బిగ్ బాస్ డే 57లో బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ల రచ్చ జరిగింది. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే సంజన "నిన్ను టార్గెట్ చేసేంత ఓపిక నాకు లేదు. టాప్ 5లో ఎలా ఉండాలన్నది నా ఆలోచన" అంటూ తనూజాకు క్లారిటీ ఇచ్చింది. "మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. మీ ముందు కొన్ని బొమ్మలు, వాటిపై ఇంటి సభ్యుల ఫోటోలు ఉన్నాయి. కంటెస్టెంట్స్ వేరే వాళ్ళ బొమ్మ తీసుకుని సేఫ్ జోన్ లోకి పరిగెత్తాలి. లాస్ట్ లో చేరుకునే సభ్యులు, వాళ్ళ చేతిలో బొమ్మపై ఫోటో ఉన్నవారు నామినేషన్ జోన్ లోకి వస్తారు. ఆ ఇద్దరిలో ఒకరు చివరగా నామినేట్ అవుతారు" అన్నది టాస్క్. 

Continues below advertisement


రీతూ వర్సెస్ సంజన... బోరున ఏడ్చేసిన ఫైర్ బ్రాండ్ 
ఫస్ట్ రౌండ్ లోనే సంజన బొమ్మ ఒక్కటే మిగలడంతో, ఆమె బొమ్మను సంచాలక్ దివ్య - రీతూతో స్వాప్ చేసింది. దీంతో సంజన "రీతూ సపోర్ట్ తో ఆడుతోంది. నావల్ల ఇమ్మాన్యుయేల్ మోకాళ్ళపై కూర్చునే రోజు రాలేదు. ఇమ్మూ తో నా బాండ్ ను మీ బాండ్ తో కంపేర్ చేయొద్దు" అని రీతూ - డెమోన్ బంధాన్ని టార్గెట్ చేసి మాట్లాడింది. "మీరు చెప్పొద్దు సోలో ప్లేయర్ అని. నాకు డెమోన్ తో మంచి బాండింగ్ ఉంది. మిగతా వాళ్లకు కూడా అలాగే కంఫర్ట్ జోన్ ఉంది. మీలాగా నామినేషన్ తీసుకోలేకపోతున్నా అనలేదు" అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది రీతూ. దివ్య ఇద్దరి ఆర్గ్యుమెంట్స్ విని, సంజనాను నామినేట్ చేసింది. తరువాత "ఆ అమ్మాయి నాకోసం జుట్టు కట్ చేసుకుంది. అలాంటి అమ్మాయి గురించి ఛాయిస్ లేక ఇలా మాట్లాడాను. సారీ" అంటూ బోరున ఏడ్చింది సంజన. రీతూతో సహా అందరూ ఆమెను ఓదార్చారు.


కన్నీళ్లు పెట్టుకున్న సుమన్ శెట్టి 
రెండవసారి సుమన్ శెట్టి ఆఖరిగా వెళ్లగా, అతని చేతిలో తనూజా బొమ్మ ఉంది. వీళ్లిద్దరూ ఎవరికీ వారే నామినేట్ అవ్వడానికి సిద్ధం అయ్యారు. "నావల్లే తనూజా డేంజర్ జోన్ లోకి వచ్చింది" అంటూ సుమన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇద్దరిలో సుమన్ ను నామినేట్ చేసింది సంజన. మూడవ రౌండ్ లో బిగ్ బాస్ రూల్స్ మార్చగా... సాయి తనూజాను, డెమోన్ సేఫ్ గేమ్ అంటూ భరణిని నామినేట్ చేశారు. వీళ్లలో మళ్ళీ తనూజా - భరణి కి మధ్య పడింది. భరణి "నేను బాండింగ్స్ వల్ల ఎలా బయటకు వెళ్ళానో ఆ పరిస్థితులను ఆమె కూడా ఫేస్ చేస్తే బాగుంటుంది" అని తనూజాను అన్నారు. "మొదటి రోజు నుంచి బాండింగ్ వల్ల బయటకు వెళ్ళారు. కెప్టెన్సీ టాస్క్ లో ఛాన్స్ ఇవ్వలేదు. బిర్యానీ నాకు, మాధురికి ఇద్దరికే పెట్టలేదు" అంటూ తనూజా స్ట్రాంగ్ గా ఇచ్చిపడేసింది. వాళ్ళిద్దరిలో భరణి నామినేట్ చేసింది దివ్య. తనూజా సేఫ్ గేమ్ అంటూ ఇమ్మాన్యుయేల్ ను నామినేట్ చేసింది. వీళ్లిద్దరి మధ్య కూడా హీటింగ్ డిస్కషన్ నడిచింది. రామూ వచ్చి కళ్యాణ్ ను నామినేట్ చేశాడు. ఈ ఇద్దరిలో కళ్యాణ్ ను నామినేట్ చేశాడు డెమోన్.


Also Read: బిగ్‌బాస్ డే 56 రివ్యూ... ఎలిమినేషన్ తరువాత రాజాకి రోజా - భరణి, దివ్యాలకు ముళ్ళు గుచ్చిన దువ్వాడ మాధురి... తనూజా గోల్డెన్ బజర్ ఎందుకు వాడలేదంటే?


తనూజ వర్సెస్ ఇమ్మాన్యుయేల్ 
"నెక్స్ట్ నేను మాట్లాడితే ఎలా ఉంటుందో చూపిస్తా" అంటూ ఇమ్మాన్యుయేల్ తనూజాను నామినేట్ చేశాడు. కానీ తనూజా ఈసారి అస్సలు డిఫెండ్ చేసుకోలేదు. రీతూ రాముని నామినేట్ చేసింది. తనూజా - రామూలలో కళ్యాణ్ రాముని నామినేట్ చేశాడు.నెక్స్ట్ రౌండ్ లో ఇమ్మాన్యుయేల్ సాయిని, నిఖిల్ తనూజాను నామినేట్ చేశారు. వీళ్లలో సాయిని నామినేట్ చేశాడు డెమోన్. 


కెప్టెన్ దివ్య... నామినేట్ కాని వాళ్లలో తనూజాను నామినేట్ చేసింది. "భరణి నీకంటే నాకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని అనుకుంటున్నావ్. నేను మీ ఇద్దరి బాండింగ్ ను బ్రేక్ చేశానని బయటకెళ్ళింది. నువ్వు అనుకునేది కరెక్ట్ కాదు. నీకు సపోర్ట్ లేదా సింపతీ కావాలి" అంటూ దివ్య స్టార్ట్ చేసింది. "భరణిని నామినేట్ చేశాను. కాబట్టి నువ్వు నన్ను నామినేట్ చేశావ్" అంటూ ఇచ్చిపడేసింది తనూజా. ఈ వారం నామినేషన్లలో తనూజా, సంజన, సుమన్ శెట్టి, భరణి, కళ్యాణ్, రామూ, సాయి ఉన్నారు. 


Also Readబిగ్‌బాస్ డే 55 రివ్యూ... కత్తులు పొడిచి కళ్ళు తెరిపించిన నాగ్... దువ్వాడ మాధురితో పాటు ఆ ముగ్గురికీ దిమ్మతిరిగే కౌంటర్... లాస్ట్‌లో పొట్టపగిలే కామెడీ ట్విస్ట్