తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి తులసి ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ దూసుకుపోతున్నారు. ఈతరం స్టార్ హీరోలు అందరికీ అమ్మ పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. తన సినీ కెరీర్ లో సుమారు 700 పైగా సినిమాల్లో నటించారు తులసి. దాదాపు 5 దశాబ్దాల నుండి ఇండస్ట్రీలో కొనసాగుతున్న తులసి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈతరం అగ్ర హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ల గురించి తులసి చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఇండస్ట్రీలో రెండు తరాల హీరోలతో కంటిన్యూస్ గా సినిమాలు చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు తులసి. కృష్ణగారి సినిమాల్లో నటించి ఇప్పుడు వారి కొడుకు మహేష్ సినిమాలో నటించడం, అలాగే కృష్ణంరాజు గారితో చేసి ఇప్పుడు ప్రభాస్ సినిమాలో చేయడం.. అలా అప్పటి పెద్ద హీరోలతో చేసి ఇప్పుడు వాళ్ళ పిల్లల సినిమాల్లో చేయడం ఒక మహాభాగ్యం అని అన్నారు.
"అప్పట్లో మహేష్ బాబు వాళ్ళ ఇంటికి వెళ్లినప్పుడు వాళ్ళ అమ్మగారు ఎంతో బాగా చూసుకునేవారు. నేను మంజుల కలిసి ఓ సినిమాలో నటించాం. సినిమాలో నేను మంజుల, ఫ్రెండ్స్. మంజుల నాకంటే రెండేళ్లు చిన్నది. వాళ్ల ఫ్యామిలీతో నాకు ఎంతో మంచి బాండింగ్. అది కృష్ణ గారితోనే పరిమితం కాకుండా హనుమంతరావు అంకుల్, శేషగిరిరావు వీళ్ళందరికీ నేనంటే చాలా ఇష్టం. అప్పట్లో వాళ్లు నాతో ఎలా నడుచుకునే వారో, ఇప్పుడు వాళ్ళ కొడుకులు కూడా నాతో అదే విధంగా నడుచుకోవడం నన్ను ఎంతో ఆనందాన్ని కలిగించింది. మహేష్, ప్రభాస్, బన్నీ వీళ్లంతా నాతో ఎంతో బాగా ఉంటారు. ఆప్యాయంగా మాట్లాడతారు. ఎంతో గౌరవం ఇస్తారు. వాళ్ల కుటుంబంలోని పెద్దలు నన్ను ఎంతలా గౌరవించారో వీళ్ళు కూడా నన్ను అంతలా గౌరవించారు" అని అన్నారు.
"నిజానికి ఇప్పటి హీరోలకు నేను అంతగా తెలియదు. కానీ వాళ్లు నన్ను అంతే రెస్పెక్ట్ తో చూడడం నాకు నచ్చింది. వాళ్లలో నాకు పెద్దగా ఏం డిఫరెన్స్ కనిపించదు. కృష్ణంరాజు గారు ఎలా మాట్లాడుతారో ప్రభాస్ కూడా అలాగే మాట్లాడతారు. కాకపోతే ప్రభాస్ డార్లింగ్ అంటాడు. సో నా దృష్టిలో రాజు అంటే ప్రభాస్ మాత్రమే. కృష్ణంరాజు తర్వాత నేను చూసిన కింగ్ ప్రభాస్. ఇక మహేష్ విషయానికొస్తే, 'శ్రీమంతుడు' షూటింగ్లో ఫస్ట్ డే మీట్ అయినప్పుడు నేను మహేష్ దగ్గరికి వెళ్లి ‘‘మీ అమ్మగారు నన్ను ఎంతో బాగా చూసుకునేవారు’’ అని చెప్తే.. ‘‘అవునా అండి, చాలా సంతోషం అండి అని ఎంతో బాగా మాట్లాడారు. ఆ తర్వాత మంజుల ఎలా ఉంది అని అడిగితే, అప్పుడు మహేష్ నాతో బాగా కనెక్ట్ అయ్యాడు. రీసెంట్ గా కూడా మాట్లాడుకున్నాం" అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తులసి చెప్పుకొచ్చారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : ఇండియాలోనే మొదటిసారి అత్యధిక పారితోషికం తీసుకున్న తెలుగు నటి ఈమే - ఎంతో తెలిస్తే గుండె ఆగుద్ది!