Bigg Boss Agnipariksha begins: బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లేందుకు కామనర్స్ కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసే ప్రాసెస్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నిర్వహిస్తున్న అగ్ని పరీక్షలో ఆడిషన్స్ నడుస్తున్నాయి. 45 మందిలో 15 మందిని సెలెక్ట్ చేసి నెక్ట్స్ రౌండ్‌కు పంపే పనిని అభిజిత్, నవదీప్, బిందు మాధవి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండో ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

మొదటగా తణుకు నుంచి పవన్ అనే వ్యక్తి వచ్చాడు. టాలెంట్ అంతా చూపించాడు. స్పింటర్, జిమ్నాస్టిక్, యాక్టింగ్ ఇలా అన్నీ చేసేశాడు. దీంతో ముగ్గురు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి టాప్ 15లోకి పంపించేశారు. ఆ తరువాత శ్రీజ దమ్ము అనే ఓ అతి క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె వాగుడు, చేసిన అతికి అభిజిత్ ముందుగానే రెడ్ ఇచ్చి వదిలించుకున్నాడు. ఇరిటేటింగ్‌గా ఉందంటూ బిందు మాధవి కూడా రెడ్ ఇచ్చింది. ఇలాంటి ఇరిటేటింగ్ కారెక్టర్ ఉండాలి.. పబ్లిక్ వాంట్స్ దట్ అతి అంటూ నవదీప్ ఆమెకు ఓ ఛాన్స్ ఇచ్చాడు. దీంతో ఆమె హోల్డ్‌లో పడింది.

ఇక ఆ తరువాత తేజ సజ్జా మిరాయ్ ప్రమోషన్స్ కోసం వచ్చాడు. ఓ ఇద్దరు కంటెస్టెంట్ల ఎంపికలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో ఊర్మిళా చౌహాన్ అని ఓ అమ్మాయి వచ్చింది. మిస్ తెలంగాణ అని, మోడల్ అని చెప్పుకొచ్చింది. ఇక అమ్మాయికి పేడ పూసుకో అని బిందు మాధవి టాస్క్ ఇచ్చింది. ఒరిజినాలిటీ తెలియడం లేదు అని, జెన్యూన్ అనిపించడం లేదు అంటూ ఇలా ఆమెను జడ్జ్‌‌లు హోల్డ్‌లోనే పెట్టేశారు. ఆ తరువాత శాస్త్రి అనే ఓ డిఫరెంట్ పర్సన్ వచ్చాడు. ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీపై అవగాహన కల్పించేందుకు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తాను అని అన్నాడు. ఆ ఒక్క కారణం సరిపోదని అతడ్ని ఎలిమినేట్ చేశారు.

Also Read: ఇది కదా అసలైన మాస్ పంచ్ - బాబీ చిరు న్యూ మూవీ కాన్సెప్ట్ వేరే లెవల్

నర్సయ్య అనే గొర్రెల కాపరిని ముగ్గురు జడ్జ్‌లు కలిసి ఎలిమినేట్ చేశారు. బిగ్ బాస్‌ షోకి సెట్ అవ్వవు అని కారణం చెప్పి పంపించారు. ఆ తరువాత మిమిక్రీ, లాయర్ అంటూ వచ్చిన నాగ ప్రశాంత్‌ను హోల్డ్‌లో పెట్టారు. నెల్లూరు నుంచి వచ్చిన 19 ఏళ్ల శ్రేయాను టాప్ 15లోకి పంపారు. ఆమె చలాకీ మాటలు, యాంకరింగ్, తమిళ్ యాక్సెంట్ ఇలా అన్నీ నచ్చి ఆమెను టాప్ 15లోకి పంపారు. మగాళ్లు గొప్ప అంటూ శ్రీకాకుళం నుంచి వచ్చిన రవిని.. అటు నుంచి అటే పంపించేశారు. అతను ఏం చెబుతున్నాడో.. అతనికైనా అర్థం అవుతోందా? అంటూ ముగ్గురు జడ్జ్‌లు కలిసి రెడ్ ఇచ్చారు.

రాజమండ్రి నుంచి వచ్చిన శ్రీతేజను హోల్డ్‌లో పెట్టారు. ప్లే బ్యాక్ సింగర్ అని చెప్పడంతో.. చాలా ఫ్లాట్ ఫాంలు ఉంటాయి కదా? బిగ్ బాస్ ఎందుకు? అని చెప్పి హోల్డ్‌లో పెట్టారు. ఆ తరువాత కొంత మందికి అసలు ఇంట్రడక్షన్ కూడా ఇవ్వకుండానే స్టేజ్ మీదకు పిలిచి.. ప్రోమో టైపులో కట్ చేసి.. వారు సెలెక్ట్ కాలేదన్నట్టుగా చెప్పి పంపించేశారు. ఆ తరువాత హైదరాబాద్ నుంచి మనీష్ వచ్చాడు. 30 ఏళ్లలోనే ఫోర్బ్స్ 30 జాబితాలోకి వెళ్లిన ఇతగాడి బ్రేకప్ స్టోరీ విని టాప్ 15లో పెట్టారు. ఆ తరువాత వచ్చిన కల్కి ఫ్రమ్ నల్గొండని హోల్డ్‌లో పెట్టారు. బిందు మాధవి, శ్రీముఖిని హ్యాండ్ రెజ్లింగ్‌లో కల్కి ఓడించింది. ఇలా రెండో ఎపిసోడ్ మొత్తానికి వింతగా ముగిసింది. ఇందులో కొంత మందిని చూస్తే అతికి అంబాసిడర్‌గా.. ఎవర్రా మీరంతా అనేలా ఉన్నారు. ఇక వీళ్లలో బిగ్ బాస్ ఇంట్లోకి ఎవరు వెళ్తారో చూడాలి.

Also Read'పరదా' రివ్యూ: అనుపమ సినిమా హిట్టా? ఫట్టా? 'శుభం' దర్శకుడి కొత్త సినిమా ఎలా ఉందంటే?