బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన మిత్రాశర్మ మొదటివారంలోనే ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ముమైత్ ఖాన్ ని ఎలిమినేట్ చేసి మిత్రాను సేవ్ చేశారు. ఇప్పుడు ఐదో వారంలో ముమైత్ ని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లోకి పంపించారు. అది వేరే విషయమనుకోండి. మిత్రాశర్మకి ఓట్లు తక్కువ పడుతున్నప్పటికీ.. ఆమెని కాపాడుకుంటూ వస్తున్నారు బిగ్ బాస్. కారణమేంటో తెలియదు కానీ మొదటివారం ఎలిమినేట్ కావాల్సిన ఈ కంటెస్టెంట్ ఐదు వారాలు అవుతున్నప్పటికీ ఇంకా హౌస్ లోనే ఉంది. 


అయితే మొదటినుంచి మిత్రాశర్మ అంటే హౌస్ మేట్స్ కి పడడం లేదు. ఆమె బిహేవియర్ కూడా అలానే ఉంటుంది. ఒకరితో ప్రేమగా ఉంటూనే వారి గురించి పక్కవాళ్ల దగ్గర నెగెటివ్ గా మాట్లాడుతుంటుంది. ఈ విషయం గ్రహించిన హౌస్ మేట్స్ ఆమె ప్రవర్తన మార్చుకోవాలని నామినేషన్స్ వచ్చిన ప్రతీసారి చెబుతూనే ఉన్నారు. ఆమెతో క్లోజ్ గా ఉండే మహేష్ విట్టా సైతం మిత్రాకు రివర్స్ అయ్యారు. 


ఇక నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో కూడా మిత్రా తన ప్రవర్తనతో హౌస్ మేట్స్ ని చికాకు పెట్టింది. బిందు మాధవి టీమ్ లో ఉన్న మిత్రా శర్మ.. అఖిల్ టీమ్ దగ్గరకు వెళ్లి.. ఇక్కడి విషయాలను అక్కడ చెబుతూ మరోసారి అడ్డంగా బుక్కైంది. దీంతో హౌస్ మేట్స్ అందరూ కలిసి ఆమెకి వరస్ట్ పెర్ఫార్మర్ ట్యాగ్ ఇచ్చారు. ఈరోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్.. హౌస్ మేట్స్ ని వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరో నిర్ణయించి జైల్లో పెట్టాలని చెప్పారు. దీంతో అందరూ మిత్రాశర్మని టార్గెట్ చేశారు. ఆమె అబద్దాలు ఆడుతుందని.. సరైన స్టాండ్ తీసుకోలేకపోతుందని చెప్పి అందరూ కలిసి ఆమెని వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎన్నుకొని జైల్లో పెట్టారు. 


Also Read: లైంగిక వేధింపుల కేసు - 'ఊ అంటావా' సాంగ్ కొరియోగ్రాఫర్ పై చార్జ్‌షీట్‌