బిగ్ బాస్ ఓటీటీ తెలుగులో తొమ్మిదో వారం నామినేషన్స్ లో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వారెవరంటే.. నటరాజ్ మాస్టర్, శివ, మిత్రాశర్మ , అరియనా, బాబా భాస్కర్, హమీద, అనిల్. వీరిలో అత్యధిక ఓటింగ్ మిత్రాశర్మకు వస్తుందని తెలుస్తోంది. అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో మిత్రానే టాప్ లో ఉంది. టాస్క్ లలో మంచి పెర్ఫార్మన్స్ ఇస్తూ.. ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. 


యాంకర్ శివ ఓటింగ్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. బాబా భాస్కర్ కూడా ఓటింగ్ పరంగా పర్వాలేదనిపిస్తున్నారు. మిగిలిన నలుగురిలో ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తోంది. నటరాజ్ మాస్టర్, హమీదా, అనిల్, అరియానాలు ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్నారు. నిజానికి అరియానాకు బిగ్ బాస్ సీజన్ 4లో వచ్చినంత ఓటింగ్ ఇప్పుడు రావడం లేదు. అన్ అఫీషియల్ సైట్స్ లో అరియానా డేంజర్ జోన్ లోనే కొనసాగుతోంది.


ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఇంటి నుంచి ఎవరు వెళ్లిపోతారనేది ఆసక్తికరంగా మారింది. నటరాజ్ మాస్టర్ కిల్లర్ టాస్క్ ని బాగా ఆడడంతో ఆయనకు ఓటింగ్ పెర్సెంటేజ్ పెరిగింది. అలానే హమీదకు కూడా మొదటినుంచి ఫిక్స్డ్ ఓటింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి వీరిద్దరూ సేఫ్ జోన్ లో ఉండే అవకాశం ఉంది. 


అరియానా, అనిల్ లలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ జరిగితే గనుక అనిల్ తో పాటు అరియనా కూడా ఇంటికి వెళ్లిపోయే అవకాశం ఉంది. సీజన్ 4లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచిన అరియనా.. ఈసారి మాత్రం ఎలిమినేట్ అయి బయటకు వచ్చేస్తుందంటున్నారు. బాబా భాస్కర్ వైల్డ్ కార్డు ఎంట్రీ గనుక లేకుంటే ఈ వారం ఒకరే నామినేట్ అయ్యేవారు. ఇప్పుడు ఆయన వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడంతో డబుల్ ఎలిమినేషన్ పెట్టే అవకాశం ఉంది. మరేం జరుగుతుందో చూడాలి!


Also Read: పవన్ సినిమాలో డైలాగ్ లీక్ చేయించిన చిరంజీవి, పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూన‌కాలే 


Also Read: నటుడు విజయ్ పై రేప్ కేసు - లైంగికంగా వాడుకున్నాడంటూ ఆరోపణలు