Nagarjuna's Remuneration For Bigg Boss 9 Host: ప్రస్తుతం అందరి చూపు ఫేమస్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ వైపే ఉంది. ఈసారి కూడా కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోస్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. గత సీజన్లకు భిన్నంగా ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులను కూడా హౌస్‌లోకి ఎంట్రీ అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేశారు.

Continues below advertisement

కింగ్ నాగార్జున రెమ్యునరేషన్ ఎంతంటే?

'బిగ్ బాస్' షోతో నాగార్జున ప్రత్యేక అనుబంధం ఉంది. ఫస్ట్ సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించిన తర్వాత మూడో సీజన్ నుంచి నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తనదైన పంచెస్, టైమింగ్, సీరియస్ నెస్‌తో హౌస్‌లోని కంటెస్టెంట్స్ అందరినీ కంట్రోల్ చేస్తూనే సలహాలు ఇస్తూ అద్భుతంగా సీజన్స్‌ను నడిపించారు నాగార్జున. బిగ్ బాస్ అంటే నాగార్జున... నాగార్జున అంటే బిగ్ బాస్ అని గుర్తొచ్చేలా ఆయన హోస్ట్‌గా వ్యవహరించారు.

Continues below advertisement

రెమ్యునరేషన్ ఎంతంటే?

ఇంత చక్కగా హౌస్‌ను నడిపిస్తోన్న నాగార్జున రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారనే దానిపై ఫిలిం సర్కిల్‌లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. గత సీజన్‌లో ఆయన రూ.20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు 9వ సీజన్‌కు  కూడా భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సీజన్‌కు ఆయనకు దాదాపు రూ.30 కోట్ల నుంచి రూ.35 కోట్ల వరకూ అందుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ టీవీ, ఫిలిం సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 

Also Read: ఫన్... ఎమోషన్... ఎంటర్‌టైన్‌మెంట్ - బిగ్ బాస్ అగ్నిపరీక్షలో కాలర్ ఎగరేసిన కంటెస్టెంట్

నిజంగా వారికి 'అగ్నిపరీక్ష'

ఈసారి డిఫరెంట్‌గా సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు సైతం బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేలా మేకర్స్ ప్లాన్ చేశారు. ఇప్పటికే సామాన్యుల నుంచి అప్లికేషన్స్ తీసుకుని దాదాపు 45 మందిని ఫైనల్ చేశారు. వీరికి 'అగ్నిపరీక్ష'లో టాస్క్‌లు పెట్టి ఫైనల్‌గా ఓ ఐదుగురిని హౌస్‌లోకి పంపిస్తారు. ఈ అగ్నిపరీక్ష షోకు బిందు మాధవి, నవదీప్, అభిజిత్ జడ్జె‌స్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ నెల 22 నుంచి ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్‌'లో ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పటివరకూ రెండు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కాగా... నలుగురిని టాప్ 15లోకి పంపించారు జడ్జెస్. తమ టాలెంట్, ఇన్‌స్పైర్డ్ స్టోరీస్‌తో విజయవాడ నుంచి వచ్చిన దివ్య నిఖిత, హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రసన్న కుమార్, తణుకు నుంచి వచ్చిన పవన్‌, హైదరాబాద్ నుంచి వచ్చిన మనీష్‌ జడ్జెస్‌ను ఇంప్రెస్ చేసి డైరెక్ట్‌గా టాప్ 15లోకి వెళ్లారు. ఇక అతి చేసిన కొందరిని డైరెక్ట్‌గా ఎలిమినేట్ చేయగా కొందరిని హోల్డ్‌లో ఉంచారు.

ఈసారి రణరంగమే...

ఈసారి డబుల్ హౌస్... డబుల్ డోస్ అంటూ నాగార్జున ఇప్పటికే ప్రోమోల ద్వారా భారీ హైప్ క్రియేట్ చేశారు. సామాన్యులు కూడా సెలబ్రిటీలతో పోటీ పడుతుండడంతో ఈసారి షో మామూలుగా ఉండదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఫుల్ హీట్ ఖాయమంటూ చెబుతున్నారు. మరి కొత్త బిగ్ బాస్ షో ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలంటే సెప్టెంబర్ 7 వరకూ ఆగాల్సిందే.