Prerana Vote Appeal: బిగ్ బాస్ ఇంట్లో ఓట్ అప్పీల్ గురించి టాస్క్ పెట్టాడు. ఈ మేరకు మూడు జంటలుగా కంటెస్టెంట్లను డివైడ్ చేశాడు. నబిల్, గౌతమ్.. ప్రేరణ, నిఖిల్.. విష్ణు, ప్రేరణలు జంటలుగా మారారు. మధ్యలో శేఖర్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్లతో ఆటలు ఆడించారు. అలా మంగళవారం నాటి ఎపిసోడ్‌లో అయితే ప్రేరణ ఓట్ అప్పీల్ చేసుకుంటూ ఆడియెన్స్‌కు తాను చెప్పదల్చుకున్నది చెప్పేసింది. ఇక ఎపిసోడ్ ఎలా సాగిందంటే..
అవినాష్, రోహిణి, నబిల్, ప్రేరణ మధ్య వాగ్వాదం జరిగింది. తేజకు ఛాన్స్ ఇవ్వడం తప్పు అంటూ అవినాష్, రోహిణి మీద నబిల్, ప్రేరణ విమర్శలు చేశారు. గౌతమ్‌కి ఇవ్వాల్సింది అంటూ నబిల్ అంటాడు. మరి బ్లాక్ బ్యాడ్జ్ గౌతమ్‌కు ఎందుకు ఇచ్చారు.. మాట మార్చుతున్నావా? నీకు క్లారిటీ ఉండటం లేదు అని నబిల్‌ను అవినాష్ కార్నర్ చేశాడు. ఆడి గెలుచుకోవాలి అంటూ రోహిణి చెబితే.. తేజ ఏం గెలిచాడు అని ప్రేరణ అంటుంది. మరి నువ్వేం గెలిచావ్ అంటూ అవినాష్ నిలదీస్తాడు. అలా వారి మధ్య వాగ్వాదం జరుగుతుంది.
ఇక నబిల్ వాగ్వాదం పెట్టుకున్న తీరు గురించి రోహిణి, అవినాష్ మాట్లాడుకున్నారు. అసలు వేరే వాళ్లు చెప్పేది వినడు.. వేరే వాళ్లని మాట్లాడనివ్వడు అంటూ నబిల్ గురించి రోహిణి చెప్పింది.చాలా సెల్ఫీష్ అయ్యాడు.. ఇక్కడ సెల్ఫీష్‌గానే ఉండాలని నాతో చెబుతున్నాడు అంటూ నబిల్ గురించి రోహిణితో అవినాష్ చెప్పుకొచ్చాడు.
Also Read: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎపిసోడ్ 89 రివ్యూ: సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
ఆ తరువాత నా టవర్ ఎత్తైనది అనే టాస్కుని పెట్టాడు. ఇందులో ఫస్ట్ రౌండ్‌లో నబిల్, గౌతమ్ అవుట్ అవుతారు. చివరకు నిఖిల్, ప్రేరణ గెలుస్తారు. రెండో స్థానంలోకి వచ్చిన విష్ణు, రోహిణిలకు బిగ్ బాస్ మరో ఛాన్స్ ఇచ్చాడు. ఇద్దరిలోంచి ఎవరో ఒకరు నెక్ట్స్ రౌండ్‌లోకి రావొచ్చని తెలిపాడు. దీంతో రోహిణి కోసం విష్ణు త్యాగం చేసింది. అలా రెండో రౌండ్‌లో నిఖిల్, ప్రేరణ, రోహిణి కలిసి ఆడతారు. అందులో ప్రేరణ విన్ అయింది.
ఓట్ అప్పీల్ కోసం ప్రేరణ వచ్చి తాను చెప్పదల్చుకుంది చెప్పింది. ఎవ్వరూ పర్ఫెక్ట్‌గా ఉండరు.. నేను తప్పులు చేశా.. తెలుసుకుంటున్నాను.. నేర్చుకుంటున్నాను.. 13 వారాలు సపోర్ట్ చేస్తూ వచ్చారు.. ఈ వారం కూడా సపోర్ట్ చేయండి.. నేను విన్నర్ అవ్వాలని అనుకుంటున్నాను..ప్లీజ్ ఓట్ చేయండి.. అని వేడుకుంది. ఆ తరువాత ఇంట్లోకి శేఖర్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చాడు. కంటెస్టెంట్లతో శేఖర్ మాస్టర్ ఆటలు ఆడించి వెళ్లిపోయాడు. పనిలో పనిగా పుష్ప 2 ప్రమోషన్స్‌ను బిగ్ బాస్ చేశాడు. పీలింగ్స్ పాట వేసి.. అందరిలోనూ ఊపు పెంచేశాడు. పాటను రివర్స్ ప్లే చేసి పెట్టిన ఈ టాస్కులో కంటెస్టెంట్లు డ్యాన్స్‌తో అలరించేశారు. చివరకు పీలింగ్స్ పాటకు కంటెస్టెంట్లతో కలిసి శేఖర్ మాస్టర్ స్టెప్పులు వేశాడు. మరి రేపటి ఎపిసోడ్‌లో టాస్కుల్లో గెలిచి ఎవరు ఓట్ అప్పీల్ కోసం వెళ్తారో చూడాలి.