Bigg Boss Telugu Season 9 winner : తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9 మొదలై 50 రోజులు దాటింది. ఇంకా 50 రోజులు మిగిలే ఉంది. కానీ విజేత ఎవరు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఈ క్లారిటీ వచ్చింది ఇప్పుడు కాదు. సీజన్ ప్రారంభమైన రెండు మూడు వారాలకే జనాలకు అర్థమైపోయింది. ముద్దమందారం సీరియల్‌లో లీడ్‌ రోల్ చేసిన తనూజను విన్నర్‌ను చేసేందుకే బిగ్‌బాస్ టీం శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్టు క్లారిటీ వచ్చేసింది. అటు నాగార్జున కూడా వీకెండ్‌లో ఆమెకు ఎలివేషన్స్‌ ఇస్తున్నారు. దీనికి తోడు ఆమె పెట్టుకున్న పీఆర్‌ టీం తనూజ పేరు కనిపిస్తే చాలు ఓట్లు వేస్తున్నారు. ఈ ఓటింగ్‌లో కూడా బిగ్‌బాస్ టీం హ్యాండ్ ఉన్నట్టు పుకార్లు వస్తున్నాయి. మొత్తానికి ఈ సీజన్‌లో జనాలను ఎంటర్‌టైన్ చేయడం కంటే తనూజను గెలిపంచడానికి వేయాల్సిన ఎత్తులు వేస్తున్నారు. 

Continues below advertisement

తనూజకు ఓట్లు వేయిస్తున్న బీబీ టీం

తనూజకు ఎదురుగా నిలబడే వాళ్లను హౌస్‌లో ఉండనీయడం లేదు. అలాంటి వారిని ఏదో రూపంలో బయటకు పంపిస్తున్నారు. లైవ్‌లో కానీ, ఎపిసోడ్స్‌లో కానీ ఆమెను నెగటివ్ అయ్యే కంటెంట్ ప్లే చేయడం లేదు. అలాంటిది ఏమైనా ఉంటే వీకెండ్‌లో దాన్ని నాగార్జునతో కవర్ చేస్తున్నారు. ఇలా ఎక్కడ కూడా ఆమె ఓటింగ్‌కు ఇబ్బంది లేకుండా జాగ్రత్తపడుతున్నారు. తనూజ విన్నర్ మెటీరియల్ కాదని అందరికీ తెలిసినప్పటికీ ఆమెను బలవంతంగా రుద్దుతున్నారు. ఆమె కంటే బాగా ఆడే వాళ్లు ఉన్నప్పటికీ ఏదో మార్గంలో వారిపై నెగటివిటీని పెంచుతున్నారు. ఇప్పటి వరకు తనూజ గొప్పగా ఆడిన టాస్క్ లేనేలేదు. చేసే ప్రతి పనిలో అసహనంగా ఉంటోంది. ఇచ్చిన ఏ పని కూడా పూర్తిగా ఆనందంగా చేసినది లేదు. ప్రతి పనిలో వివాదాలు పెట్టుకుంటోంది. అలాంటి వివాదాల్లో ఆమెదే తప్పు ఉన్నప్పటికీ బీబీ టీం మాత్రం ఆమెపై ఈగ వాలనీయకుండా చూసుకుంటున్నారు. 

తనూజకు నెగిటివ్ రాకుండా జాగ్రత్త

ఇప్పటి వరకు తనూజతో కల్యాణ్ క్లోజ్‌గా ఉన్నాడు. అయితే శ్రీజ ఇంట్లోకి వచ్చిన తర్వాత తన స్ట్రాటజీ మార్చుకున్నాడు. ఆమెతో పోటీకి సిద్ధమయ్యాడు. కానీ ఇది బీబీ టీంకు నచ్చడం లేదు. అందుకే ఇప్పుడు కల్యాణ్‌ను నెగిటివ్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకే మొన్న కూర కోసం జరిగిన డిస్కషన్‌లో కల్యాణ్ తప్పులేకపోయినా నాగార్జున చీవాట్లు పెట్టారు. కల్యాణ్‌ చపాతీకి బెండకాయ కర్రీ బాగోదని బంగాళదుంప కర్రీ చేయించాలని చెబితే గొడవ పెట్టుకుంది. ఆర్డర్ వేయొద్దని చీదరించుకుంది. దీన్ని అక్కడే ఉన్న కెప్టెన్, కుక్ అందరూ సమర్ధించారు. తర్వాత ఆమె కూడా బంగాళదుంప కర్రీ చేసేందుకు ఓకే చెప్పింది. అయితే దీన్ని బీబీ టీం, నాగార్జున మాత్రం తప్పుగా ప్రొజెక్ట్ చేశారు. కల్యాణ్ ఆర్డర్ వేశాడనే విధంగా ప్రజలు చూపించారు. 

Continues below advertisement

తనూజతో ఎవరు గొడవ పెట్టుకున్న వారిదే తప్పు 

అంతకు ముందు సంజన విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. సంజన అన్నం వడ్డించుకున్నందుకు తనూజ గొడవ పెట్టుకుంది. అందులో సంజనదే తప్పు అన్నట్టు నాగార్జున చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అక్కడే షోకు వచ్చిన ప్రేక్షకులు మాత్రం షాక్ ఇచ్చారు. తనూజ నోరు మంచిది కాదని అదే సమస్య అని చెప్పారు. దీంతో ఏం చెప్పాలో అర్థం కాక నాగార్జున కూడా అవును అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. అంతకు ముందు వారం రాము విషయంలో తనూజకు బాగా నెగిటివ్ అయ్యింది. తన పక్కనే కూర్చోవడానికి వచ్చిన రామును అసహ్యించుకుందని బాగా వైరల్ అయ్యింది. దాన్ని అడ్రెస్ చేయకపోతే బాగోదని నాగార్జున అడ్రెస్ చేశారు. కానీ అంత సీరియస్‌గా టాకిల్ చేయలేదు. అప్పుడు తనూజ చేసింది కరెక్టే అన్నట్టు రాముపై ఓ వీడియో ప్లే చేశారు. తనూజ అన్నట్టు రాము అనవసరంగా కావాలనే గొడవలు జరిగేటప్పుడు వస్తున్నాడు అనేలా ఆ వీడియో ఉంది. చూడటానికి నవ్వు తెప్పిస్తున్నా, తనూజను బ్యాకప్ చేయడానికే ఇదంతా చేశారని అర్థమవుతుంది. 

తనూజ కోసం శ్రీజ ఎలిమినేషన్ 

ఇప్పటికే ఒకసారి శ్రీజాకు అన్యాయం చేసిన బిగ్‌బాస్ టీం రెండోసారి అదే చేశారు. ఆమె రెండోసారి ఇంట్లోకి వెళ్లిన తర్వాత తనూజను టార్గెట్ చేసింది. ఆమె వేసుకున్న మాస్క్‌ను తీసేసింది. దీంతో బీబీ టీంకు కోపం వచ్చింది. అందుకే ఎలాగైనా శ్రీజను పంపించేయాలని టాస్క్‌లు, ఓటింగ్ పెట్టారు. టాస్క్‌లుపరంగా అదే జరిగింది. ఓటింగ్ పరంగా వారు అనుకున్నట్టుగానే చేసుకున్నారు. దీంతో శ్రీజ ఇంటి నుంచి వెళ్లిపోయింది. కనీసం ఆమె ఏవీ కూడా వేయలేదు. ఎలిమినేషన్ అయిన వారి ఏవీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి అవకాశం కూడా శ్రీజకు ఇవ్వలేదు. కేవలం బాండ్‌ భరణిని హౌస్‌లోకి తీసుకురావాలని ప్లాన్ చేశారు. అప్పుడే ఫ్యామిలీ డ్రామా ఉంటుందని, ఇప్పుడు వస్తున్న సీరియల్స్‌ మాదిరిగానే మరో బిగ్‌బాస్‌తో మరో సీరియల్ రన్ చేసేయచ్చని అనుకున్నారు. ఆటతో ఎలాగో సీజన్ లేవడం లేదని కేవలం బాండింగ్స్‌తో కాస్త సెంటిమెంట్‌ రప్పిస్తే కనీసం ఫ్యామిలీ ఆడియన్స్‌  చూస్తారని ఆశిస్తున్నారు. 

తనూజకు నెగిటివ్ కాకుండా మాధురిని పంపించారు 

హౌస్‌లో ఎవరికి ఓట్లు తక్కువ వస్తుంటే వాళ్లు వెళ్లిపోవడం సర్వసాధారణం. దివ్వల మాధురి కూడా అలానే వెళ్లిపోయారు. కానీ ఇక్కడ తనూజ విషయంలో చేసిన పని చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆఖరి స్థానంలో ఉన్న గౌరవ్‌, మాధురిని కారులో తీసుకెళ్లి బయట ఉంచారు. తర్వాత ఓట్ల పరంగా ఎవరు లీస్ట్‌లో ఉన్నారో హౌస్‌లో ఉన్న వారికి చూపించారు. మాధురికి తక్కువ ఓట్లు వచ్చాయని చెప్పారు. తర్వాత తనూజను నీ దగ్గర ఉన్న సేవింగ్ పవర్ వాడతావా లేదా అని  అడిగారు. జనం ఓట్లతో వెళ్లిపోయే వాళ్ల కోసం ఎవరైనా పవర్ వాడతారా? స్ట్రాటజీతో ఆడే ఎవరైనా ఈ పని చేస్తారా? అదే విషయం ఓట్ల సంగతి చెప్పకుండా అడిగి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. భరణి ఎలిమినేషన్ అయిన వారంలో ఇమ్మాన్యుయెల్‌కు మాత్రం ఏం చెప్పకుండానే భరణి కోసం వాడుతున్నావా, రాము కోసం వాడుతున్నావా అని ముందే అడిగారు. ఈ వారం అలాంటిదేమీ లేకుండా తనూజను జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. 

తనూజ విన్నర్‌ను చేసే వరకు ఎలివేషన్స్ ఇస్తున్న బీబీ టీం 

ఇలా ప్రతి విషయంలో తనూజను కంటికి రెప్పలా బీబీ టీం కాపాడుతూ వస్తోంది. ఆమె ఓటింగ్ తగ్గకుండా జాగ్రత్తపడుతోంది. కల్యాణ్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నప్పుడు స్టాండ్ తీసుకున్న విషయంలో తప్ప ఎక్కడ కూడా తనూజ మాస్క్ తీసి ఆడలేదు. నిత్యం మాస్క్‌తోనే ఆడుతోంది. హౌస్ అంతా ఆమెకు సపోర్ట్‌గా ఉన్నప్పటికీ తనకు ఎవరూ సపోర్ట్ లేరని, తనది ఇండివిడ్యువల్ గేమ్ అంటూ చెప్పుకొస్తోంది. అవసరమైనప్పుడు రిక్వస్ట్ చేస్తూ తనకు సపోర్ట్ చేయాలని వారిని వారిపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇది న్యూట్రల్ ఆడియన్స్‌కు నచ్చడం లేదు. ఆమె కోసం బీబీ టీంలోనే కొందరు పీఆర్‌లతో మాట్లాడి ప్రత్యేకంగా ఓట్లు వేయిస్తున్నారని ఆరోపణ ఉంది. ఆమెను పాజిటివ్‌గా చేసే, మిగతా వారిని నెగిటివ్‌గా చేసేలా ఎడిటింగ్‌లు చేస్తున్నారు. బయటకు వచ్చిన రమ్య, తనూజ, ఇతర కంటెస్టెంట్స్‌ అదే చెబుతున్నారు. అందుకే తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9 విజేత తనూజ అని, కేవలం ఎపిసోడ్స్ కోసం మిగతా వారితో గేమ్ ఆడిస్తున్నారని అంటున్నారు.