Avinash on TTF And Sreemukhi Suggests Vishnu Priya About Pruthvi: బిగ్ బాస్ ఇంట్లో పదమూడో వారం టికెట్ టు ఫినాలే టాస్క్ జరిగింది. శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో అవినాష్ టికెట్ టు ఫినాలే టాస్క్ విన్ అయ్యాడు. అలా ఈ సీజన్ మొదటి ఫైనలిస్ట్ కంటెస్టెంట్‌గా అవినాష్ నిలిచాడు. ఈ ఆట ఆడించేందుకు శ్రీముఖి ఇంట్లోకి వచ్చింది. ఇక శ్రీముఖి తన స్నేహితురాలైన విష్ణుకి కొన్ని సలహాలు ఇచ్చింది. పృథ్వీకి కూడా శ్రీముఖి కొన్ని మాటలు చెప్పింది. అసలు ఈ శుక్రవారం ఎపిసోడ్ ఎలా సాగిందో చూద్దాం.


ఇప్పటి వరకు నిఖిల్, అవినాష్, రోహిణిలు కంటెండర్లు అయ్యారు. గౌతమ్, పృథ్వీ, తేజలు ఇంత వరకు కంటెండర్ కాలేదు. అలా అని బ్లాక్ బ్యాడ్జ్‌ కూడా రాలేదు. కాబట్టి ఈ ముగ్గురిలోంచి ఎవరో ఒకరిని కంటెండర్‌గా తీసుకోండని రోహిణి, అవినాష్, నిఖిల్‌కు బిగ్ బాస్ చెప్పాడు. దీంతో రోహిణి, అవినాష్ కలిసి తేజ పేరు చెప్పారు. దానికి నిఖిల్ కూడా ఒప్పుకున్నాడు. కానీ బయటకు వెళ్లాక మళ్లీ మాట మార్చాడు. తన మిత్ర బృందంతో మాట్లాడుతూ అంతా రోహిణి, అవినాష్ చేశారన్నట్టుగా ప్రొజెక్ట్ చేశాడు నిఖిల్.


తేజ, అవినాష్, రోహిణిలు ముగ్గురూ అనర్హులే అని పృథ్వీ తన అక్కసు వెల్లగక్కాడు. ఇంట్లోకి వచ్చిన శ్రీముఖి అందరితో ఆట ఆడించింది. ఈ క్రమంలో విష్ణుకి కొన్ని సలహాలు ఇచ్చింది. నువ్వు బయట ఎలా ఉన్నావో.. ఇక్కడ కూడా అలానే ఉంటున్నావ్.. కానీ ప్రతీ సారి పక్కోళ్ల గురించే కాదు నీ గురించి కూడా ఆలోచించుకో అని సలహా ఇచ్చింది. ఆ తరువాత నిఖిల్, అవినాష్, రోహిణి, తేజల్లోంచి టాస్కులు ఎవరు గెలుస్తారో ఓ వరుస క్రమంలో చెప్పండని మిగిలిన కంటెస్టెంట్లకు శ్రీముఖి టాస్క్ ఇచ్చింది.


అలా వరుస క్రమం చెబితే.. మొదటి స్థానంలో ఉన్న వారికి ఐదు లక్షలు, ఆ తరువాత ఉన్న వారికి నాలుగు, మూడు, రెండు లక్షలు అని ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ నిఖిల్‌కు మొదటి ప్లేస్ ఇస్తే అతడికి ఐదు లక్షలు బ్యాడ్జ్ పెట్టాల్సి ఉంటుంది. ఒక వేళ నిజంగానే టాస్కులో నిఖిల్ గెలిస్తే ఆ ఐదు లక్షలు ప్రైజ్ మనీకి వెళ్తాయని శ్రీముఖి చెబుతుంది. అలా ఇంటి సభ్యుల మెజార్టీ నిర్ణయంతో.. నిఖిల్ ఐదు లక్షలు, అవినాష్ నాలుగు లక్షలు.. రోహిణి మూడు లక్షలు.. తేజకు రెండు లక్షలు.. బ్యాడ్జ్ పెడతారు.


ఆ తరువాత విష్ణుని ఓ సైడ్ కూర్చో పెట్టుకుని శ్రీముఖి సలహాలు ఇచ్చింది. మొదటి రెండు వారాలు చూస్తే నువ్వే విన్నర్ అని అనుకున్నారు.. కానీ రాను రాను మారుతూ వచ్చింది.. నువ్వు ఫోకస్ వేరే వాళ్ల మీద పెట్టడం.. ఇష్టం పడటం తప్పు కాదు.. ధైర్యంగా ఇన్ని కెమెరాల ముందు చెప్పడం కూడా గట్సే.. ఇంత పెద్ద షోకి వచ్చావ్.. ఫ్రెండ్ షిప్ బయట కంటిన్యూ చేయొచ్చు.. ఓ వ్యక్తి నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పిన తరువాత.. ఎందుకు ఇలా చేస్తావ్.. నువ్వు ఇచ్చిన ప్రేమకు అవతలి వాళ్లు కూడా విలువ ఇవ్వాలి.. ఆయన ఆట ఆడతాడు.. నువ్వు ఎంకరేజ్ చేయకపోతే ఆడడా.. నీ ఆట నువ్వు ఆడుకో.. ఇంకో రెండు వారాలే ఉన్నాయి.. నీ ఫ్రెండ్‌గా చెబుతున్నా అని శ్రీముఖి చెప్పింది.


Also Read: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎపిసోడ్ 89 రివ్యూ: సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే


.


గుర్తు పట్టు.. గంట కొట్టు అనే టాస్కులో చివరకు తేజ అవుట్ అయ్యాడు. ఆ తరువాత పృథ్వీకి కూడా శ్రీముఖి సలహాలు ఇచ్చింది. ఆమెకు హోప్ పెట్టుకోవద్దని చెప్పా అని పృథ్వీ అంటే.. ఇంక ఉన్నది రెండు వారాలే షో మీద ఫోకస్ పెట్టుకుందామని మాట్లాడుకుని దూరంగా ఉండొచ్చు కదా.. అని శ్రీముఖి సలహా ఇచ్చింది. రెండు వారాలే ఉన్నాయ్.. నా ఆట మీద ఫోకస్ పెడ్తా.. నా మిత్రత్వం అంతగా ఉండకపోవచ్చు అని పృథ్వీతో శ్రీముఖి అంటుంది. నువ్వు నీ ఆట మీద ఫోకస్ పెట్టుకో.. నేను ఫోకస్ పెట్టొద్దని అన్నానా? అంటూ విష్ణు పరువు తీస్తాడు పృథ్వీ.


కేవలం ఒక్క అడుగు దూరం అంటూ చివరి టాస్కులో అవినాష్ అదరగొట్టేశాడు. అవినాష్‌కు టికెట్ టు ఫినాలే వస్తుంది. దీంతో కన్నడ బ్యాచ్ కుళ్లుకుని ఉంటుంది. నిఖిల్ గెలుస్తాడని పృథ్వీ, ప్రేరణ, నబిల్ చెప్పారు. కానీ అవినాష్ గెలిచి వారి అంచనాల్ని తలకిందులు చేశాడు. అవినాష్ గెలుపుతో రోహిణి, తేజ, గౌతమ్ ఫుల్ ఖుషీ అయ్యారు. మరి ఈ వారం ఎలిమినేషన్స్‌లో ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు.. ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఒక వేళ అవినాష్ ఎలిమినేట్ కావాల్సి వస్తే తరువాత ఏం జరుగుతుంది? అన్నది చూడాలి.


Also Read: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎపిసోడ్ 88 రివ్యూ: అదరగొట్టేసిన అవినాష్.. ఓహో అసలు కథ ఇదా?.. పృథ్వీ వెనకాల విష్ణు ప్రియ పడటానికి కారణం ఇదేనా?