బిగ్ బాస్ ఓటీటీ తెలుగు వెర్షన్ ఇప్పటికే ఐదు వారాలను పూర్తి చేసుకుంది. ఐదో వారం ఎలిమినేషన్ లో ఊహించని విధంగా తేజస్విని ఇంటి నుంచి బయటకు పంపించేశారు. ఇక సోమవారం నాటి ఎపిసోడ్ లో నామినేషన్స్ ప్రక్రియ జరగనుంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో హౌస్ మేట్స్ ఒకరితో మరొకరు గొడవ పడుతూ కనిపించారు. 


ముందుగా అరియనా మిత్రాశర్మను నామినేట్ చేస్తూ.. గేమ్ కాకుండా ఇంప్రెషన్ ఫామ్ చేయడం తనకు నచ్చలేదని చెప్పింది. ఆ తరువాత బిందుమాధవి తనను డబుల్ స్టాండర్డ్స్ అన్నందుకు నామినేట్ చేస్తూ.. ఏదైనా తను గేమ్ ఆడుతున్నానని చెప్పింది. ఈ క్రమంలో బిందుమాధవి, అరియనాలు వ్యంగ్యంగా మాట్లాడుకున్నారు. ఆ తరువాత అజయ్.. మహేష్, హమీదాలను నామినేట్ చేశాడు. 


హమీద తనపై ఓ బ్లేమ్ వేసిందని.. అది బయటకు ఎలా వెళ్తుందోననే అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో హమీద ఫైర్ అయింది. అసలు బయట గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్ అంటూ గట్టిగా అరిచింది. అలానే అషురెడ్డి కూడా హమీదనే నామినేట్ చేయడంతో ఆమె మరింత ఫైర్ అయింది. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక అనిల్ రాథోడ్.. నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేయడంతో ఆయన ఎప్పటిలానే వెటకారంగా నవ్వుతూ కామెంట్స్ చేశాడు. దీంతో అనిల్.. 'నువ్ ఎవడు బాయ్.. నువ్ నన్ను ఏం చేయలేవు' అంటూ అరిచాడు. 


Also Read: రేవ్ పార్టీపై టాస్క్‌ఫోర్స్ దాడులు - బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ అరెస్ట్