Bigg Boss 9 Telugu Agnipariksha Episode 3 Promo Review: ది ఫేమస్ రియాలిటీ షో 'బిగ్ బాస్'లో సామాన్యులను హౌస్‌లోకి పంపించేందుకు 'అగ్నిపరీక్ష' కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. మొత్తం 45 మందిలో 15 మందిని సెలక్ట్ చేసి నెక్స్ట్ రౌండ్‌కి పంపనున్నారు. ఫైనల్‌గా ఐదుగురికి హౌస్‌లోకి ఎంట్రీ ఉంటుంది. ఫస్ట్ రెండు ఎపిసోడ్స్‌లో కొందరిని డైరెక్ట్‌గా టాప్ 15లోకి పంపించేశారు జడ్జెస్ బిందు మాధవి, నవదీప్, అభిజిత్.
విజయవాడ నుంచి వచ్చిన దివ్య నిఖిత, హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రసన్న కుమార్, తణుకు నుంచి వచ్చిన పవన్, హైదరాబాద్ నుంచి వచ్చిన మనీష్‌ను డైరెక్ట్‌గా టాప్ 15లోకి పంపిస్తే... అతి చేసిన కొంతమందిని హోల్డ్‌లో పెట్టి మరికొందరిని బిగ్ బాస్‌కు సెట్ కారంటూ డైరెక్ట్‌గా ఎలిమినేట్ చేసేశారు. ఇక మూడో ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారనున్నట్లు ప్రోమోను బట్టి తెలుస్తోంది.
కాలర్ ఎగరేసిన కంటెస్టెంట్
స్టేజీపైకి ఎంట్రీ ఇస్తూనే ఓ కంటెస్టెంట్ అతి చేశాడు. 'కాలర్ ఎగరేసుకుని చెప్తా... బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చానని...' అంటూ చెప్పగా జడ్జెస్ ఫన్ ఫీలయ్యారు. ఇక మరో కంటెస్టెంట్‌ను దేన్నైనా మోయగలుగుతావా అంటూ శ్రీముఖి ఫన్ చేయగా... 'నన్ను కాదయ్యా బాబూ...' అంటూ నవ్వులు పూయించారు.
Also Read: బిగ్ బాస్ అగ్నిపరీక్షలో వింతలు... అతికి అంబాసిడర్... రేయ్ ఎవర్రా మీరంతా? రెండో ఎపిసోడ్ రివ్యూ
నేను ఆడ నవదీప్ అంతే
ఓ లేడీ కంటెస్టెంట్‌ను జడ్జ్ బిందు మాధవి... 'రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటి మనది?' అని అడగ్గా... 'నేను ఆడ నవదీప్‌ను' అంటూ చెప్పడం నవ్వులు పూయించింది. అదే కంటెస్టెంట్స్ పుష్ అప్స్ చేయగా... జడ్జ్ బింధు మాధవి... 'నార్మల్‌గా అందరూ చేస్తారు. నువ్వు బెటర్‌గా చేయాలి.' అంటూ కౌంటర్ ఇచ్చారు.
పెళ్లెందుకు?
ఓ కంటెస్టెంట్‌ను పెళ్లైందా? అంటూ యాంకర్ శ్రీముఖి అడగ్గా... ఎందుకు? అని అడగడంతో ఫన్ మామూలుగా లేదు. 'అదే శ్రీముఖి నేను అందరినీ అడుగుతుంటాను బయట' అంటూ నవదీప్ చెప్పడం హైలెట్‌గా నిలిచింది. ఇక ఇదే కంటెస్టెంట్ తన ఫాదర్‌తో మాట్లాడలేనంత మిస్ అండర్‌స్టాండ్ ఏంటి? అని శ్రీముఖి అడగ్గా... 'తెలీదు మేడమ్' అంటూ ఎమోషనల్ అయ్యారు.
శ్రీముఖిని నామినేట్ చేసిన కంటెస్టెంట్
మరో లేడీ కంటెస్టెంట్ కూడా తన ఫాదర్‌ను తలుచుకుని ఎమోషన్ అయ్యారు. ఇదే కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్‌లో ఎవరిని నామినేట్ చేస్తావు అని ఎదురైన ప్రశ్నకు... 'మీరు జరిగితేనే నాకు ఆ సీట్ వస్తుంది' అంటూ శ్రీముఖినే నామినేట్ చేశారు. ఇక కొందరు కంటెస్టెంట్స్ మాస్క్‌లు, డిఫరెంట్ డ్రెస్సెస్ వేసుకుని వచ్చి జడ్జెస్‌ను ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశారు.
కొందరిని జడ్జెస్ హోల్డ్ చేయగా... మరికొందరిని డైరెక్ట్‌గా ఎలిమినేట్ చేసేశారు. ఓ కంటెస్టెంట్‌కు జడ్జ్ నవదీప్ రెడ్, గ్రీన్ సిగ్నల్ రెండూ చూపించడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ ఎపిసోడ్‌లోనూ కొందరు అతి, కొందరు కాన్ఫిడెన్స్, కొందరి ఎమోషన్ అన్నీ కలగలిపి ఫుల్ ఎంటర్ టైన్‌మెంట్ ట్రీట్ అందించినట్లు అర్థమవుతోంది.