ఫిమేల్ సెంట్రిక్ సినిమాలకు స్టార్ హీరోల సినిమాల స్థాయిలో ప్రేక్షకులు రారు. ఓ హీరో సినిమాకు పది కోట్ల రూపాయల ఓపెనింగ్ వస్తే... హీరోయిన్ సినిమాకు కనీసం కోటి రూపాయలు అయినా సరే రావాలి కదా! అప్పుడేగా ఆవిడకు క్రేజ్ ఉన్నట్టు! ఆ సినిమా హిట్ అయినట్టు! 'శుభం', 'పరదా' ఫస్ట్ డే కలెక్షన్లు చూస్తే ఆ డిఫరెన్స్ బాగా అర్థం అవుతుంది.
సమంత వర్సెస్ అనుపమ పరమేశ్వరన్!Paradha First Day Box Office Collection Vs Subham 1st Day Collection: ప్రత్యేక అతిథి పాత్రలో నటించడంతో పాటు సమంత నిర్మించిన సినిమా 'శుభం'. ఆ మూవీ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ గ్రాస్ ఎంతో తెలుసా? కోటిన్నర. ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేసిన నంబర్ అది. లేటెస్ట్ రిలీజ్ 'పరదా' ఫస్ట్ డే కలెక్షన్ ఎంతో తెలుసా? మూవీ ప్రొడక్షన్ హౌస్ అయితే అనౌన్స్ చేయలేదు. ట్రేడ్ పోర్టల్స్ రిపోర్ట్స్ ప్రకారం అయితే జస్ట్ 20 లక్షలు. ఓపెనింగ్ డే థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో అనుపమ ఘోరంగా ఫెయిల్ అయ్యింది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనుపమ పరమేశ్వరన్ అడుగు పెట్టే సమయానికి సమంత స్టార్ హీరోయిన్. వయసులోనూ ఆల్మోస్ట్ పదేళ్ళు పెద్ద. 'అ ఆ'లో సమంత మెయిన్ హీరోయిన్ అయితే అనుపమ పరమేశ్వరన్ సెకండ్ లీడ్. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతోనూ, టాలీవుడ్ టాప్ దర్శకులతోనూ సమంత సినిమాలు చేశారు. అటు తమిళ్, హిందీలోనూ ఆమెకు ఫాలోయింగ్ ఉంది. ఆ స్థాయిలో అనుపమకు ఫాలోయింగ్ లేదు. సినిమాలూ చేయలేదు. అందువల్ల ఇద్దరి సినిమాలు కంపేర్ చేయడం కరెక్ట్ కాదని కొందరు అనుకోవచ్చు. అయితే... 'శుభం', 'పరదా' సినిమాలకు దర్శకుడు ఒక్కరే కావడం వల్ల కంపేరిజన్ తప్పడం లేదు.
సమంత 'శుభం'తో పాటు అనుపమ 'పరదా'కు ప్రవీణ్ కాండ్రేగుల దర్శకుడు. ఆ రెండూ ఫిమేల్ సెంట్రిల్ ఫిలిమ్స్. 'శుభం'లో సమంత మెయిన్ క్యారెక్టర్ ఏమీ కాదు. గెస్ట్ రోల్ చేశారు. మెయిన్ లీడ్స్ ఆల్మోస్ట్ కొత్తవాళ్లు. అయినా థియేటర్లకు జనాలు వచ్చారంటే, కోటిన్నర కలెక్షన్లు ఇచ్చారంటే సమంత స్టార్ పవర్ అది. ఆ సినిమా తీసిన ప్రవీణ్ కాండ్రేగుల 'పరదా'తో అటువంటి ఫీట్ రిపీట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. అనుపమ, దర్శన, సంగీత వంటి పాపులర్ ఫిమేల్ ఆర్టిస్టులు ఉన్నా... విపరీతంగా ప్రచారం చేసినా ఓపెనింగ్ డే పాతిక లక్షలు కలెక్ట్ చేయడానికి కింద మీద పడింది 'పరదా'. మొదటి రోజు డిజాస్టర్ అనిపించుకుంది. కనీసం మూవీ ప్రొడక్షన్ హౌస్ కలెక్షన్స్ కూడా అనౌన్స్ చేయలేదు. వీకెండ్ తర్వాత థియేటర్లలో సినిమా ఉంటడం కష్టం అని ట్రేడ్ టాక్.
Also Read: పుకార్లకు చెక్ పెట్టిన 'ఓజీ' టీమ్... ఆగస్టు 29 నుంచి అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ షురూ