బిగ్ బాస్ ఓటీటీ తొమ్మిది వారాలను పూర్తి చేసుకోబోతుంది. ఇప్పుడు హౌస్ లో పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అంటున్నారు. ఈ విషయం పక్కన పెడితే షో మొదలై.. రెండు నెలలు గడుస్తుండడంతో బిగ్ బాస్ కంటెస్టెంట్ల కోసం స్పెషల్ సర్‌ప్రైజ్‌ ప్లాన్ చేశారు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న టాప్ 10 హౌస్ మేట్స్ కోసం వారి కుటుంబ సభ్యులను ఇంట్లోకి పంపించారు. ఈ మేరకు ఓ ప్రోమోను విడుదల చేశారు. 


అషురెడ్డి తల్లి ముందుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె చీపురు పట్టుకొని హౌస్ లోకి రావడంతో ఫ్రీజ్ లో ఉన్న అషు.. చీపురు పట్టుకొని వచ్చావేంటి..? వద్దు మమ్మీ ప్లీజ్ మమ్మీ.. పరువు పోతుంది మమ్మీ అంటూ ఫన్నీగా డైలాగ్స్ కొట్టింది. బిగ్ బాస్ రిలీజ్ చెప్పగానే.. మమ్మీ అంటూ వెళ్లి తన తల్లిని హత్తుకుంది అషురెడ్డి. హౌస్ లో నీ ఫేవరెట్ ఎవరని అషు అడగ్గా.. అందరూ అని బదులిచ్చింది ఆమె తల్లి. 'నేను తప్ప..?' అని అషు అడగ్గా.. అవును అని ఆమె అనడంతో అందరూ నవ్వుకున్నారు. 


ఆ తరువాత యాంకర్ శివ సోదరి యమున హౌస్ లోకి వచ్చింది. అలానే నటరాజ్ మాస్టర్ భార్య కూతురు ఇద్దరూ హౌస్ లోకి రావడంతో అతడు ఎమోషనల్ అయ్యాడు. తన కూతురిని ముద్దాడుతూ మురిసిపోయాడు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది. 


Also Read: పవన్ కోసం కథ రాశా - కొరటాల శివ కామెంట్స్


Also Read: అజయ్ దేవగన్ వర్సెస్ సుదీప్ - మధ్యలో ఆర్జీవీ ఎంట్రీ