కంటెస్టెంట్‌గా ఆట సందీప్ నిలిచాడు. ఇప్పుడు తరువాతి అస్త్రా కోసం కంటెస్టెంట్స్‌లో పోటీ మొదలయ్యింది. తాజాగా విడుదలయిన బిగ్ బాస్ ప్రోమోలో తరువాతి అస్త్రం.. మాయాస్త్రం అని, దానిని సాధించుకోవాలంటే కంటెస్టెంట్స్ రెండు టీమ్స్‌గా విడిపోయి పోటీ పడాలని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చారు. ఆ రెండు టీమ్స్‌కు రణధీర, మహాబలి అని పేర్లు కూడా పెట్టారు.
ఆ టీమ్‌లో వారు.. ఈ టీమ్‌లో వీరు..
రణధీర టీమ్‌లో అమర్‌దీప్, ప్రియాంక, ప్రిన్స్ యావర్, శోభాశెట్టి, శివాజీ, షకీలా ఉన్నారు. మహాబలి టీమ్‌లో టేస్టీ తేజ, దామిని, శుభశ్రీ, రతిక, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ ఉన్నారు. ఇక పవర్ అస్త్రాన్ని సాధించిన సందీప్.. సంచాలకుడిగా వ్యవహరించాడు. ఈ రెండు టీమ్స్‌లో ఎవరు గెలిస్తే వారికే మాయాస్త్రం కనిపిస్తుందని బిగ్ బాస్ తెలిపారు. రణధీర టీమ్‌లో శివాజీ, షకీలా ఉన్నారని, ఎమోషనల్‌గా ఆలోచించవద్దని ముందే తన టీమ్‌మేట్స్‌కు వివరించింది శుభశ్రీ. ఆట మొదలవ్వక ముందే ఏదో ఒక విధంగా అవతల టీమ్‌ను ఏమర్చాలి అంటూ అమర్‌దీప్ ప్రణాళిక సిద్ధం చేయడం మొదలుపెట్టాడు.
రెండుసార్లు అదే టీమ్..
రణధీర, మహాబలి టీమ్స్ ముందు మొదటి టాస్క్ సిద్ధంగా ఉంది. అదే ‘పుల్ రాజా పుల్’. ఈ ఛాలెంజ్‌లో రెండు టీమ్స్ ఇరువైపులా నిలబడి మధ్యలో ఉన్న చెక్కను లాగాల్సి ఉంటుంది. ఆ చెక్క ఎవరివైపు వెళుతుందో వారే విన్నర్స్ అవుతారు. ఈ ఛాలెంజ్‌లో రెండుసార్లు రణధీర టీమ్ గెలిచినట్టుగా ప్రోమోలో నిలిచారు. ఆ టీమ్‌లో యావర్, షకీలా లాంటి బలమైన కంటెస్టెంట్స్ ఉండడం వల్ల ఎక్కువగా ఆ టీమే గెలిచే అవకాశాలు ఉన్నాయని ప్రేక్షకులు కూడా భావించడం మొదలుపెట్టారు. రెండుసార్లు తమ టీమే గెలవడంతో శివాజీలో కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కనిపిస్తున్నట్టు వారు భావిస్తున్నారు. మరి ఏ టీమ్ గెలుస్తుందో, ఏ టీమ్ మాయాస్త్రకు చేరువవుతుందో తెలియాలంటే నేడు ప్రసారం కానున్న ఎపిసోడ్ చూడాల్సిందే. పవర్ అస్త్రా గెలిచినందుకు వీఐపీ రూమ్‌లాంటి సౌకర్యాన్ని అందుకున్నాడు సందీప్. మరి మాయాస్త్రకు ఎలాంటి పవర్స్ ఉంటాయో తెలుసుకోవడానికి బిగ్ బాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: కృష్ణంరాజు, ప్రభాస్‌కు మధ్య తేడా ఇదే - నా దృష్టిలో కింగ్ అంటే ఆ హీరోనే: సీనియర్ నటి తులసి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial