Bigg Boss 9 Agnipariksha Contestants Prasanna Kumar Profile: ఫేమస్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ఈసారి భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈసారి సామాన్యులకు సైతం అవకాశం కల్పిస్తుండడంతో హౌస్‌లో సెలబ్రిటీస్ వర్సెస్ సామాన్యుల మధ్య వార్ షురూ కానుంది. 15 మంది సామాన్యులకు 'అగ్నిపరీక్ష' కండక్ట్ చేస్తూ వీరిలో ఐదుగురిని హౌస్‌లోకి పంపించనున్నారు జడ్జెస్. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోస్‌లో కామనర్స్ ఫేసులు రివీల్ చేసింది బిగ్ బాస్ టీం.
ఆ కామనర్స్ వీరే...
మాస్క్ మ్యాన్ హృదయ్, యాంకర్ మల్లీశ్వరి, ఉత్తర ప్రశాంత్, రవి, కల్కి, ప్రసన్న కుమార్, నర్సయ్య, సిద్ధిపేట మోడల్, దమ్ము శ్రీజ, ఊర్మిళ చౌహాన్, డీమన్ పవన్, అనూష రత్నం, శ్వేత శెట్టి, వెజ్ ఫ్రైడ్ మోమో, ప్రియాశెట్టి, కేతమ్మ కంటెస్టెంట్స్ కాగా వీరిలో దివ్యాంగుడు ప్రసన్నకుమార్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయనతో పాటే కేతమ్మ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. వీరిద్దరి ప్రోమోతో పాటే మాస్క్ మ్యాన్ హృదయ్ ప్రోమో కూడా వైరల్ అవుతోంది.
ఎవరీ ప్రసన్నకుమార్?
దివ్యాంగుడైన ప్రసన్నకుమార్ బిగ్ బాస్ అగ్నిపరీక్షలో ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారు. ఇతను ఫోటోగ్రాఫర్, ట్రావెలర్, లెక్చరర్, జావెలిన్ త్రో స్టేట్ ప్లేయర్, బాడీ బిల్డర్, బైక్ రైడర్. మారథాన్‌లో పరిగెత్తి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. గతంలో 'ఆహా' అన్ స్టాపబుల్ విత్ NBK షోలో బాలయ్య స్వయంగా ప్రసన్నకుమార్ గురించి ప్రస్తావించి అభినందించారు. ఆయన ఎందరికో స్ఫూర్తి అంటూ కొనియాడారు. ప్రస్తుతం 'అగ్నిపరీక్ష'లో ప్రసన్నకుమార్ తన జర్నీ గురించి వివరించారు. ఆయన స్టోరీ విన్న జడ్జెస్ ఫిదా అయిపోయినట్లు లేటెస్ట్ ప్రోమోను బట్టి తెలుస్తోంది.
తాను నిలబడడమే గొప్ప అని... నడవడం, పరిగెత్తడం ఇవన్నీ చేయడం బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అంటూ ప్రసన్నకుమార్ చెప్పగా... 'మీ కథను మేము ప్రపంచానికి చూపించకుంటే మాకు నిద్ర ఉండదు.' అంటూ జడ్జ్ నవదీప్ చెప్పడంతో ఆయన హౌస్‌లోకి ఎంటర్ అయ్యారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: 'కొత్తపల్లిలో ఒకప్పుడు' ఏం జరిగింది? - ఇప్పుడే ఓటీటీలో చూసేయండి
గంగవ్వ వయసున్న కేతమ్మ
బిగ్ బాస్ 'అగ్నిపరీక్ష'లో గంగవ్వ వయసున్న కేతమ్మ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. తలపై అమ్మవారి బోనం ఎత్తుకున్నట్లుగా ఆమె ఎంట్రీ అదిరిపోయింది. నల్లగొండ దగ్గర తొండ తిరుమలగిరి తమ ఊరని... తన భర్తకు పక్షవాతం రాగా తన చిన్న బడ్డ తనను, తన భర్తను చూసుకుంటుందని చెప్పారు. జీవితంలో అన్నీ కష్టాలు చూశానని తెలిపారు. 'మీరు జీవితంలో చూసినంత సగం నేను చూడలేదమ్మా. కానీ ఆట నేను చూశా. చాలా కష్టంగా ఉంటుందవ్వా మీకు.' అంటూ జడ్జ్ అభిజిత్ చెప్పగా... 'నాకు తోచినంత ఆడతా. మీరు 10 మందిని కొట్టుకొస్తే నేను ఒక్కళ్లనైనా కొట్టుకొస్తా.' అంటూ కాన్ఫిడెంట్‌గా సమాధానం ఇచ్చారు.
దీంతో ఫిదా అయిన జడ్జ్ అభిజిత్ ఆమెకు గ్రీన్ కార్డ్ చూపించారు. దీంతో ఆమె కూడా హౌస్‌లోకి ఎంటర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ 15 మందిలో ఎవరు ఇన్ ఎవరు అవుట్ అనేది తెలియాలంటే ఈ నెల 22 వరకూ ఆగాల్సిందే. అగ్ని పరీక్ష ఎపిసోడ్స్ ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.