Tollywood Singer Rahul Sipligunj Arrest: గత కొంతకాలం నుంచి ఏపీ, తెలంగాణలో ఏదో ఓ సమయంలో హాట్ టాపిక్‌గా మారే అంశం డ్రగ్స్. ఏపీలో గంజాయి అక్రమ రవాణా అధికారులకు తలనొప్పులు తెప్పిస్తుంటే.. తెలంగాణలో డ్రగ్స్ విక్రయాలు, యువత డ్రగ్స్‌కు బానిసలుగా మారడం సమస్యగా మారింది. గతంలో పలుమార్లు పబ్‌లపై దాడులు చేసి పబ్‌లో రేవ్ పార్టీ నిర్వహించిన వారిని, హాజరైన వారిని అదుపులోకి తీసుకున్నారు. కానీ డ్రగ్స్ మహమ్మారిగా మారకుండా ఉండేందుకు పోలీసులు, ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నా పరిస్థితి మారడం లేదు.


రాహుల్ సిప్లిగంజ్ అరెస్ట్.. ! 
హైదరాబాద్‌ నగరంలోని పలు పబ్‌ లపై పోలీసులు పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. నగరంలోని ఓ పబ్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు పబ్‌పై దాడులు నిర్వహించారు. రాడిసన్‌ బ్లూ హోటల్‌ పై టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు ఒక్క సారిగా దాడులు చేసి మొత్తం 150 మందికి పైగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో బిగ్‌ బాస్‌ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ (Bigg Boss Telugu Winner Rahul Sipligunj) ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజామున 3 గంటల వరకు పబ్ నిర్వహించడంతో దాడులు నిర్వహించి కొందరు టాలీవుడ్ నటులు, జూనియర్ ఆర్టిస్టులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 39 మంది యువతులు ఉన్నారని పోలీసులు తెలిపారు. రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్ వాడినట్లు తెలుస్తోంది.


టాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ గతంలోనూ పబ్‌లో ఓ వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేసేందుకు పబ్‌లపై మెరుపు దాడులు చేశారు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు కొందరు నటులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసులు పబ్‌లపై తనిఖీలు చేసి 150 మంది వరకు అదుపులోకి తీసుకోగా.. వీరందరిని బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. విచారణ అనంతరం దాదాపు 100 మందిని విడిచిపెట్టగా, మరికొందరు పీఎస్‌లోనే ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



ఇటీవల డ్రగ్స్ ఓవర్ డోస్ కావడంతో ఓ బీటెక్ విద్యార్థి ప్రాణాలు కోల్పోవడంతో టాస్క్ ఫోర్స్ డ్రగ్స్ పై మరింత ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో పబ్‌లు, కాలేజీలు, అనుమానిత ప్రదేశాలపై నిఘా ఉంచి డ్రగ్స్ ను అరికట్టేందుకు యత్నిస్తున్నారు. బీటెక్ విద్యార్థి తరచూ గోవాకు వెళ్లడం, అక్కడ డ్రగ్స్ తీసుకోవడం వంటివి చేసేవాడు. ఈ క్రమంలోనే మత్తుకు బానిసై డ్రగ్స్‌కు అలవాటుపడ్డ విద్యార్ధి పేషెంట్‌గా మారాడు. వారం రోజుల్లోనే తీవ్ర అస్వస్థతకు గురై విద్యార్థి మృతి చెందాడు. గతంలో గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. 


Also Read: Pranay Murder Case: ప్రణయ్ హత్య కేసు నిందితుడు అబ్దుల్ బారీకి గుండెపోటు- నిమ్స్‌లో చికిత్స


Also Read: Vanastalipuram Police: ఆ దేవుడు ఆదేశిస్తాడట- ఈ రాజేంద్రుడు పాటిస్తాడట- దొంగలందు ఈ దొంగ స్టైలే వేరు