ప్రభాస్ మనసులో ఏముంది? ఆయన 'ఊ' అంటారా? లేదంటే... 'ఊహు' అంటారా? ఆయన స్పందన ఏంటి? తెలుసుకోవాలని తెలుగు దర్శక - నిర్మాతలు మాత్రమే కాదు, హిందీ ఫిల్మ్ మేకర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ త్వరగా ఏదో ఒకటి తేల్చేస్తే బావుంటుందని వాళ్ల ఫీలింగ్. అందర్నీ అంత టెన్షన్ పెడుతున్న టాపిక్ ఏంటి? అంటే... యంగ్ రెబల్ స్టార్, ఆడియన్స్ డార్లింగ్ ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ!


'బాహుబలి' తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఆయనతో ఇప్పుడు సినిమాలు చేస్తున్న, చేయబోతున్న దర్శక నిర్మాతలు అందరూ పాన్ ఇండియా లెవల్ సినిమాలే చేయాలని డిసైడ్ అయ్యారు. దర్శకుడు నాగ్ అశ్విన్ అయితే  'ప్రాజెక్ట్ కె' పాన్ వరల్డ్ సినిమా అని చెప్పారు. ఆయనకు హాలీవుడ్, ఓవర్సీస్ మార్కెట్‌లో భారీ ఎత్తున సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని టాక్. ప్రభాస్ సినిమా హాలీవుడ్ వెళ్ళడం కాదు, ప్రముఖ హాలీవుడ్ స్టూడియో ప్రభాస్ దగ్గరకు వచ్చిందని సమాచారం.


ప్రభాస్ కథానాయకుడిగా సినిమాలు నిర్మించడానికి యూనివర్సల్ స్టూడియోస్ ఆసక్తిగా ఉందని సమాచారం. ఏషియన్ సూపర్ హీరో సినిమా తీయాలని ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తోందట. ప్రభాస్ అయితే ఏషియన్ సూపర్ హీరోగా బావుంటారని భావిస్తున్నారట. ఆల్రెడీ ప్రభాస్ దగ్గరకు వచ్చి రెండు మూడు సార్లు డిస్కషన్స్ కూడా చేశారట. ఏషియన్ సూపర్ హీరో మీద ఒక్క సినిమా కాకుండా ఫ్రాంఛైజీ ప్లాన్ చేశారని టాక్. హాలీవుడ్ సినిమాలు చేయడానికి ప్రభాస్ కూడా ఆసక్తిగా ఉన్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. అయితే... బల్క్ డేట్స్ అడ్జస్ట్ చేయాల్సి ఉండటంతో పాజిబిలిటీస్ గురించి ఆలోచిస్తున్నారట.


'ఆదిపురుష్' షూటింగ్ కంప్లీట్ చేసిన ప్రభాస్, ప్రస్తుతం 'సలార్' చేస్తున్నారు. ఇది రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత మారుతి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించనున్న సినిమా ఒకటి చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ రెండూ కాకుండా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' సినిమా చేయడానికి 'ఎస్' చెప్పారు.


Also Read: 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ కన్ఫర్మ్ - ఎన్టీఆర్ స్వయంగా అడగటంతో!


ప్రస్తుతం ప్రభాస్ అంగీకరించిన సినిమాలు అన్నీ కంప్లీట్ కావడానికి ఎలా లేదన్నా 2025 వరకూ టైమ్ పడుతుంది. ఒకవేళ హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ యూనివర్సల్ స్టూడియోస్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తే... ఆపై మరో మూడేళ్ళు మరో సినిమా చేయడానికి వీలు పడదు. అందుకని, ప్రభాస్ నిర్ణయం కోసం టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.



Also Read: ఉగాదికి రాముడొచ్చాడు - స్టయిలిష్‌గా సూపర్ కాప్