Mega 157 Mana Shankara Vara Prasad Garu

'రౌడీ అల్లుడు' సాంగ్ బ్యాగ్రౌండ్ 

'కొండవీటిదొంగ'లో శుభలేఖ రాసుకున్నా సాంగ్ ని గుర్తుచేసే షాట్

కార్ డోర్ తీసుకుని ఫేస్ టర్నింగ్ ఇచ్చిన లుక్

మెట్లపై నడుస్తూ స్టైలిష్ గా దిగే సీన్

సిగరెట్ కాల్చడమే కాదు విసిరేయంలోనూ తన మార్క్ స్టైల్

నడకలోనూ ఒకప్పటి మ్యాజిక్ ...

బాసు చూపించు నీ గ్రేసు అని అడిగినవాళ్లకి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి

నిజంగా..మేం చూస్తున్నది 70 ఏళ్ల చిరంజీవినేనా? ఆ లుక్ ఏంటి? గ్రేస్ ఏంటి? తగ్గేదే లే అంటే ఇదేనేమో...

రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ చిరులో ఏదో మ్యాజిక్ తగ్గిందన్న ప్రశ్నలకు షాకయ్య ఆన్సరిచ్చారు 'మన శంకర వరప్రసాద్ గారు' తన సినిమాలు చూస్తూ పెరిగిన ఓ వీరాభిమాని ...దర్శకుడిగా మారి సినిమా తీస్తే ఎలా ఉంటుందో మెగా 157 మరోసారి ప్రూవ్ చేస్తుందా అనేలా ఉంది టైటిల్ గ్లింప్స్ లుక్

ఏదో మాయాజాలం చేశారులే..VFX బాగా వాడేశారేమో అనే అపోహలు అస్సలొద్దు.. ఇదంతా మెగాస్టార్ కష్టమే. ఈ విషయం మేం చెప్పడం లేదండోయ్..స్వయంగా దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో భారీ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసేందుకు అతిగా VFX వాడేస్తున్నారు. కానీ మెగా 157 లో అనిల్ రావిపూడి VFX  లేకుండా హీరోని చూపించాడు. టీజర్ మొత్తం చిరంజీవిదే..VFX కి నో ఛాన్స్. 

చిన్నతనం నుంచీ మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను.. ఆయన నటించిన సినిమాలు అన్నిటిలో రౌడీ అల్లుడు, గ్యాంగ్‌ లీడర్‌, ఘరానా మొగుడు అంటే చాలా ఇష్టం. చాలా సందర్భాల్లో, ఇంటర్యూల్లో ఈ మాట చెప్పాను. మీరంతా చిరంజీవిని సిల్వప్ స్క్రీన్ పై ఎలా చూడాలి అనుకుంటున్నారో..అంతకు రెండింతలు  ‘మన శంకరవరప్రసాద్‌గారు’లో చూస్తారని అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేశారు అనిల్ రావిపూడి. ఆయన అసలు పేరుని శివశంకర వరప్రసాద్‌ను  మార్చి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ అనే టైటిల్ ఫిక్స్ చేశాం అని చెప్పారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన చిరంజీవికి ధన్యవాదాలు అంటూనే..మరో ఇంట్రెస్టింగ్ విషయం అంటూ మెగాస్టార్ లుక్ గురించి చెప్పారు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో కనీసం 5 శాతం కూడా వీఎఫ్ఎక్స్ వాడలేదు.. ఈ లుక్ ఒరిజనల్.. ఇందుకోసం చిరంజీవి చాలా కష్టపడ్డారు. ఆ కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు ఫ్యాన్స్ కళ్లలో ఆనందంలో కనిపిస్తోందన్నారు అనిల్ రావిపూడి. ఇదంతా నా అదృష్టం.. బాస్ పండక్కి వచ్చేస్తున్నారంటూ మరోసారి చెప్పి ఎప్పుడెప్పుడు సంక్రాంతి వస్తుందా అని ఎదురుచూసేలా చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి.  శంకరవరప్రసాద్‌ లుక్ తోనే సినిమా సగం హిట్ టాక్ వచ్చేసినట్టే.. ఈ లుక్ చాలబ్బా మూవీ చూసేందుకు అని ఫిక్సైపోయారు సినీ ప్రియులు. సాధారణంగా అనిల్ రావిపూడి సినిమాలంటే హిట్ గ్యారంటీ చూడొచ్చు అనుకుంటారు..ఈసారి చిరు లుక్ అందుకు అదనం.  ఇక అనిల్ రావిపూడి మార్క్  టేకింగ్ ...చిరంజీవి కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో తెలుసుకదా.. సంక్రాంతికి బాక్సాఫీస్ ని రప్ఫాడించేలానే ఉన్నారు..