బిగ్ బాస్ సీజన్ 7లో హౌజ్‌మేట్స్‌గా మారాలంటే కంటెస్టెంట్స్ మధ్య పోటీ మామూలుగా లేదు. బిగ్ బాస్ హౌజ్‌కు చెందిన హౌజ్‌మేట్స్‌గా మారడం కోసం అస్త్రాలు గెలుచుకోవాలి అని చెప్పగానే.. ఎవరికి వారు ఈ పోటీ కోసం సిద్ధమవుతున్నారు. మొదటి నుండి రేసులో లేకపోవడం కంటే రేసులో చివరి వరకు వచ్చి ఓడిపోవడం చాలా బాధగా ఉంటుంది. కానీ అలా జరిగినప్పుడు ఆ పరిస్థితిని అంగీకరించగలగాలి. అలా అంగీకరించలేకపోవడం వల్లే బిగ్ బాస్ హౌజ్‌లో గొడవలు జరుగుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయ్యి రెండు వారాలు అయినా కూడా ఇప్పటివరకు పెద్దగా గొడవలకు దిగని గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్‌కు మాయాస్త్రం కోసం వాగ్వాదం మొదలయ్యింది. ఆ వాగ్వాదం కాస్త పర్సనల్ కూడా అయ్యింది.
మాయాస్త్రాన్ని ఇవ్వను..
ఎపిసోడ్ మొదలయ్యే సమయానికి ప్రిన్స్ యావర్, శివాజీ, షకీలా చేతిలో మాయాస్త్రాలు ఉన్నాయి. కానీ ఆ ముగ్గురిలో ఏ ఇద్దరు మాత్రమే పవర్ అస్త్రా పోటీకి అర్హులు అవుతారు. ఆ నిర్ణయం గౌతమ్ కృష్ణ చేతికి వెళ్లింది. దీంతో ప్రిన్స్ యావర్ చేతిలో ఉన్న మాయాస్త్రాన్ని తీసుకొని శివాజీ చేతిలో పెట్టాడు గౌతమ్ కృష్ణ. పైగా శివాజీనే టీమ్ లీడర్‌లాగా అనిపించాడని, తనే ఆటను అంతా ఆడించాడని గౌతమ్ అన్నాడు. ఈ మాటలతో అమర్‌దీప్ సైతం ఏకీభవించలేదు. ఇక యావర్ అయితే మాయాస్త్రాన్ని అసలు ఇవ్వనంటూ మొండికేసి కూర్చున్నాడు. ప్రతీ కెమెరా దగ్గరకు వెళ్తూ ఇది అసలు న్యాయం కాదని, గేట్స్ ఓపెన్ చేయమని, వెళ్లిపోతానని చెప్పడం మొదలుపెట్టాడు. అంతే కాకుండా గేట్స్ ఓపెన్ చేయకపోతే తాను తినడం మానేస్తానని, మైక్ తీసేస్తానని బెదిరించాడు కూడా.
విచక్షణ కోల్పోయిన యావర్..
ప్రిన్స్ యావర్ చేతి నుండి మయాస్త్రం జారిపోవడంతో కోపంతో ఊగిపోయాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమర్‌దీప్ వెళ్లి తనను కంట్రోల్ చేయడానికి కూడా ప్రయత్నించాడు. శుభశ్రీ సైతం యావర్‌తో పర్సనల్‌గా మాట్లాడాలని ప్రయత్నించింది కానీ యావర్ అసలు ఎవరి మాట వినే పరిస్థితిలో లేడు. అలా ఎలా తీసేసుకుంటారని, కష్టపడి ఆడానని ఏడ్చాడు. కానీ గౌతమ్ కృష్ణ నిర్ణయంతో ప్రిన్స్ యావర్ కూడా పవర్ అస్త్రా రేసు నుండి తప్పుకోవాల్సిందే అని బిగ్ బాస్ ప్రకటించాడు. దీంతో గౌతమ్, యావర్ మధ్య వాగ్వాదం మొదలయ్యింది.
ఇంజెక్షన్ గురించి గొడవ..
‘కరెక్ట్ కారణం చెప్పి తీసేయాలి’ అంటూ గౌతమ్‌పై అరవడం మొదలుపెట్టాడు యావర్. ‘అది కరెక్ట్ కారణమే. శివాజీ అన్ననే అర్హుడు’ అంటూ గౌతమ్ కూడా తిరిగి అరవడం మొదలుపెట్టాడు. ఇద్దరూ కోపంతో ఊగిపోయారు. ఒకరిపై ఒకరు విపరీతంగా అరుచుకున్నారు. ఆ తర్వాత యావర్.. తన చేతితో అసభ్యంగా ఏదో చూపించే ప్రయత్నం చేశాడు. కోపంతో గౌతమ్ కృష్ణ కూడా సైగ చేశాడు. అది ఇంజెక్షన్ అన్నట్టు భావించిన యావర్.. ‘నేను ఇంజెక్షన్ తీసుకున్నానా? నువ్వు చూశావా’ అంటూ మరింత కోపంతో రగిలిపోయాడు. ‘నీ డబ్బులతో తీసుకున్నానా’ అని గౌతమ్‌ను ప్రశ్నించాడు. ఆ తర్వాత తను ఎలాంటి ఇంజెక్షన్ తీసుకోలేదని, తన గురించి అన్యాయంగా మాట్లాడుతున్నారు అంటూ వాపోయాడు. ‘నేను డాక్టర్‌ను నాకు ఆ మాత్రం తెలియదా’ అంటూ గౌతమ్.. ఇతర కంటెస్టెంట్స్‌తో ఇంజెక్షన్ మ్యాటర్ నిజమే అన్నట్టుగా మట్లాడాడు. ప్రిన్స్ యావర్ విచక్షన్ కోల్పోయినట్టుగా ప్రవర్తిస్తుండడంతో బిగ్ బాస్.. తనను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి ధైర్యం చెప్పాడు. అప్పుడు యావర్ కాస్త కుదుటపడ్డాడు.
Also Read: రెండో పవర్ అస్త్రా కోసం పోటీ - అమర్‌దీప్‌ను రంగంలోకి దించిన సందీప్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial