Contestants Selected in Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్నిపరీక్ష మంచి రసవత్తరంగా జరుగుతోంది. బిందు మాధవి, నవదీప్, అభిజిత్ కలిసి కామనర్స్‌ను సెలెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చిన లక్షల అప్లికేషన్స్ నుంచి ఓ 45 మందిని బిగ్ బాస్ టీం సెలెక్ట్ చేసింది. ఆ 45 మందిలోంచి 15 మందిని సెలెక్ట్ చేసేందుకు అగ్నిపరీక్ష నడుస్తోంది. ఈ క్రమంలో ఆ ముగ్గురు జడ్జ్‌లు కలిసి ప్రాసెస్‌ను ముందుకు తీసుకువెళ్తున్నారు. గడిచిన రెండు ఎపిసోడ్స్‌లో జరిగింది ఏంటో చూశాం. మరి ఈ మూడో ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

మొదటగా విజయనగరం నుంచి కళ్యాణ్ పడాల అనే వ్యక్తి వచ్చాడు. నటన అంటే ఇష్టం అన్నాడు.. చివరకు ఆర్మీలో జాయిన్ అయ్యాడు.. ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ షోలోకి వెళ్లాలని వచ్చాడు. ఇక ఇతడిని చివరకు హోల్డ్‌లో పెట్టారు. ఆపై హైదరాబాద్ నుంచి అలేఖ్య అని ఓ అమ్మాయి వచ్చింది. కామన్ ఆడియెన్స్‌లో క్లాస్ ఎలా ఉంటుందో చూపిస్తా అని చెప్పింది. చివరకు ఈమెను కూడా హోల్డ్‌లో పెట్టారు. షాద్ నగర్ నుంచి షాకిబ్ అనే వ్యక్తి వచ్చాడు. డ్యాన్స్ వచ్చు అన్నాడు.. కానీ ఒక్క మూమెంట్ కూడా వేయలేదు.. అసలు ఇతడ్ని పూర్తిగా ఎలిమినేట్ చేస్తారని అనుకుంటే.. నవదీప్ ఒక్కడే గ్రీన్ ఇచ్చి హోల్డ్‌లో పెట్టాడు. ఇలాంటి వాళ్లకి గ్రీన్ ఎందుకు ఇస్తావ్? అని నవదీప్‌ను బిందు మాధవి ప్రశ్నించింది.

Also Read: బిగ్ బాస్ అగ్నిపరీక్షలో వింతలు... అతికి అంబాసిడర్... రేయ్ ఎవర్రా మీరంతా? రెండో ఎపిసోడ్ రివ్యూ

డాల్య అనే ఓ వ్యక్తి వచ్చింది. ఫిట్ నెస్ ట్రైనర్ అని చెప్పింది. కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవాలని అనుకుంటూ ఉంటుందట. ఓ సారి కొంత మంది ఆకతాయిలు తనను వేధిస్తే.. ఐదు కిలోమీటర్లు రాత్రి పూట రోడ్డు మీద పరుగులు పెట్టిందట. అప్పటి నుంచి స్ట్రాంగ్ అవ్వాలని అనుకుందట. ఇక ఈమెను జడ్జ్‌లు హోల్డ్‌లో పెట్టారు. సిద్దిపేట్ మోడల్ అంటూ వచ్చిన వెంకటేష్‌ను అసలు నీకు బిగ్ బాస్ సెట్ కాదు అని చెప్పేసి ఎలిమినేట్ చేశారు. వరంగల్ నుంచి వచ్చిన ఇన్ ఫ్లూయెన్సర్, కంటెంట్ క్రియేటర్ అనూష కథ విని, ఆమె ధైర్యాన్ని చూసి.. కుటుంబాన్ని పోషించే విధానం తెలుసుకుని. చివరకు ఆమెను టాప్ 15లోకి సెలెక్ట్ చేశారు.

అనకాపల్లి నుంచి సాయి కృష్ణ అనే వ్యక్తి వచ్చాడు. నాన్నని గర్వపడేలా చేయాలని, నాన్న కోసమే బిగ్ బాస్‌కు వచ్చానని అన్నాడు. ఇక ఇతగాడి గురించి పూర్తిగా తెలీడం లేదు.. ఓ ఛాన్స్ ఇద్దామని హోల్డ్‌లో పెట్టారు. కడప నుంచి వచ్చిన నిఖితని కూడా హోల్డ్‌లో పెట్టారు. డెంటిస్ట్ అని చెప్పింది. కానీ ఇంట్లో బలవంతం చేస్తేనే డెంటిస్ట్ అయ్యానని చెప్పింది. బిగ్ బాస్‌కు సరిపోవు అని అభిజిత్ అంటే.. బిందు, నవదీప్‌లు ఓ ఛాన్స్ ఇద్దామని హోల్డ్‌లో పెట్టారు. 19 ఏళ్ల జనీత్ విజయవాడ నుంచి వచ్చాడు. పెద్దయ్యాక వ్యాపారవేత్తని అవుతానని చెప్పాడు. అమ్మ పడే కష్టాన్ని చెప్పాడు. అయితే ఇప్పుడే బిగ్ బాస్ వద్దు అని చెప్పి ముగ్గురు జడ్జ్‌లు కలిసి నిర్ణయం తీసుకుని బయటకు పంపారు.

హైదరాబాద్ నుంచి శ్వేత అనే మహిళ వచ్చింది. యూకేలో ఉంటుందట. అమ్మకు క్యాన్సర్ అని చెప్పింది. తాను ఒక బిజినెస్ అనలిస్ట్ అని, ఫిట్ నెస్ ట్రైనర్ అని, మోడలింగ్ చేస్తానని చెప్పింది. ఇక తాను ఆడ నవదీప్ అని చెప్పడం, నవదీప్‌కు ప్రపోజ్ చేసే టాస్క్‌తో అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. చివరకు ఆమెకు ముగ్గురు జడ్జ్‌లు గ్రీన్ ఇచ్చారు. అలా శ్వేత టాప్ 15లోకి వెళ్లింది. ఈ మూడు ఎపిసోడ్స్‌తో అగ్ని పరీక్ష ఆడిషన్ అయిందని శ్రీముఖి చెప్పింది. ఇప్పటి వరకు ఆరుగురు మాత్రం కన్ఫామ్ అయ్యారని, ఇంకా 16 మంది హోల్డ్‌లో ఉన్నారని తెలిపింది. 16 మంది నుంచి ఇంకా 9 మంది కావాలని.. అసలు అగ్ని పరీక్ష మొదలు కానుందని ప్రకటించింది. మరి మున్ముందు ఈ అగ్ని పరీక్షలో ఏం జరగనుందో చూడాలి.

Also Readపరదా వర్సెస్ శుభం కలెక్షన్లు... ఓపెనింగ్ డే రిజల్ట్‌ క్లియర్... సమంత క్రేజ్ ముందు అనుపమ వెలవెల!