Chiranjeevi Bobby Kolli New Movie Concept Poster Out: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే రోజున ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ధమాకా వచ్చింది. మరోసారి సూపర్ హిట్ కాంబో రిపీట్ కానుంది. మెగాస్టార్ హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో మాస్ మహారాజ రవితేజ కూడా కీలక పాత్ర పోషించగా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ కానుంది.

మూవీ పోస్టర్ రిలీజ్

మెగాస్టార్ హీరోగా డైరెక్టర్ కేఎస్ రవీంద్ర (బాబీ) వస్తోన్న రెండో మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌ను చిరు బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ మూవీని తెరకెక్కించనున్నారు. గొడ్డలి వేటుతో రక్తపు ధార కిందకు వచ్చినట్లుగా కాన్సెప్ట్ పోస్టర్‌లో చూపించారు. 'రక్తపు బెంచ్ మార్క్‌ను నిర్ణయించిన కత్తి' అంటూ దీనికి క్యాప్షన్ ఇవ్వడం భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. దీన్ని చూస్తుంటే ఓ పవర్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతోంది. మరి వాల్తేరు వీరయ్య స్టైల్ రిపీట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.

Also Read: ఓటీటీలోకి వచ్చేసిన 'మారీశన్' - అల్జీమర్ పేషెంట్‌తో ఓ దొంగ ఊహించని జర్నీని తెలుగులోనూ చూసెయ్యండి

డిఫరెంట్ స్టోరీనా?

ఇప్పటివరకూ ఇంతటి మాస్ ర్యాంపేజ్‌లో ఎప్పుడూ పోస్టర్‌ను చూడలేదంటూ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పోస్టర్ చూస్తుంటే పవర్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ అని కొందరు యాక్షన్ థ్రిల్లర్ అని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 'మెగా 158' వర్కింగ్ టైటిల్‌తో మూవీ తెరకెక్కబోతోంది. మొత్తానికి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మూవీ ఉండబోతుందనేది మాత్రం కన్ఫర్మ్. చిరంజీవిని ఇదివరకు ఎన్నడూ చూడని ఓ రోల్‌లో బాబీ చూపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. 'వాల్తేరు వీరయ్య'లానే ఈ మూవీ కూడా భారీ హిట్ కొట్టడం ఖాయమంటూ చెబుతున్నారు. మరి హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ ఇతర వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

ఫుల్ ట్రీట్

మెగాస్టార్ ఫ్యాన్స్‌కు ఆయన బర్త్ డే నిజంగా స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చింది. అటు సోషియా ఫాంటసీ థ్రిల్లర్ 'విశ్వంభర' నుంచి గ్లింప్స్  రిలీజ్ కాగా... స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి 'మన శంకరవరప్రసాద్ గారు' టైటిల్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. మెగాస్టార్‌ను ఫుల్ వింటేజ్, స్టైలిష్ లుక్‌లో చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. 'విశ్వంభర'లో భారీ యాక్షన్ సీక్వెన్స్, లుక్ కూడా అదిరిపోయాయి. తాజాగా, బాబీ డైరెక్షన్‌లో కాన్సెప్ట్ పోస్టర్ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్ గారు' రానుండగా... సమ్మర్‌కు 'విశ్వంభర' రిలీజ్ కానుంది.