Bigg Boss Telugu Season 8 :  బిగ్ బాస్ ఇంట్లో ఏడో వారంలో ఓవర్ స్మార్ట్ ఫోన్‌లు వర్సెస్ ఛార్జింగ్‌లు అనే టాస్క్ పెట్టాడు. నాలుగో సీజర్లో రోబోలు, మనుషులు అనే టాస్క్‌ను కాస్త అటూ ఇటూ మార్చి ఇప్పుడు బిగ్ బాస్ మళ్లీ కంటెస్టెంట్లను ఓ ఆట ఆడించేశాడు. రాయల్ క్లాన్ స్మార్ట్ ఫోన్‌లుగా.. ఓజీ క్లాన్ ఛార్జింగ్‌లు వ్యవహరిస్తారు. ఈ టాస్కుని గత సీజన్‌లో పెట్టారని, అప్పుడు మెహబూబ్, అవినాష్ కూడా ఉన్నారని, ఆ టైంలో అమ్మాయిని కిడ్నాప్ చేసి మరీ ఛార్జింగ్ పెట్టుకున్నారని నిఖిల్ అన్నాడు. అయితే ఈ టాస్కు ఇంకా పూర్తిగా బుధవారం నాటి ఎపిసోడ్‌లో జరగలేదు.


బుధవారం నాటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే.. నామినేషన్‌ల అనంతరం ప్రేరణ తన టీం మీద గుర్రుగా ఉంది. విష్ణుని ప్రేరణ కడిగి పారేసింది. తనకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదని విష్ణుని ప్రేరణ నిలదీసింది. ఇక ఇన్‌ఫినిటీ రూంలోకి వెళ్లి నబిల్ కోరిన కోరికను బిగ్ బాస్ నేరవేర్చాడు. కాకపోతే దానికి కొన్ని  కండీషన్లు పెట్టాడు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నన్ని రోజులు స్వీట్స్, డ్రింక్స్ ముట్టకూడదని నబిల్‌కు కండీషన్ పెట్టాడు. అలా అయితే వారం రోజుల పాటు అన్ లిమిటెడ్ రేషన్ వస్తుందని అన్నాడు. ఆ కండీషన్‌కు నబిల్ ఒప్పుకున్నాడు. మెగా చీఫ్ మెహబూబ్ వెళ్లి బీబీ సూపర్ మార్కెట్ నుంచి అన్ లిమిటెడ్ రేషన్ పట్టుకొచ్చాడు.


ఆ తరువాత మణికంఠ.. గంగవ్వతో కామెడీ చేశాడు. తాను  ఈ వారం సేవ్ అయితే అర్దతులం బంగారం ఇస్తానని, తన కోసం దేవుడ్ని ప్రార్థించమని బేరం పెట్టుకున్నాడు. అక్కడ రోహిణి కాస్త కామెడీ చేసింది. నేను కూడా ప్రేయర్ చేస్తా.. నాకేం ఇస్తావ్ అని అడిగింది. నేను సేవ్ అయితే ముద్దు ఇస్తా అని మణికంఠ కామెడీ చేశాడు. చివరకు గంగవ్వ మీద ఒట్టేసి అర్దతులం ఇస్తానని అన్నాడు. అందరినీ నవ్వించమని అవినాష్, రోహిణిలకు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు.  నామినేషన్ ప్రాసెస్‌లో అవినాష్, పృథ్వీ, తేజలను రోహిణి ఇమిటేట్ చేసింది.


Also Read: బిగ్ బాస్ తెలుగు 8 ఎపిసోడ్ 44 రివ్యూ: ఈ వారం నామినేషన్ల రచ్చ... పృథ్వీపై గంగవ్వ గుస్సా, నయనిపై తిట్ల పురాణం - ప్రేరణపై కోపంతో నిఖిల్‌కు స్ట్రాంగ్ వార్నింగ్



దీంతో బిగ్ బాస్ సంతోషించి.. కిచెన్ టైంని రెండు గంటలు ఇచ్చాడు. ఆ తరువాత బిగ్ బాస్ కథను చెప్పి.. ఓవర్ స్మార్ట్ ఫోన్‌లు రాయల్ టీం, ఛార్జింగ్ ఓజీ టీం అని చెప్పాడు. దీంతో అవినాష్ దొంగతనంగా ఛార్జింగ్ పెట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ అది విఫలం అయింది. గత సీజన్‌లో అమ్మ రాజశేఖర్ నుంచి దొంగతనంగా అవినాష్ ఛార్జింగ్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సారి అది వర్కౌట్ కాలేదు. ఛార్జింగ్ పాట్‌లను కూడా సరిగ్గా పగలగొట్టలేకపోయారు. ఇక మణికి హరితేజ హరికథ చెప్పి ఫిదా చేసింది. మణి బిగ్ బాస్ జర్నీని హరితేజ హరికథ రూపంలో బాగా చెప్పింది. దీంతో మణికంఠ ఛార్జింగ్ ఇచ్చి.. హరితేజ పాయింట్‌ను పెంచాడు. మరి ఈ టాస్కులో గురువారం నాడు పెద్ద పెద్ద గొడవలే జరిగేట్టున్నాయి.


Also Readబిగ్ బాస్ తెలుగు 8 ఎపిసోడ్ 43 రివ్యూ... హౌస్ లో దసరా సంబరాలు - ఆటా పాటతో అదరగొట్టిన హీరోయిన్లు వీళ్ళే - పాపం కిరాక్ సీతకు బ్యాడ్ డే