Bigg Boss Agnipariksha - Commoners and Influencers: బిగ్ బాస్ అగ్ని పరీక్షలో టాప్ 15 కంటెస్టెంట్ల మధ్య పోటీ పెట్టేశారు. ఇక ఇందులోంచి బిగ్ బాస్ ఇంట్లోకి ఎవరు వెళ్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఓ వారం రోజుల పాటుగా వీరికి రకరకాల టాస్కులు పెట్టి.. ఆడియెన్స్ ఓట్లను బట్టి.. ఓ 5 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ ఇంట్లోకి పంపించేలా ఉన్నారు. ఈ క్రమంలో బుధవారం నాటి ఆరో ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.
టాప్ 15 కంటెస్టెంట్లకు మైకులు అందించారు. వారికి నాగార్జున వీడియో సందేశం ద్వారా కంగ్రాట్స్ చెప్పాడు. ఇక హరీష్‌కి బిందు మాధవి మొత్తం గుండు కొట్టేసింది. ఇక వరుసగా 15 మంది.. 15 నంబర్లలో నిల్చొండని చెప్పారు. దీంతో చాలా మంది ఒకటి, రెండో స్థానంలోనే నిల్చున్నారు. శ్రీజ, ప్రసన్న మూడో స్థానంలో ఉన్నారు. ఐదో స్థానంలో షాకిబ్, ఆరో స్థానంలో మనీష్, చివరి స్థానంలో శ్రియా నిల్చుంది. ఏడో స్థానంలో నాగ ప్రశాంత్ నిల్చున్నాడు.
ఇక వాదోపవాదనలు తరువాత శ్రీజ మూడో స్థానంలోకి వచ్చింది. అక్కడి నుంచి ప్రసన్న మొదటిస్థానంలోకి వెళ్లారు. ఇక ఎంతకీ ఒకటో స్థానం, రెండో స్థానం లెక్క తేలలేదు. ఈ క్రమంలో ప్రియా, ప్రశాంత్ కలిసి కామనర్స్ వర్సెస్ ఇన్ ఫ్లూయెన్సర్స్ టాపిక్ తీశారు. ఇక్కడ మీరంతా ఇన్ ఫ్లూయెన్సర్స్.. మీకు అడ్వాంటేజ్ ఉంటుంది.. మీరు కామనర్స్ కాదు అంటూ బయట నడిచే టాపిక్‌ను లోపల మాట్లాడేశారు. ఇక శ్రీజ, దివ్య ఇలాంటి కొంత మంది ఆ వాదనను ఖండించేందుకు ప్రయత్నించారు.
Also Read: సుందరకాండ రివ్యూ: పెళ్లి కాని యూత్ రిలేటయ్యే సీన్స్, మరి పాయింట్? నారా రోహిత్ సినిమా ఎలా ఉందంటే?
ఇక ఇది ఇలా తేలేలా లేదని అనుకున్న ముగ్గురు జడ్జ్‌లు సింగిల్ నంబర్ మీద నిల్చున్న శ్రియా, షాకిబ్, మనీష్‌లకు కొన్ని పవర్స్ ఇచ్చారు. ఆ ముగ్గురే మిగతా వాళ్లు ఏ పొజిషన్‌లో నిల్చోవాలనే డిసైడ్ చేశారు. అలా శ్రియా వచ్చి దాల్యని 15వ స్థానంలో పెట్టింది. అలా మొత్తానికి 1 నుంచి 15 వరకు అందరూ నిల్చున్నారు. చివరకు మూడో స్థానంలో ఉన్న శ్రీజ.. మిగిలిన ప్రసన్న, అనూషలోంచి ప్రసన్నని మొదటి స్థానంలో, అనూషను రెండో స్థానంలో పెట్టేసింది. ప్రశాంత్ 14వ స్థానంలో, కల్కి 13వ స్థానం, కళ్యాణ్ పడాల 12వ స్థానం, హరీష్ 11, ప్రియా 10, దివ్య 9, శ్వేత 8, పవన్ 7 ఇలా ఒక్కొక్కరికి ఒక్కో పొజిషన్ దక్కింది.
ఒకటి నుంచి ఏడు వరకు నిల్చున్న వారిని ఒక టీంగా.. రెడ్ టీంగా ఫిక్స్ చేశారు. 8 నుంచి 14 వరకు ఉన్న వారిని బ్లూ టీంగా నిర్ణయించారు. ఇక మిగిలిన దాల్య ఈ టీంలకు లీడర్లను పెట్టేసింది. అలా రెడ్ టీంకు మనీష్‌ని, బ్లూ టీంకి ప్రియాని లీడర్‌గా పెట్టింది. ఈ రెండు టీంకు కలిపి తాడుతో లాగే ఓ టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా బ్లూ టీం విన్ అయింది. గెలిచిన బ్లూ టీం నుంచి లీడర్ అయిన ప్రియా వచ్చి కళ్యాణ్ పడాలకు ఓట్ అప్పీల్ ఛాన్స్ ఇచ్చింది. ఇక వరెస్ట్ ప్లేయర్‌గా కల్కిని బిందు మాధవి సెలెక్ట్ చేసింది. ఎందుకంటే.. తన మీద వచ్చిన ఆరోపణల్ని సైతం డిఫెండ్ చేసుకోలేకపోతోందట. అందుకే వరెస్ట్ ప్లేయర్ అని బిందు మాధవి సెలెక్ట్ చేసింది.
మోస్ట్ వేల్యబుల్ ప్లేయర్‌గా శ్రీజను సెలెక్ట్ చేసి ఆమెకు కూడా ఓట్ అప్పీల్ ఛాన్స్ ఇచ్చారు జడ్జ్‌లు. ఇక కామనర్స్, ఇన్ ఫ్లూయెన్సర్స్ టాపిక్ రావడం, బిగ్ బాస్ ప్రాసెస్ మీద ప్రశ్నలు వేయడంతో జడ్జ్‌లు క్లారిటీ ఇచ్చారు. అందరం సోషల్ మీడియాలోనే ఉన్నాం.. ఫాలోవర్స్.. ఫ్యాన్స్ కాదు.. బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లేంత వరకు అందరూ కామనర్సే.. బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన తరువాత ఫ్యాన్స్ ఏర్పడతారు.. సెలెబ్రిటీలు అవుతారు. అప్పటి వరకు 15 మంది కామనర్స్ అని నవదీప్, బిందు మాధవి చెప్పారు. కామనర్స్ సెలెక్షన్స్ అని చెప్పి.. సోషల్ మీడియా సెలెబ్రిటీల్ని సెలెక్ట్ చేశారంటూ అసలే సోషల్ మీడియాలో బీబీ టీం మీద అందరూ సెటైర్లు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలా కామనర్స్, ఇన్ ఫ్లూయెన్సర్స్ మధ్య తేడా చెప్పి మరింత నవ్వులపాలు అయినట్టుగా అనిపిస్తుంది.