Bigg Boss 9 Thanuja Vs Bharani Promo : బిగ్​బాస్​ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న తరుణం రానే వచ్చింది. బిగ్​బాస్​లో ఫ్యామిలీగా కలిసి మెలిసి ఉన్న కుటుంబం మధ్య నామినేషన్స్ చిచ్చు రాజుకుంది. ఎప్పటినుంచో భరణి, తనూజ, ఇమ్మాన్యుయేల్ మధ్య గొడవ రావాలని చూస్తోన్న ఆడియన్స్​కు మంచి స్టఫ్ దొరికింది. దానికి సంబంధించిన ప్రోమోను స్టార్​ మా విడుదల చేసింది. అసలు భరణి, తనూజకు గొడవ ఎందుకు వచ్చింది? ఇమ్మాన్యుయేల్, తనూజకు మధ్య జరిగిన హీటెడ్ ఆర్గ్యూమెంట్ ఏంటి? ప్రోమోలో ఏమున్నాయో చూసేద్దాం. 

Continues below advertisement

బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమో హైలెట్స్ ఇవే..

బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమో మొదలు కాగానే.. నా నామినేషన్ ఇమ్మాన్యుయేల్ అంటూ స్టార్ట్ చేసింది తనూజ. తను చాలా సేఫ్​గా గేమ్ ఆడుతున్నాడని చాలా క్లియర్​గా తెలుస్తుంది అంటూ చెప్పింది. నా వంతు అయినంత వరకు మోయగలుగుతా. నా భుజాలు నొప్పి పుడుతున్నాయి నువ్వు చచ్చిపోతావు అంటే దింపుతానని ఇమ్మూ చెప్పగా.. నీ భుజం బరువు ఎక్కేసి.. నొప్పి వస్తుంది అనుకున్నప్పుడు ఆ భుజం ఎక్కించుకోకు అంటూ తనూజ అనింది. అందుకే దింపేశాను అంటే వ్యాలిడ్ రిప్లై ఇచ్చాడు ఇమ్మూ.  సిల్లీ పాయింట్ ఉన్నా వేసేసి పొడిచేది నేను కాదు అంటూ తనూజ చెప్పింది. మళ్లీ బజర్ మోగగా తనూజ, భరణి గొడవ మొదలైంది. 

Continues below advertisement

తండ్రి Vs కూతురు.. తనూజ Vs భరణి

డిమోన్ పవన్ తన నామినేషన్ భరణి అని చెప్పాడు. సాయి తనూజని నామినేట్ చేశాడు. తనూజ నన్ను ఏ టాస్క్​లోనూ సేవ్ చేయలేదు. నేనే తనని రెండుసార్లు సేవ్ చేశానంటూ భరణి చెప్పాడు. టాస్క్ విషయంలో సపోర్ట్ చేశారు. ఎందుకంటే అది సపోర్టింగ్ గేమ్ కాబట్టి. తన కన్నా నేను బాగా టాస్క్​లు ఆడాను. మే బి నేను ఆయనకు నేను ఆడలేను అనో.. వీక్ అనో.. ఆయనకేముందో నాకు తెలియదు అని తనూజ చెప్పింది. ఇది నీకు ఇప్పుడు అనిపించిందా ముందే అనిపించిందా అంటూ భరణి అడగ్గా.. ముందే అనిపించిందని చెప్పింది తనూజ. మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు అంటూ భరణి నిలదీశాడు. 

ఇమ్మూపై తనూజకి ఎందుకంత కోపం.. 

భరణి తనూజతో ఆర్గ్యూ చేస్తూ.. ఇమ్మూ ప్రస్తవన తీసుకురాగా తనూజకు చాలా కోపం వచ్చేసింది. ఎగ్జాట్లీ మీరు దేనికైనా ఇమ్మూ ఇమ్మూ అంటారు. మాట మాటకి దివ్య అంటారు. దివ్య వస్తే తనూజ గొంతుకు అయినా తనూజ మాటకు అయినా ఎక్కడ స్పేస్ ఉందంటూ అడిగింది. ఆయనది ఒక వస్తువు కనిపించట్లేదని.. దివ్య తీసిందేమో వెళ్లి అడుగు అని నన్ను పంపించారు. భరణి పిలిచి తనూజ ఇటు ఇటు నన్ను చూసి మాట్లాడు అని చెప్పాడు. నేను ఏమి మాట్లాడినా మీరు పర్సనల్ పర్సనల్ అంటున్నారు మీ దగ్గరికి ఎలా వచ్చేది అంటూ సీరియస్ అయింది తనూజ. అలాగే తర్వాత ప్రోమో దివ్యకి తనూజని నేరుగా నామినేట్ చేసే అవకాశం వచ్చింది. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ ఫుల్ ఎంటర్​టైనింగ్​గా ఉండబోతుంది.