Bigg Boss 8 Telugu Gautham Become Mega Chief : బిగ్ బాస్ ఇంట్లో ఏడో వారం మెగా చీఫ్‌గా గౌతమ్ గెలిచాడు. ఓవర్ స్మార్ట్ ఫోన్స్, ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్ అంటూ టాస్కు పెట్టాడు. అందులో నబిల్, పృథ్వీ, నిఖిల్‌ను మధ్యలోనే అవుట్ చేసేశారు. ఇక ఛార్జింగ్ పాయింట్లు సంపాదించుకుని రాయల్ క్లాన్ నుంచి అందరూ చీఫ్ కంటెండర్లు అయ్యారు. ఓజీ క్లాన్ నుంచి లేడీ కంటెస్టెంట్లంతా కూడా ఆటల్లో ఉండి చీఫ్ కంటెండర్లు అయ్యారు. అలా చివరకు అందరితో ఆట ఆడి.. రాకెట్ వేగంతో దూసుకుపోయి గౌతమ్ మెగా చీఫ్ అయ్యాడు. వచ్చీ రాగానే ఇంట్లో రూల్స్ మార్చే ప్రయత్నం చేశాడు గౌతమ్.


శుక్రవారం నాటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే.. కుషన్ టాస్క్ పెట్టి ఆట ఆడించాడు బిగ్ బాస్. ఆ ఆటకి పృథ్వీ సంచాలక్‌గా ఉన్నాడు. ఈ టాస్కులో ఒక్కొక్కరు.. ఇద్దరిద్దర్ని.. ముగ్గురముగ్గుర్ని పంపిస్తూ ఆట ఆడించాడు. ఈ ఆటలో రాయల్ క్లాన్ చివరకు విన్ అయింది. ఇలా టాస్క్ విన్ అవ్వడంతో ఓజీ క్లాన్ నుంచి ఇద్దర్నీ టాస్కు నుంచి పీకేసే ఛాన్స్ వచ్చింది. దీంతో నబిల్, నిఖిల్‌ను టాస్కు నుంచి తీసేశారు. అలా ఆట ముగిసిందని బిగ్ బాస్ తెలిపాడు.


ఆ తరువాత పృథ్వీ గడ్డం గురించి అంతా చర్చించుకున్నారు. ఈ క్రమంలో అవినాష్, పృథ్వీలకు బిగ్ బాస్ బొచ్చు టాస్క్ ఇచ్చాడు. జుట్టు ఎవరు కత్తిరించుకుంటారు.. ఏ స్టైల్లో ఎంత డబ్బు కోసం కట్ చేసుకుంటారో ఆప్షన్స్ ఇచ్చాడు. పృథ్వీ మాత్రం తన గడ్డాన్ని తీయలేనని అన్నాడు. అనినాష్ యాభై వేల ఆప్షన్‌ను ఎంచుకున్నాడు. అవినాష్ హెయిర్ కట్ వల్ల అలా బొచ్చుతో యాభై వేలు ప్రైజ్ మనీకి యాడ్ అయ్యాడు. అవినాష్ త్యాగానికి మెచ్చుకున్న బిగ్ బాస్.. కిచెన్ టైంకి రెండు గంటలు యాడ్ చేశాడు.


ఆ తరువాత ఫ్రీడం ఆయిల్ టాస్క్ ఇచ్చాడు. ఈ ప్రమోషనల్ యాడ్‌లో ఓజీ క్లాన్ విన్ అయింది. ఇక మెగా చీఫ్ కంటెండర్ టాస్కు కోసం పట్టుకో లేదా తప్పుకో అని ఆట పెట్టాడు. ఆ సర్కిల్ గీశాడు.. మధ్యలో ఓ బోన్ లాంటి దాన్ని పెట్టాడు. అందరూ ఆ సర్కిల్ చుట్టూ ఉండాలని అన్నాడు. ఎవరు అయితే ఆ బోన్‌ను పట్టుకుంటారో.. పట్టుకున్న ప్రతీసారి మిగతా కంటెస్టెంట్లను ఈ టాస్కు నుంచి తప్పించే ఛాన్స్ వస్తుందని అన్నాడు. అలా ప్రతీ సారి గౌతమ్ ఆ బోన్‌ను చేజిక్కించుకున్నాడు. అలా కంటిన్యూగా మెహబూబ్, అవినాష్‌లను అవుట్ చేశాడు. రెండో రౌండ్‌లో విష్ణు, ప్రేరణని తప్పించాడు. మూడో రౌండ్‌లో యష్మీ, నయనిలను అవుట్ చేశాడు.


Also Read: బిగ్ బాస్ తెలుగు 8 ఎపిసోడ్ 47 రివ్యూ: నయని నస... టాస్కుల్లో మణి ప్రయాస - ఛార్జింగ్ కొట్టేసిన తేజ అండ్ మెహబూబ్



నాలుగో రౌండ్‌లో ఆ బోన్‌ను మణికంఠ పట్టుకుంటాడు. అయితే ముందుగా తేజ, హరితేజల పేర్లు చెప్పాడు. ఆ తరువాత మాట మార్చి తేజ, గౌతమ్‌ల పేర్లు చెప్పాడు. దీంతో నిర్ణయాన్ని సంచాలక్‌కి వదిలేశాడు బిగ్ బాస్. మణి ముందుగా చెప్పిన పేర్లనే సంచాలక్ నిఖిల్ పరిగణలోకి తీసుకున్నాడు. దీంతో చివరి వరకు ఆ ఆటలో నిలబడి.. గౌతమ్ మెగా చీఫ్ అయ్యాడు. మెగా చీఫ్ అయ్యాక.. ఇంట్లోని లేడీ కంటెస్టెంట్లందరికీ విరామం ఇస్తున్నట్టుగా ప్రకటించాడు. పనులన్నీ మగ కంటెస్టెంట్లే చేస్తారని అన్నాడు. మరి ఈ నిర్ణయం పట్ల ఇంట్లో ఎలాంటి గొడవలు జరుగుతాయో మున్ముందు చూడాలి.


Also Readబిగ్ బాస్ తెలుగు 8 ఎపిసోడ్ 46 రివ్యూ: ‘హరి’కథతో మణికంఠ ఫిదా.. పాత పద్దతినే ఫాలో అయిన అవినాష్... ఈ రోజు హౌస్‌లో ఏం జరిగిందంటే?