Bigg Boss Telugu Season 9 Agnipariksha Promo: బిగ్ బాస్ అగ్నిపరీక్ష మొదలైంది. మొత్తం 45 మందికి టాస్కులు పెట్టి ఫైనల్‌గా 15 మందిని ఎంపిక చేసి వారికి 'మహా అగ్నిపరీక్ష' పెట్టనుంది బిగ్ బాస్ టీం. వీరిలో ఐదుగురికి హౌస్‌లోకి పంపించనున్నారు. అగ్నిపరీక్షకు జడ్జెస్‌గా నవదీప్, అభిజిత్, బిందు మాధవిలు వ్యవహరిస్తున్నారు. కొందరు కంటెస్టెంట్స్ ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుండగా... మరికొందరు కంటెస్టెంట్స్ అతి చేస్తూ జడ్జెస్‌‌‌కు చిరాకు తెప్పించారు.

ఫస్ట్ ఎపిసోడ్‌లో విజయవాడ నుంచి వచ్చిన దివ్య నిఖిత, హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రసన్న కుమార్‌లు తమ పెర్ఫార్మెన్స్‌తో జడ్జెస్‌ను ఇంప్రెస్ చేశారు. వీరిద్దరినీ డైరెక్ట్‌గా టాప్ 15లోకి పంపించేశారు. ఇక మల్టీస్టార్ మన్మథ రాజాను డైరెక్ట్‌గా ఎలిమినేట్ చేసేశారు. మాస్క్ వేసుకుని తన ఆటిట్యూడ్‌తో జడ్జెస్‌ను విసిగించిన హరీష్‌ను హోల్ట్ చేశారు. ఇక నల్గొండ నుంచి వచ్చిన కేతమ్మ, కర్నూలు నుంచి వచ్చిన ప్రియలను  హోల్డ్ చేశారు. రైల్వేకోడూరు నుంచి వచ్చిన అబు బుక్కర్‌ను హోల్డ్ చేయగా... విశాఖ నుంచి వచ్చిన మాధురి అనే అమ్మాయిని కూడా డైరెక్ట్‌గా ఎలిమినేట్ చేశారు.

శ్రీముఖి వర్సెస్ కంటెస్టెంట్

ఇక రెండో ఎపిసోడ్ ప్రోమోస్ తాజాగా రిలీజ్ చేయగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఎపిసోడ్‌లో యంగ్ హీరో తేజ సజ్జా స్పెషల్ అపియరెన్స్ ఇచ్చారు. ఇక కంటెస్టెంట్ దమ్ము శ్రీజ స్టేజీ మీదకు వస్తూనే పడిపోతున్నట్లుగా నటించి అతి చేశారు. 'జస్ట్ కిడ్డింగ్ గాయ్స్... అందరి అటెన్షన్ నాపైనే ఉంది కదా.' అంటూ ఓవర్ చేయగా జడ్జెస్ షాక్ అయ్యారు. 'బిగ్ బాస్‌కు ఎందుకు పంపాలి నిన్ను' అంటూ నవదీప్ ప్రశ్నించగా... ఎందుకు పంపకూడదు? అంటూ తిరిగి క్వశ్చన్ చేశారు.

దీంతో 'అలా మొత్తుకుంటే ఏం అరుస్తుంది ఈ పిల్ల అని టీవీ బంద్ చేస్తారు.' అంటూ శ్రీముఖి అనగా... 'అలా అనుకుంటే సీజన్ 2, 3 అక్కా నువ్వు అప్పుడే బంద్ చేసేవారు కదా' అంటూ శ్రీజ శ్రీముఖికి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో అభిజిత్ ఆమెకు రెడ్ ఇవ్వగా... 'కొంచెం పవర్ ఫుల్‌గా ఉండే వాళ్లను హ్యాండిల్ చేయలేక ముందే రెడ్ ఇచ్చేశారా?' అంటూ ఆయనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Also Read: బిగ్ బాస్ అగ్నిపరీక్షలో మాస్క్ మ్యాన్ ఆటిట్యూడ్... కేతమ్మ ఇన్‌స్పిరేషన్ - ఫస్ట్ ఎపిసోడ్ హైలెట్స్ ఇవే!

ముఖానికి పేడ రాసుకున్న కంటెస్టెంట్

మరో లేడీ కంటెస్టెంట్‌ను పేడ తీసుకుని ముఖానికి రాసుకోవాలని జడ్జెస్ చెప్పగా ఆమె అలానే చేశారు. మరో కంటెస్టెంట్ తన ఫిజిక్ ఎక్స్‌ర్‌సైజెస్‌తో జడ్జెస్‌ను ఇంప్రెస్ చేయాలని ప్రయత్నించినా లాభం లేకపోయింది. 

జానపద కళాకారుడు నర్సయ్య తన పాటతో జడ్జెస్‌ను ఇంప్రెస్ చేశారు. అయితే, హౌస్‌లో మీరు ఇమడగలరో? లేదో? అనే డౌట్ ఉందంటూ అభ్యంతరం తెలిపారు. అయితే, ఆ కంటెస్టెంట్ పుష్ అప్స్ తీసి చూపించడం హైలెట్‌గా నిలిచింది. మరో కంటెస్టెంట్... 'ఫిజికల్లీ నేను ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఏం లాభం. మెంటల్‌గా స్ట్రాంగ్ లేకుంటే?' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.