అనగనగా ఓ అబ్బాయి. ఓ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు, ప్రేమించాడు! 'లాయర్ పాప' అంటూ వెంట పడుతున్నాడు. హ్యాపీగా పాటలు పాడుతున్నాడు. ఆ అబ్బాయి, అమ్మాయి కథేంటో తెలియాలంటే... 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' చూడాలి. సినిమా విడుదలకు ఇంకా టైమ్ ఉంది. ఉగాది సందర్భంగా సినిమాలో తొలి పాట 'లాయర్ పాప...'ను విడుదల చేశారు.
శతాధిక చిత్ర దర్శకుడు, దివంగత కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి (Kodi Divya Deepthi) నిర్మాతగా పరిచయం అవుతున్న సినిమా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' (Nenu Meeku Baga Kavalsinavadini Movie). కోడి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి, తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో కిరణ్ అబ్బవరం హీరో. సంజనా ఆనంద్ హీరోయిన్. సినిమాలో తొలి పాట 'లాయర్ పాప...' (Lawyer papa song)ను ఈ రోజు విడుదల చేశారు.
'రా... రా లాయర్ పాప రా..
లవ్ జైల్లో ఉన్నాగా!
బెయిల్ ఇచ్చేయ్ జల్దీగా'
అంటూ సాగిన ఈ పాటలో తొలుత వేరే అమ్మాయి కనిపించారు. ఆ తర్వాత హీరోయిన్ సంజనా ఆనంద్ వచ్చారు. కోర్టు ఏరియాలో పాటను చిత్రీకరించారు. కిరణ్ అబ్బవరం లుక్ మాసీగా ఉంది. ఆయన హుషారుగా స్టెప్పులు వేశారు.
Also Read: 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ కన్ఫర్మ్ - ఎన్టీఆర్ స్వయంగా అడగటంతో!
మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించగా... భాస్కరభట్ల రాసిన 'లాయర్ పాప' పాటను రామ్ మిరియాల ఆలపించారు. బాబా భాస్కర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కెమెరా: రాజ్ కె. నల్లి.
Also Read: ఉగాదికి రాముడొచ్చాడు - స్టయిలిష్‌గా సూపర్ కాప్