Bigg Boss Season 7 Family Week : బిగ్​బాస్​ అంటేనే ఎమోషనల్​ రైడ్. ఈ విషయాన్ని ప్రతీ సీజన్​లోనూ గుర్తుచేస్తారు బిగ్​బాస్​. ఎన్నో వారాలు ఫ్యామిలీకి దూరంగా ఉండి.. కనీసం ఫోన్​లో కూడా మాట్లాడలేని స్థితిలో ఉండే కంటెస్టెంట్ల దగ్గరకు ఫ్యామిలీని పంపి ఎమోషనల్ చేస్తారు. బిగ్​బాస్​ చూసేవారికే కాదు.. చూడనివారికి కూడా ఈ ఎమోషన్​.. కొంతైనా టచ్ చేస్తుంది. బిగ్​బాస్​ సీజన్​ 7లో కూడా ఆ తరుణం రానే వచ్చింది. ఈ వారం కంటెస్టెంట్ల ఫ్యామిలీని బిగ్​బాస్​ హౌజ్​లోకి పంపిస్తున్నారు. దానికి సంబంధించిన తాజా ప్రోమో రిలీజ్ అయింది. చాలా ఎమోషనల్​గా ఈ ప్రోమో సాగింది.


నిన్నంతా నామినేషన్ల లొల్లిలో హీట్​లో ఉన్న కంటెస్టెంట్లకు బిగ్​బాస్ చల్లని కబురును ఫ్యామిలీ రూపంలో తీసుకొచ్చారు. ప్రశాంత్, యావర్​తో కూర్చొని శివాజీ ఛాయ్​ తాగుతుండగా బిగ్​బాస్​ డాక్టర్​ రూమ్​కి రావాలని పిలిచారు. దాంతో రెగ్యూలర్​ చెకప్​ కోసం అనుకుంటూ.. శివాజీ లోపలికి వెళ్లారు. హాథ్ కైసా అని డాక్టర్​ ప్రశ్నించగా.. యా గుడ్ ఫీలింగ్ బెటర్​ అని శివాజీ తెలిపారు. వ్యాయామాలు టైమ్​కి చేస్తున్నారా? అని భుజానికి సంబంధించి అన్ని ప్రశ్నలు అడిగారు. ఇంకో మూడు రోజుల్లో ఇది తగ్గిపోతుందని చెప్పగా.. తగ్గాలని కోరుకుంటున్నాను. గేమ్​లో మరింత బాగా ఆడాలనుకుంటున్నా అని చెప్పి వెళ్లిపోతుండగా.. నాన్న అంటూ పిలిచి.. ఫేస్​కున్న మాస్క్​ను.. తలపై మాస్క్​ను తీసి శివాజీ కొడుకు సర్​ఫ్రైజ్ చేశారు. 


కొడుకును చూసిన సంతోషంలో శివాజీ బాగా ఎమోషనల్​ అయిపోయాడు. కన్నీటి పర్యంతమైపోయాడు. కొడుకును హగ్ చేసుకుని చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. ముద్దులు పెడుతూ ఎమోషనల్​ అయ్యాడు. ఈ సీన్​ చూసిన ఎవరైనా.. ఆ ఎమోషన్​కి కనెక్ట్​ అవుతారు. మై సన్ అంటూ ఇంట్లోకి కొడుకును తీసుకెళ్లాడు. ఇంట్లోని సభ్యులంతా షాక్, సర్​ఫ్రైజ్ అయ్యారు. డాక్టర్​గా తీసుకొచ్చారు. ఫేస్​మాస్క్​ వేసి అంటూ శివాజీ కుటంబసభ్యులకు తెలిపాడు. ఇంట్లోని వారంతా శివాజీ కొడుకును విష్ చేశారు. అనంతరం భోళే వచ్చి.. శివాజీతో అన్నా మెల్లగా మీ అబ్బాయిని ఇక్కడుంచి.. మీరు వెళ్లి రెస్ట్ తీసుకోవచ్చు. తను ఆడుతాడు అనగానే.. శివాజీ కొడుకు.. అమ్మబాబోయ్ నావల్ల కాదు అంటూ తెలిపాడు. 


తర్వాత కొడుకుతో ప్రైవేట్​గా కూర్చొని శివాజీ మాట్లాడారు. నువ్వు వస్తావనుకోలేదు. తమ్ముడు వస్తాడనుకున్నాను.. నీకు సిగ్గు కదా అంటూ నవ్వాడు. యూనివర్సిటీ డేట్ 8కి ఉంది. నువ్వు వచ్చేముందు మళ్లీ కలవడానికి ఛాన్స్ ఉంటాదో లేదో అని నేను వచ్చేశాను. ఇన్ని నెలలు దూరంగా ఉన్నాము కదా.. నేను అక్కడికి వెళ్తే మళ్లీ ఎప్పటికీ కలవగలమో అని ఎమోషనల్​ అయ్యాడు. కొడుకును చూసిన శివాజీ కన్నీటి పర్యంతమయ్యాడు. నువ్వు ఏడ్వకు నాన్న.. నువ్వు ఏడిస్తే ఇంట్లో అందరూ ఏడుస్తారు. నువ్వు నవ్వితే ఇంట్లో అందరూ నవ్వుతారు. నువ్వు ఏడిస్తే అందరూ ఏడుస్తారని ఎమోషనల్​ అవ్వగా.. ప్రోమో ముగుస్తుంది. ఈ ఎమోషనల్​ ఫ్యామిలీ రైడ్​ చూడాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. లేదంటే లైవ్ స్ట్రీమ్​లో కంటిన్యూగా చూడొచ్చు. 


Also Read : బిగ్ బాస్ హౌస్‌లోకి శివాజీ కొడుకు ఎంట్రీ - యావర్‌ అలక!